Srinagar NIT
-
ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తే రూ. 5000 జరిమానా..!
ఆసియా కప్ 2022లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్ 28) రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగకపోవడంతో ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా ఇరు దేశాలు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో తలపడగా.. అక్కడ భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. దాయాది చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే మ్యాచ్‌లో పాక్‌పై ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇదిలా ఉంటే, దాయాదుల సమరం ప్రారంభానికి కొద్ది గంటల ముందు శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) యాజమాన్యం జారీ చేసినట్లు చెబుతున్న కొన్ని వివాదాస్పద అంక్షలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పలు మాధ్యమాల ద్వారా అందిన వివరాల మేరకు.. ఎన్ఐటీ విద్యార్ధులు ఇవాళ జరిగే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షిస్తే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యం హెచ్చరించినట్లు తెలుస్తోంది. విద్యార్ధులు హాస్టల్ గదుల్లో గుంపులుగా చేరి మ్యాచ్‌ను చూసినా, మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా.. సంబంధిత విద్యార్ధులను హాస్టల్ గది ఖాళీ చేయించడంతో పాటు రూ. 5000 జరిమానా విధిస్తామని కళాశాల డీన్ హెచ్చరించినట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో విద్యార్ధులంతా తమతమ గదుల్లోనే ఉండాలని, అలా కాకుండా యాజమాన్యం హెచ్చరికలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని నోటీసుల జారీ చేసినట్లు తెలుస్తోంది. 2016లో ఓ మ్యాచ్ సందర్భంగా ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఈ అంక్షలు జారీ చేసినట్లు ఎన్ఐటీ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్! -
ఆర్టికల్ 370 రద్దు: శ్రీనగర్ ఎన్ఐటీ పునఃప్రారంభం
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో 74రోజులపాటు మూతబడిన శ్రీనగర్ ఎన్ఐటీ తిరిగి ప్రారంభమైంది. సుదీర్ఘ సెలవులు అనంతరం క్యాంపస్‌ను మంగళవారం రీఓపెన్ చేశారు. అయితే బయటరాష్ట్రాల విద్యార్థులు ఇంకా రావాల్సి ఉంది. లోయలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని భావిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపడానికి భయపడుతున్నారు. అలాగే ఇంటర్నెట్ లేకుండా చదువుకోవడం ఇబ్బందికరమని భావిస్తున్న విద్యార్థులు కూడా మరికొన్ని రోజులు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. క్యాంపస్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో శ్రీనగర్ ఎన్ఐటీ వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులు..
-
ఢిల్లీకి చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులు..
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్ నిట్‌కి సెలవులు ప్రకటించడంతో.. తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. 31మంది నిట్ తెలుగు విద్యార్థులు తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో వీరిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ రిసీవ్ చేసుకున్నారు. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. ఢిల్లీ నుంచి తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తరలేందుకు ఏపీ భవన్ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి జమ్మూ నుంచి బయల్దేరారు. నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు నిరవధిక సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలో నిట్ విద్యార్థులు స్వరాష్ట్రాలకు పయనమయ్యారు. కాలేజీ యాజమాన్యం కూడా నాలుగు బస్సులు ఏర్పాటుచేసి విద్యార్థులను శ్రీనగర్ నుంచి జమ్మూ తరలించింది. అక్కడి నుంచి తెలుగు విద్యార్థులు ఢిల్లీ వెళ్లేందుకు ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ఢిల్లీలోని ఏపీ భవన్ తగిన చర్యలు చేపట్టింది. ఇక, గతరాత్రి 23మంది నిట్ తెలుగు విద్యార్థులు జమ్మూ అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ బయల్దేరారు. మరో 86మంది ప్రత్యేక రైలులో జమ్ము నుంచి ఢిల్లీకి వస్తున్నారు. సోమవారం కల్లా విద్యార్థులు తమ తమ ఇళ్లకు చేరుకుంటారని ఏపీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది: తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా తెలుగు విద్యార్థులు సాక్షి టీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్ని రకాల సదుపాయాలు కల్పించిందని, తక్షణమే స్పందించి తమ ప్రయాణానికి వీలుగా ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. రైలులో ప్రత్యేకంగా రెండు బోగీలు ఏర్పాటు చేసి జమ్మూ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారని, ప్రయాణంలో తమకు భోజన సదుపాయం కల్పించారని విద్యార్థులు తెలిపారు. కశ్మీర్లో ప్రస్తుతానికి సాధారణ పరిస్థితులు ఉన్నాయని, 15 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టు తమ కాలేజీ యాజమాన్యం తెలిపిందని విద్యార్థులు వివరించారు. ఆగస్టు 15 కల్లా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్టికల్ 35ఏ రద్దు చేస్తారనే ప్రచారం కశ్మీర్లో జరుగుతోందని, ఆర్టికల్ 35 ఏ అనేది ఏకైక గుర్తింపని అక్కడి తోటి స్టూడెంట్స్ చెబుతున్నారని, దీనిని రద్దు చేస్తే పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం కనబడుతోందని, ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా ఇతర రాష్ట్ర విద్యార్థులందరినీ పంపించివేస్తున్నారని చెప్పారు. వీలైతే కశ్మీర్ నిట్‌లోని తెలుగు విద్యార్థులను జమ్మూ నిట్‌కి బదిలీ చేయాలని కోరుతున్నామని, కశ్మీర్లో పదే పదే ఇటువంటి పరిస్థితుల వల్ల తమ చదువులకు అంతరాయం కలుగుతోందని అన్నారు. కశ్మీర్‌లోని తమ నిట్ క్యాంపస్‌ను ఆర్మీ బేస్ క్యాంపుగా మారుస్తున్నారని తెలిసిందని, అందుకే మమ్మల్ని అక్కడి నుంచి త్వరగా ఖాళీ చేయించి పంపారని తెలిపారు. మళ్లీ తిరిగి ఎప్పుడు రావాలి అనే దానిపై మెయిల్ ద్వారా మళ్లీ సమాచారం ఇస్తామని యాజమాన్యం చెప్పిందని, ప్రస్తుతానికి కశ్మీర్లో ఇంటర్నెట్, ఫోన్ సేవలు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. -
విద్యార్థులను క్షేమంగా ఇంటికి చేర్చుతాం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్థులను క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లో చదువుతున్న 5000 మంది విద్యార్థులను వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చేందుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అధికారులతో, రైల్వే, విమానయాన శాఖ అధికారులతో కిషన్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శనివారం తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్‌లతో ఎప్పటికప్పుడు విషయాలను తెలుసుకుంటూ.. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అధికారులతో తెలుగు రాష్ట్రాల విద్యార్థులను క్షేమంగా స్వస్థలాకు పంపించే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థుల తరలింపు విషయంలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాపురావులు ప్రతి క్షణం కిషన్ రెడ్డికి సహాయంగా ఉంటున్నారు. -
విద్యార్థుల కోసం 3 బస్సులు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనగర్‌లోని తెలుగు విద్యార్థులను క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. కశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దాంతో ఎన్ఐటీ, కాలేజీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయిందని తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు మూడు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు అర్థరాత్రి వరకు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
విద్యార్థులను సురక్షితంగా తీసుకొస్తాం
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దాంతో విద్యార్థులు తమకు సాయం చేయలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ట్విట్ చేశారు. దీనిపై కేటీఆర్ వెంటనే స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులను శ్రీనగర్ నుంచి తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.. సహాయం కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరిని సంప్రదించాలని తెలిపారు. అక్కడి కార్యాలయానికి సంబంధించిన ఫోన్ నంబర్లు 011-2338 2041 లేదా +91 99682 99337 కేటీఆర్ ట్వీట్ చేశారు. Any student/parent wanting assistance, please call our Resident Commissioner Sri Vedantam Giri at 011-2338 2041 or on his mobile +91 99682 99337 at Telangana Bhavan, New Delhi — KTR (@KTRTRS) August 3, 2019 ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ జమ్మూకశ్మీర్ నుంచి విద్యార్థులను ఢిల్లీకి తీసుకు రావడానికి బస్సులు ఏర్పాటు చేశారని.. అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కే జోషి తెలిపారు. నిట్ విద్యార్ధులతో తెలంగాణ భవన్ అధికారులు ఫోన్లో టచ్‌లో ఉన్నారని, వారు ఇప్పటికే శ్రీనగర్ నుండి జమ్మూకు రోడ్డు మార్గాన బయలుదేరారన్నారు. విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ ప్రకటించారు. -
కోటు అమ్ముకొని మరీ చదువుకున్నాడు
శ్రీనగర్: కాస్తంత కలిగి ఉండి పక్కనే ఉన్న తెలివైనవారిని పట్టించుకునే తీరిక ఉండాలి గానీ.. కళ్లముందే మహావృక్షాల్లా ఎదిగేస్తారు. ఆ వృక్ష ఫలాలు అందకున్నా దానికి నీరు పోసింది తానే అన్న ఆనందం అలా నిలిచిపోతుంది. ఇలాంటి అనుభూతి ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో ఓ విద్యార్థికి సహాయం చేసిన వ్యక్తుల్లో కనిపిస్తోంది. కశ్మీర్‌లోని షాగుండ్ అనే గ్రామంలో షకీల్ అహ్మద్ అనే విద్యార్థి ఓ నిరుపేద. అతడికి ఇద్దరు సోదరులు. తండ్రి చనిపోవడంతో ఇంట్లో వాళ్లతో కలిసి కూలికి వెళ్లే వాడు. కానీ, వాళ్ల అమ్మ మాత్రం అతడికి ఎప్పటికప్పుడు చదువుపై బలవంత పెడుతూనే ఉండేది. అందులో భాగంగానే ఓ పక్క పనిచేసుకుంటూనే షకీల్ చదువుకునేవాడు. అతడి చదువులు కొనసాగించేందుకు అప్పుడప్పుడు ఇంట్లో వస్తువులు.. తాను చలికి తట్టుకోలేక వేసుకునే కోటుతో సహా అమ్మేశాడు. అలా కష్టపడి చదువుకున్న ఆ విద్యార్థి ఇప్పుడు దేశంలోనే అత్యున్నత ఇంజినీరింగ్ విభాగం అయిన ఐఐటీలో సీటు సాధించాడు. కానీ, అతడికి ఫీజుల భారం మొదలైంది. దాదాపు రూ.6లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతోపాటు అదనపు ఫీజులు కూడా. ఇతడి పేదరిక విషయం బయటకు తెలియడంతో శ్రీనగర్ కు చెందిన ఐఐటీ సంస్థ ముందుకొచ్చింది. అతడు తమ ఐఐటీలో చేరితే ఫీజు కోసం ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని ఐఐటీ ప్రకటించింది. దీంతోపాటు ఇతడి గురించి తెలిసిన మానవతా వాదులు ఇప్పటికే అతడి పేరిట దాదాపు రూ.2లక్షలకు పైగా డిపాజిట్లు చేశారు. మరో విశేషమేమిటంటే షాగుండ్ చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ఐఐటీకి ఎంపికైన తొలి విద్యార్థి షకీలే. -
హంద్వారా ఘటన దురదృష్టకరం: ముఫ్తీ
న్యూఢిల్లీ : కుప్వారా జిల్లా హంద్వారాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన దురదృష్టకరమని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత శాఖతో మాట్లాడి, విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఫ్తీ హామీ ఇచ్చారు. కాల్పులలో మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారం చెల్లిస్తామని ఆమె తెలిపారు. కాగా ఓ విద్యార్థినితో ఆర్మీ జవాను అసభ్యంగా ప్రవర్తించటంతో అదికాస్తా.... హింసకు దారితీసి, ముగ్గురు ప్రాణాలను బలితీసుకుంది. మరో నలుగురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆర్మీ కూడా విచారణకు ఆదేశించింది. పోలీసులు క్రిమనల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇక శ్రీనగర్‌లో నిట్ వివాదంపై కూడా సీఎం ముఫ్తీ స్పందించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. నిట్ విద్యార్థులంతా తమ పిల్లలే అని, వారికి రక్షణ కల్పించడం తమ బాధ్యత అన్నారు. కశ్మీర్ వారి సొంతిల్లు అని, క్యాంపస్ వదిలి వెళ్లిన స్థానికేతర విద్యార్థులు తిరిగి వస్తారని ఆశిస్తున్నామని ముఫ్తీ అభిప్రాయపడ్డారు. నిట్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్థానికేతరులనే కోణంలో చూడవద్దని ఆమె సూచించారు. కాగా టి20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా పరాజయాన్నినిట్లో చదువుతున్న కొందరు కాశ్మీరీ విద్యార్థులు పండగలా జరుపుకోవడాన్ని పలువురు విద్యార్థులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ వివాదం మొదలైంది. స్థానిక విద్యార్థులకు, స్థానికేతరులకు మధ్య చిచ్చు రగిలింది. అది రోజురోజుకుపెచ్చుమీరడంతో నిట్ ను శ్రీనగర్ నుండి తరలించాలని డిమాండ్ తలెత్తింది. ఈనేపథ్యంలో ముఫ్తీ మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ , మానవ వనరుల శాఖమంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. తాజాగా ఆమె ఇవాళ ఉదయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీస్ పై ఆయనతో చర్చించారు.