Video: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు | Chaos in J&K Assembly after Engineer Rashid brother shows Article 370 banner | Sakshi
Sakshi News home page

Video: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీలో రచ్చ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు

Published Thu, Nov 7 2024 11:24 AM | Last Updated on Thu, Nov 7 2024 4:21 PM

Chaos in J&K Assembly after Engineer Rashid brother shows Article 370 banner

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ సమావేశాలు రసాభాసాగా కొనసాగుతున్నాయి. ఆరేళ్ల తర్వాత సీఎం ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో తొలిరోజైన సోమవారం నుంచే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హోదా పునరుద్దరణ అంశాలపై గందరగోళం నెలకొంది. గురువారం అయిదోరోజు అసెంబ్లీలో ఆర్టికల్‌ 370పై పెద్ద రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ సభలో వాగ్వాదానికి దిగారు.

అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే, జైల్లో ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370ను పునరుద్దరించాలని డిమాండ్‌ చేస్తూ ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేయడంతో సభలో రగడ మొదలైంది. ఈ నిరసన ప్రదర్శనపై సభలో బీజేపీ ప్రతిపక్షనేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వెంటనే మార్షల్స్‌​ జోక్యం చేసుకొని గొడవపడుతున్న ఎమ్మెల్యేలను బలవంతంగా దూరం తీసుకెళ్లారు. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడి, తర్వాత మళ్లీ ప్రారంభమైంది. కాగా ఎమ్మెల్యేల ముషియుద్దానికి దిగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గురువారం సభ ప్రారంభమైన వెంటనే జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరుతూ శాససనసభ బుధవారం ఆమోదించిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేపట్టింది. పార్టీ సభ్యులు తీర్మానం ప్రతులను చించి సభ వెల్ లోకి విసిరారు. ఈ గందరగోళం మధ్య ఎమ్మెల్యే షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. 

అయితే ఎమ్మెల్యే ఖుర్షీద్‌ అహ్మద్‌పై స్పీకర్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర చీఫ్ రవీందర్ రైనా స్పందిస్తూ.. అధికార ఎన్సీ, కాంగ్రెస్‌లు భారత వ్యతిరేక భావాలను పెంచి పోషిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ కా హాత్‌ పాకిస్థాన్‌ కే సాత్‌, కాంగ్రెస్‌ కే హాత్‌ టెర్రరిస్టుల కే సాత్‌ అంటూ నినాదాలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement