NC
-
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
జమ్ములో భావసారూప్య పార్టీలతో కూటమికి కాంగ్రెస్ సై
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) వేగంగా సిద్ధమవుతోంది. సోమవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆర్టికల్ 370, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీలిచ్చింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ 18, 25, అక్టోబరు 1వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ కు 1953కు ముందున్న స్వయం ప్రతిపత్తిని కోరతామని ఎన్సీ మేనిఫెస్టో పేర్కొంది. ఈ మేరకు 2000 జూన్‌లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయగా.. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సారథ్యంలో కేంద్ర కేబినెట్ దీన్ని తిరస్కరించింది. 2019లో నరేంద్ర మోదీ సర్కారు ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర హోదా తొలగించి జమ్మూకశీ్మర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాజకీయ ఖైదీలకు క్షమాభిక్ష కోరతామని, కశీ్మరి పండిట్లు గౌరవప్రదంగా తిరిగి వచ్చేలా చూస్తామని మేనిఫెస్టోలో ఎన్సీ హామీ ఇచి్చంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, కరెంటు, నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తామని పేర్కొంది. పేదలకు ఏడాదికి 12 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది. అమలు చేయగలిగిన హామీలను మాత్రమే ఇచ్చామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మేనిఫెస్టోను విడుదల చేస్తూ అన్నారు. అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లో తీర్మానం చేస్తామని ఒమర్ వెల్లడించారు. పేద కుటుంబాలకు చెందిన ప్రతి గృహిణికి నెలకు రూ.5,000 ఆర్థికసాయం అందజేస్తామని, యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. భావసారూప్య పార్టీలతో కూటమికి సిద్ధంజమ్మూకశ్మీర్ కాంగ్రెస్ నూతన చీఫ్ తారిక్ హమీద్ కర్రా శ్రీనగర్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ)సంసిద్ధత వ్యక్తం చేశాయని జమ్మూకశీ్మర్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా వెల్లడించారు. ఎన్సీ ఇప్పటికే కేంద్ర నాయకత్వంతో ఈ విషయమై ఇప్పటికే చర్చించినట్లు తనకు తెలిసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం గత వారం పార్టీ జమ్మూకశీ్మర్ చీఫ్‌గా కర్రాను నియమించింది. సోమవారం న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే విషయంలో ఎన్సీ, పీడీపీలు ఇప్పటికే కాంగ్రెస్‌కు పచ్చజెండా ఊపాయన్న తారిక్ అహ్మద్..భావ సారూప్యం కలిగిన ప్రాంతీయ పారీ్టలతో చర్చలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అధిష్టానం ఇప్పటికే ఇందుకోసం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్‌తో, ఆయన సొంతపార్టీ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీతో మాత్రం చర్చల ప్రశ్నే లేదన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించకుంటే సుప్రీంకు: ఒమర్ కేంద్ర ప్రభుత్వం జమ్మూకశీ్మర్‌కు రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. ఈ విషయంలో తమదే విజయమని, రాష్ట్ర హోదా సాధించుకుంటామని అన్నారు. తమ పార్టీ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని ఒమర్ చెప్పారు. అదే సమయంలో, ఇతర పార్టీల ఓటు బ్యాంకు చీలి పోయిందని చెప్పారు. ఈ విషయం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో తేలిపో యిందన్నారు. ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థులతోనే అసలైన ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. -
జమ్మూకశ్మీర్‌లో అనూహ్య పరిణామాలు
-
అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అనూహ్య నిర్ణయం
శ్రీనగర్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జమ్మూకశ్మీ ర్ రాజకీయాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రంలో బద్ధ శత్రువులైన పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్‌లు ఒక్కటై, కాంగ్రెస్‌తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీతో కలసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తానంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ గవర్నర్ మాలిక్‌కు లేఖ కూడా రాశారు. మరోవైపు, ఈ కూటమిని అడ్డుకునే లక్ష్యంతో.. బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత సజ్జాద్ లోన్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 28, కాంగ్రెస్‌కు 12, ఎన్సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 44 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఈ కూటమికి 55 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 25 మంది, పీపుల్స్ కాన్ఫెరెన్స్‌కు ఇద్దరు, సీపీఎంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. ‘ఇతరుల’ మద్దతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్ కూడా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్‌కు రాసిన లేఖలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్ కాన్ఫెరెన్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తమకు 25 సభ్యుల బీజేపీతో పాటు 18కి పైగా ఇతర సభ్యుల మద్దతుందని ఆ పార్టీ నేత సజ్జాద్ లోన్ గవర్నర్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సంచలనం సృష్టించింది. గవర్నర్ నిర్ణయం నిర్ణయం నేపథ్యంలో.. ఎన్నికల ప్రకటనకు ముందే రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చే అవకాశంపై యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. బేరసారాలకు అవకాశం ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని రాజ్‌భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా పేర్కొంది. మరోవైపు, కాంగ్రెస్– పీడీపీ–ఎన్సీ కూటమి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా ఆరోపించారు. దుబాయిలో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ మూడు పార్టీల నేతలు కలిశారన్నారు. కలవరపడ్డ బీజేపీ: ముఫ్తీ కశ్మీర్లో మహాకూటమి ఏర్పాటు ఆలోచన బీజేపీని కలవరపాటుకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తన లేఖను స్వీకరించలేకపోయిన గవర్నర్ కార్యాలయంలోని ఫ్యాక్స్ మిషన్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వుల్ని మాత్రం వెంటనే జారీచేసిందని ఎద్దేవా చేశారు. -
‘ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం’
శ్రీనగర్ : గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతుతో జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను శ్రీనగర్‌లో ఉన్నందున గవర్నర్‌ను ప్రత్యక్షంగా కలవలేకపోతున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నచోట ఫ్యాక్స్ పనిచేయనందున ఈ మెయిల్ ద్వారా లేఖను పంపిస్తానని తెలిపారు. కాగా పీడీపీతో బీజేపీ పొత్తు తెంచుకున్న అనంతరం కశ్మీర్లో గవర్నర్ పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్, ఎన్సీ పార్టీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఫ్తీ ముందుకొచ్చారు. అయితే ఈ విషయంపై గవర్నర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. Have been trying to send this letter to Rajbhavan. Strangely the fax is not received. Tried to contact HE Governor on phone. Not available. Hope you see it @jandkgovernor pic.twitter.com/wpsMx6HTa8 — Mehbooba Mufti (@MehboobaMufti) November 21, 2018 -
ఫరూక్ యూటర్న్.. కొనసాగుతున్న సస్పెన్స్!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ మృతితో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించడం సంచలనం రేపింది. దీంతో తెరవెనుక బీజేపీ-ఎన్సీ సర్కార్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా యూటర్న్ తీసుకొన్నారు. బీజేపీతో తాము పొత్తు పెట్టుకుంటామని తాను ఎన్నడూ అనలేదంటూ ఆయన మాట మార్చారు. మరోవైపు ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్న బీజేపీతో ఎన్సీ ఎట్టిపరిస్థితుల్లో చేతులు కలుపబోదని పేర్కొన్నారు. మరోవైపు గతంలో మాదిరిగానే బీజేపీ-పీడీపీ కూటమి మళ్లీ కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా అన్నది స్పష్టం కావడం లేదు. ప్రభుత్వ ఏర్పాటు అంశంపై పీడీపీ అధినాయకురాలు మహబూబా ముఫ్తీ పార్టీ సీనియర్ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. పాత మిత్రుడు బీజేపీతో కలిసి వెళ్లాలా? లేక కొత్త స్నేహ హస్తం చాటుతున్న కాంగ్రెస్‌తో జట్టు కట్టాలా అన్నది ఈ సమావేశంలో మహబూబా నిర్ణయించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. -
'ఇది టీ కప్పులో తుఫాను'
ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ వ్యాకులత నుంచి జమ్ముకశ్మీర్ ఇంకా బయటపడలేదు. మొన్నటివరకు పీడీపీ- బీజేపీ సంకీర్ ప్రభుత్వం కొనసాగగా.. మొహమూద్ మరణం, ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీను ముఖ్యమంత్రిని చేసేందుకు పీడీపీ ఏకపక్ష ప్రయత్నాలు.. దోస్తీపై బీజేపీని పునరాలోచనలో పడేశాయి. దీంతో కొత్త పొత్తులు ఉద్భవిస్తాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే బీజేపీ- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి. ఎన్సీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం మీడియాతో మాట్లాడుతూ 'ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలంటూ బీజేపీ ప్రతినిధులెవరైనా వస్తే తప్పక ఆహ్వానిస్తామని, పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అన్నారు. గతంలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణంలో కొనసాగిన దరిమిలా ఫారూఖ్ ప్రకటన రాజకీయవర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది. కాగా, 'ఇదంతా టీ కప్పులో తుఫాను' అని కొట్టిపారేశారు ఫారూఖ్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ట్వీట్లు చేశారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని, బీజేపీ- ఎన్సీల కలయికా అలాంటిదేనని ఒమర్ పేర్కొన్నారు. ఇతర పార్టీలవాళ్లొచ్చి మాట్లాడతామంటే వారిని ఆహ్వానించడం పార్టీ అధినేతగా ఫారూఖ్ విధి. అందుకే ఆయనలా మాట్లాడారేతప్ప బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశం ఎన్సీకి లేదు అని తేల్చిచెప్పారు. మొత్తం 87 సభ్యులు గల జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27మంది, బీజేపీకి 25 మంది నేషనల్ కాన్ఫెన్స్ కు 15 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోంది.