
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో 74రోజులపాటు మూతబడిన శ్రీనగర్ ఎన్‌ఐటీ తిరిగి ప్రారంభమైంది. సుదీర్ఘ సెలవులు అనంతరం క్యాంపస్‌ను మంగళవారం రీఓపెన్ చేశారు. అయితే బయటరాష్ట్రాల విద్యార్థులు ఇంకా రావాల్సి ఉంది. లోయలో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని భావిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపడానికి భయపడుతున్నారు. అలాగే ఇంటర్నెట్ లేకుండా చదువుకోవడం ఇబ్బందికరమని భావిస్తున్న విద్యార్థులు కూడా మరికొన్ని రోజులు వేచి చూద్దామనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. క్యాంపస్ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో శ్రీనగర్ ఎన్‌ఐటీ వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.