
తిరువనంతపురం: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(60) కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఈ పోస్టు కోసం ఆయనొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా సమావేశానికి హాజరుకానున్న ప్రహ్లాద్ జోషి ఈ నియామకాన్ని ధ్రువీకరించనున్నారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవి కోసం ఆదివారం రాజధాని తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్ చంద్ర శేఖర్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment