జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ నూతన చీఫ్ తారిక్ హమీద్ కర్రా ప్రకటన
నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో విడుదల చేసిన ఒమర్
రాష్ట్ర హోదా పునరుద్ధరించకుంటే సుప్రీంకు వెళ్తామని ఒమర్ ప్రకటన
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) వేగంగా సిద్ధమవుతోంది. సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలిచ్చింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబరు 1వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ కు 1953కు ముందున్న స్వయం ప్రతిపత్తిని కోరతామని ఎన్‌సీ మేనిఫెస్టో పేర్కొంది. ఈ మేరకు 2000 జూన్‌లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సారథ్యంలో కేంద్ర కేబినెట్ దీన్ని తిరస్కరించింది.
2019లో నరేంద్ర మోదీ సర్కారు ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశీ్మర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష కోరతామని, కశీ్మరి పండిట్లు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చూస్తామని మేనిఫెస్టోలో ఎన్‌సీ హామీ ఇచి్చంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరెంటు, నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తామని పేర్కొంది. పేదలకు ఏడాదికి 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చామని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మేనిఫెస్టోను విడుదల చేస్తూ అన్నారు. అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లో తీర్మానం చేస్తామని ఒమర్ వెల్లడించారు. పేద కుటుంబాలకు చెందిన ప్రతి గృహిణికి నెలకు రూ.5,000 ఆర్థికసాయం అందజేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
భావసారూప్య పార్టీలతో కూటమికి సిద్ధం
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన చీఫ్ తారిక్ హమీద్ కర్రా
శ్రీనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశీ్మర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. ఎన్‌సీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు తనకు తెలిసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూకశీ్మర్ చీఫ్‌గా కర్రాను నియమించింది.
సోమవారం న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో ఎన్‌సీ, పీడీపీలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పచ్చజెండా ఊపాయన్న తారిక్ అహ్మద్..భావ సారూప్యం కలిగిన ప్రాంతీయ పారీ్టలతో చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అధిష్టానం ఇప్పటికే ఇందుకోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్‌తో, ఆయన సొంతపార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీతో మాత్రం చర్చల ప్రశ్నే లేదన్నారు.
రాష్ట్ర హోదా పునరుద్ధరించకుంటే సుప్రీంకు: ఒమర్
కేంద్ర ప్రభుత్వం జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో తమదే విజయమని, రాష్ట్ర హోదా సాధించుకుంటామని అన్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఒమర్ చెప్పారు. అదే సమయంలో, ఇతర పార్టీల ఓటు బ్యాంకు చీలి పోయిందని చెప్పారు. ఈ విషయం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తేలిపో యిందన్నారు. ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులతోనే అసలైన ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment