Rajiv Chandrasekaran
-
Elon Musk: హ్యాక్ చేయొచ్చు..!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) పనితీరు, పారదర్శకతపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలలో నమోదైన ఫలితాలను సులభంగా తారుమారు చేయొచ్చని, ఎన్నికల్లో వీటిని ఉపయోగించకపోవడమే మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలపై స్పందించారు. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్’లో తన అభిప్రాయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వినియోగిస్తున్న ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యంత్రాలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. మస్క్ అభిప్రాయాన్ని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీంఎలు పూర్తిగా సురక్షితమేనని తేల్చిచెప్పారు. దీనిపై మస్క్ ఘాటుగా స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయొచ్చని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లు కూడా ఆదివారం స్పందించారు. ఈవీఎంలు ఎవరూ తనిఖీ చేయలేని బ్లాక్‌బాక్సుల్లాంటివేనని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. ‘ఎక్స్’లో ఎలాన్ మస్క్ చేసిన పోస్టును తన ‘ఎక్స్’ ఖాతాల్లో రాహుల్ షేర్ చేశారు. ఈవీఎంల విశ్వసనీయతను అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. రిస్క్ చిన్నదైనా పరిణామం పెద్దదే మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను వాడొద్దు. ఎన్నికల నుంచి ఈ యంత్రాలను దూరంగా ఉంచాలి. ఈవీఎంలను హ్యాక్ చేసే రిస్క్ తక్కువగా ఉన్నప్పటికీ అది ముమ్మాటికీ హ్యాకింగే అవుతుంది. రిస్క్ చిన్నదైనా అది పెద్ద పరిణామానికి దారితీస్తుంది.– ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎన్నికల ప్రక్రియపై అనుమానాలున్నాయి భారత్‌లో ఉపయోగిస్తున్న ఈవీఎంలు బ్లాక్‌బాక్సుల్లాంటివే. వాటిని తనిఖీ చేయడానికి ఎవరినీ అనుమతించరు. మన దేశంలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థల్లో జవాబుదారీతనం, పారదర్శకత లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగానే మిగిలిపోతుంది – ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ ఈవీఎంలు పూర్తి సురక్షితం పూర్తిగా సురక్షితమైన ఎల్రక్టానిక్ పరికరాలను, డిజిటల్ హార్డ్‌వేర్‌ను ఎవరూ తయారు చేయలేరన్న సాధారణ అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలా అను కోవడం పొరపాటు. ఈవీఎంలపై ఎలాన్ మస్క్ వ్యక్తం చేసిన భయాందోళలు సమంజసం కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయడం అమెరికాతోపాటు ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో గానీ ఇండియాలో ఎంతమాత్రం వీలుపడదు. ఇతర దేశాల్లో ఇంటర్నెట్తో అనుసంధానించిన ఓటింగ్ యంత్రాలను వాడుతుంటారు. ఇండియాలో అలాంటి పరిస్థితి లేదు. ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇండియాలో ఈవీఎంలకు ఇంటర్నెట్తో గానీ, బ్లూటూత్‌తో గానీ, వై–ఫైతోగానీ ఎలాంటి అనుసంధానం ఉండదు. ఇవి పూర్తిగా సురక్షితమైనవి. ఫ్యాక్టరీలో పోగ్రామ్ చేసిన ఈవీఎం కంట్రోలర్లను బయట రీప్రోగ్రామింగ్ చేయడం సాధ్యం కాదు. ఇండియాలో ఉపయోగిస్తున్న ఈవీఎంలు, వాటి భద్రత గురించి ఎలాన్ మస్‌్కకు ట్యూషన్ చెప్పడానికి నేను సిద్ధమే – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మాజీ సహాయ మంత్రి ‘‘ఏదైనా(ఏ ఎల్రక్టానిక్ పరికరమైనా) హ్యాక్ చేయొచ్చు’’ – రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఎలాన్ మస్క్ ప్రతిస్పందన ఈవీఎంలకు స్వస్తి పలకాలి టెక్నాలజీ అనేది సమస్యలను పరిష్కరించేలా ఉండాలి. అదే టెక్నాలజీ ఒక సమస్యగా మారినప్పుడు దాన్ని పక్కనపెట్టమే మంచిది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని నిపుణులు ఇప్పటికే నిరూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నా యి. ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేస్తున్నట్లు సందేహాలున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్‌పై ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ నిపుణులు సైతం బహిరంగంగా ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు మన దేశంలో ఈవీఎంలను బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం ఏమిటి? దీనిపై అధికార బీజేపీ సమాధానం ఇవ్వాలి. ఈవీఎంలకు స్వస్తి పలకాలి. భవిష్యత్తులో జరిగే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలి. – ‘ఎక్స్’లో అఖిలేష్ యాదవ్ దమ్ముంటే హ్యాక్ చేసి చూపించండి ఎలాన్ మస్క్ గానీ, ఇంకెవరైనా గానీ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వ్యక్తులు భారత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలి. అక్కడ ఈవీఎంను తీసుకొని హ్యాక్ చేసి చూపించాలి. ఇదే మా చాలెంజ్. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఎలాన్ మస్‌్కకు ఫిర్యాదు చేస్తున్నారు? మస్క్ ఏం చేయగలరు? ప్రపంచం ముందు కన్నీళ్లు పెట్టుకోవడం, భారతదేశ ప్రతిష్టను దిగజార్చడం కాంగ్రెస్ డీఎన్ఏలో ఒక భాగమా? వారసత్వ రాజకీయాలను ప్రజలు వరుసగా మూడోసారి తిరస్కరించారు. అయినా ఆ విషయం కాంగ్రెస్‌కు అర్థం కావడం లేదు? – అమిత్ మాలవీయ, బీజేపీ ఐటీ విభాగం ఇన్చార్జి -
శశి థరూర్ కీలక వ్యాఖ్యలు.. రాజీవ్ చంద్రశేఖర్ ఘాటు సమాధానం
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు 'శశి థరూర్' తనమీద చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. ఒక ఎంపీ ఎంత చేయగలడో, చేయలేడో అర్థం కావడం లేదని, అతనికి 'అవగాహన లేదు' అని రాజీవ్ చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపైన రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందిస్తూ.. 15 ఏళ్లుగా పని చేయని వ్యక్తి నుంచి తనకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని సమాధానం ఇచ్చారు. నేను ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నప్పుడు.. కొన్ని సమస్యలు నా దృష్టికి వస్తాయి. వాటిని నేను తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరశాల నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై స్థానికులతో ముచ్చటించారు. చాలా మంది ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఇది (పరశాల) ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గం, చాలా మంది ప్రజలు సాంప్రదాయ వ్యవసాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎటువంటి పురోగతిని చూడలేదు. ఉద్యోగాలు, అభివృద్ధి లేకుండా విసిగిపోయారు. అధిక నిరుద్యోగిత రేటు గురించి యువత ఎక్కువగా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. #WATCH | When asked about Congress MP and candidate against him in Thiruvananthapuram, Shashi Tharoor's statement "he has no understanding how much an MP can do and cannot do", Union Minister Rajeev Chandrasekhar says, "That is fine. I don't want any certificates from a person… pic.twitter.com/cZ3o0aijdd — ANI (@ANI) April 23, 2024 -
‘24 గంటల్లో శశిథరూర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే’
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేరళ రాజకీయం వేడెక్కుతుంది. తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్.. అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ అభ్యర్ధి శశిథరూర్‌కు లీగల్ నోటీసులు పంపారు. శశిథరూర్ తనకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేరళకు మలయాళ మీడియా సంస్థ న్యూస్24 ఇంటర్వ్యూలో శశిథరూర్.. రాజీవ్ చంద్రశేఖర్ గురించి మాట్లాడారు. ఏప్రిల్ 6న సదరు టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజీవ్ చంద్రశేఖర్ ఓటర్లను, ఓ వర్గానికి చెందిన మత పెద్దలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తరుపున లాయర్ ద్వారా శశిథరూర్‌కు లీగల్ నోటీసులు అందించారు. నేనే షాకయ్యా తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఓటర్లకు డబ్బులిస్తూ ప్రలోభ పెడుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు నన్ను షాక్‌కి గురి చేశాయని ఆ నోటీసుల్లో రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. క్షమాపణలు చెప్తారా? లేదంటే ఈ నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపు శశిథరూర్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. అంతేకాదు తనకు, ఓటర్లకు, ఓ కమ్యూనిటీని కించపరిచినందుకు ఆ వర్గానికి చెందిన ప్రజలకు, మత పెద్దలకు బహిరంగంగా క్షమాణలు చెప్పాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశిథరూర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా దుర్మార్గపు ఉద్దేశ్యంతో తన క్లయింట్ రాజీవ్ చంద్రశేఖర్ పరువుకు నష్టం వాటిల్లేలా అసత్యప్రచారం చేశారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, శశిథరూర్ క్షమాపణలు చెప్పాలని రాజీవ్ చంద్రశేఖర్ తరుపు న్యాయవాది శశిథరూర్‌కు పంపిన నోటీసుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. -
కంచుకోటలో కాంగ్రెస్ ‘కథ’ కంచికేనా?
సాక్షి, తిరువనంతపురం : 2024 ఏడాదిని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ పొలిటికల్ ఇయర్‌గానే భావిస్తున్నాయి. దేశ నేతలు, ప్రజలందరి దృష్టి రాబోయే లోక్‌సభ సమరంపైనే ఉంది. 2023లో 5 రాష్ట్రాల ఎన్నికల తంతు ముగియగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించి రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలోనూ అత్యధిక స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాషాయ పార్టీ. అందుకు తగ్గట్లుగానే వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా వామపక్ష భావజాలం ఉన్న కేరళపై గురిపెట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. కేరళలో మాత్రం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. అయితే, కాంగ్రెస్ లోక్‌సభ స్థానానికి కంచుకోటగా ఉన్న తిరువనంతపురాన్ని బద్దలు కొట్టాలని చూస్తోంది. రాజకీయ చైతన్యం కలిగిన కేరళలో బీజేపీ గెలిచి.. దక్షిణాదిలో తమకు తిరుగు లేదని నిరూపించాలని యోచిస్తోంది. గెలపుపై కాషాయం నేతల ధీమా తాజాగా ప్రకటించిన బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో తిరువనంతపురం సీటును కేంద్ర మంత్రికి కేటాయించింది. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేని కేరళలో కూడా తామే గెలుస్తామని కాషాయం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శశి థరూర్‌పై కేంద్ర మంత్రి.. కాబట్టే కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభ స్థానం పోటీ చేయడం ఇదే తొలిసారి. గెలుపు గుర్రాలపై ఆసక్తి.. ఇక తిరువనంతపురం లోక్‌సభ గెలుపు గుర్రాలపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఏడాది జనవరిలో కేరళ బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ని ఓడించడం కష్టమని అన్నారు. అందుకే థరూర్ తిరువనంతపురం నుండి పదే పదే గెలుస్తున్నారు. భవిష్యత్తులో అదే స్థానంలో శశిథరూర్ కాకుండా మరో నాయకుడు గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. టార్గెట్ దక్షిణాది లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో శ్రమిస్తోంది. 2019లో దేశం మొత్తం 303 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఏడాది దక్షిణాదిలో 129 లోక్‌సభ స్థానాల్లో (పుదుచ్చేరితో కలిపి 130) బీజేపీ కేవలం 29 సీట్లకే పరిమితమైంది. ఈ సారి ఆసంఖ్యను మరింత పెంచేలా దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నేసింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కమలం అగ్రనేతల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సైతం వరుస పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ పర్యటనల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. -
ఎల్రక్టానిక్స్ తయారీ 4 రెట్లు అప్..
గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ నాలుగు రెట్లు పెరిగి రూ. 8.22 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో తెలిపారు. ఇది 2026 నాటికి రూ. 23.95 లక్షల కోట్లకు చేరనుందన్నారు. 2013–14లో ఎలక్ట్రానిక్స్ తయారీ రూ. 1.80 లక్షల కోట్లుగా ఉండేదని మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో ఉపయోగిస్తున్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో 99.2 శాతం దేశీయంగా తయారైనవే ఉంటున్నాయని ఆయన వివరించారు. 2022–23లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువ చేసే మొబైల్స్‌ను ఎగుమతి చేసినట్లు చంద్రశేఖర్ చెప్పారు. భారత్ ఎలక్ట్రానిక్స్‌ను దిగుమతి చేసుకునే దేశం స్థాయి నుంచి ఎగుమతి చేసే దేశం స్థాయికి ఎదిగిందన్నారు. -
నైపుణ్యాల కొరతే అడ్డు
న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు. గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. -
వేరబుల్ గ్యాడ్జెట్స్‌కి నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టం విధి విధానాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తొలిసారిగా పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు నిర్వహించారు. స్పై కెమెరా గ్లాసెస్, వేరబుల్ డివైజ్‌లు వంటి గ్యాడ్జెట్లు సేకరించే డేటాను హ్యాండిల్ చేయడానికి సంబంధించి నిబంధనలపైనా చర్చించారు. వీటిని విక్రయించే దశలోనే కేవైసీ (కస్టమర్ల వివరాల సేకరణ) నిబంధనలను వర్తింపచేయడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మరో రెండు విడతల సంప్రదింపుల తర్వాత డిజిటల్ ఇండియా చట్టం ముసాయిదా పూర్తి కాగలదని, ఏప్రిల్‌లో దీన్ని జారీ చేసే అవకాశం ఉందని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సుమారు 45–60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జూలై నాటికల్లా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని మంత్రి చెప్పారు. -
విశాఖ సీఐటీఎస్‌లో నైపుణ్య శిక్షణ.. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ: మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం దేశంలో ప్రత్యేకంగా 19 జాతీయ మహిళా నైపుణ్య శిక్షణా సంస్థలు (ఎన్ఎస్టీఐ) పనిచేస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా 33 ఎన్ఎస్టీఐలు వాటికి అనుబంధంగా మూడు కేంద్రాలు నెలకొల్పినట్లు తెలిపారు. ఇందులో 19 ఎన్ఎస్టీఐలు ప్రత్యేకంగా మహిళల కోసం నెలకొల్పినవే. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ (హైదరాబాద్)లో మూడు ఎన్ఎస్టీఐలు నెలకొల్పగా అందులో ఒకటి మహిళల కోసం ప్రత్యేకించిందని మంత్రి చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఎస్టీఐ నెలకొల్పలేదని చెబుతూ విశాఖపట్నం గాజువాకలోని క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ట్రైనర్స్ (సీఐటీఎస్)ను అనుబంధ సంస్థగా ప్రకటించి 2022-23 నుంచి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్ వంటి ట్రేడ్లలో శిక్షణను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఈ మూడు ట్రేడ్లలో 75 మందికి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. చెంచులకు వేతనంతో కూడిన ఉపాధి కొనసాగుతుంది న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు తెగకు చెందిన ప్రజలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి కల్పించేందుకు క్రియాశీలకమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తెలిపాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వకంగా తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్గదర్శకాలలో చేసిన మార్పుల కారణంగా నల్లమల అడవులలో జీవించే చెంచు తెగకు చెందిన ప్రజలు ఈ పథకం కింద వేతనంతో కూడిన ఉపాధి పొందడానికి అనర్హులవుతారా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ మార్గదర్శకాలను సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్పారు. -
చైనా ఫోన్లపై నిషేధం లేదు: కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు పెంచుకోవాలని చైనా మొబైల్ ఫోన్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రూ.12,000లోపు విలువ చేసే చైనీ ఫోన్ల విక్రయాలపై నిషేధ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. దేశీ ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో భారత కంపెనీలకు కీలక పాత్ర ఉందంటూ, దీనర్థం విదేశీ బ్రాండ్లను మినహాయించడం కాదన్నారు. ‘‘మరిన్ని ఎగుమతులు పెంచుకోవాలని చైనా బ్రాండ్ల వద్ద మేము పారదర్శకంగా ప్రస్తావించాం. వాటి సప్లయ్ చైన్, ముఖ్యంగా విడిభాగాల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ఉండాలి’’అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రూ.12 వేల లోపు ఫోన్లకు చైనా కంపెనీలను దూరం పెట్టాలన్న ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నారు. 2025–26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ, 120 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తి 76 బిలియన్ డాలర్లుగా ఉంది. -
‘ఎన్ఎస్ఓ గ్రూప్‌పై నిషేధం’ ప్రతిపాదన లేదు
న్యూఢిల్లీ: ‘ఎన్ఎస్ఓ గ్రూప్’ అని పేరున్న సంస్థలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు అందించినందుకు గాను ఎన్ఎస్ఓ గ్రూప్‌ను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్‌ను భారత్‌లో నిషేధిస్తారా? అని రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాంటి ప్రతిపాదన లేదన్నారు. దేశంలో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతున్న సంగతి నిజమేనని అంగీకరించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసి, విక్రయించిన పెగాసస్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై, జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, అలాంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుతోంది. పెగాసస్ స్పైవేర్ వాడకంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
లక్ష కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను 1 లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ. 75 లక్షల కోట్లు) ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ప్రపంచంలోనే టాప్ 2 డిజిటల్ దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వచ్చే 25 ఏళ్ల ప్రణాళికలను మంత్రి వివరించారు. ప్రభుత్వ సర్వీసులను మరింతగా డిజిటలీకరించడం, సమ్మిళిత వృద్ధికి తోడ్పడేలా అస్పష్టతకు తావు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం వంటి అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి పెడుతోందని ఆయన చెప్పారు. ఇంటర్నెట్, టెక్నాలజీలు సురక్షితంగా, విశ్వసనీయంగా. అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ‘‘కొంగొత్త టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్, క్వాంటమ్ కంప్యూటింగ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, సైబర్ సైక్యూరిటీ లాంటి అనేక విభాగాల్లో మనం లీడర్లుగా ఎదగాలి’’ అని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే అంశంలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్ని చెప్పారు. ప్రస్తుతం సర్వీసులు వివిధ మాధ్యమాల ద్వారా లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఏ సర్వీస్ అయినా, ఏ మాధ్యమంలోనైనా లభించే పరిస్థితి రావాలని ఆయన పేర్కొన్నారు. అటు సైబర్ సెక్యూరిటీపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శి రాజేంద్ర కుమార్ చెప్పారు. ప్రస్తుతం ఈ విషయంలో భారత్.. ప్రపంచంలోనే 10వ స్థానం లో ఉందని ఆయన తెలిపారు. గడిచిన మూడేళ్లుగా సైబర్ సెక్యూరిటీ అంశంలో భారత్ గణనీయంగా పురోగతి సాధించిందని వివరించారు. -
టెక్నాలజీ దిగ్గజంగా భారత్
న్యూఢిల్లీ: భారత్‌ను మరింత బలమైన టెక్నాలజీ దిగ్గజంగా రూపొందించేందుకు ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రభుత్వం అమలు చేయనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రధాని కొన్ని కీలకమైన ఆశయాలను నిర్దేశించుకున్నారని.. వీటి సాకారానికి గాను పోటీతత్వం, సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సెమీ కండక్టర్ల విషయంలో ప్రైవేటు రంగంతో ప్రభుత్వం భాగస్వామి కానున్నట్టు తెలిపారు. సీఐఐ నిర్వహించిన టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజా సేవలను డిజిటైజ్ చేసే దిశగా గడిచిన ఆరేళ్లలో కీలక అడుగులు పడ్డాయని చెప్పారు. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సమయంలో బలంగా నిలదొక్కొం దని అభిప్రాయపడ్డారు. -
టీహబ్ ను సందర్శించిన రాజీవ్ చంద్రశేఖరన్
మెంటార్‌గా వ్యవహరించాలని కోరిన కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు, బీపీఎల్ ఎల క్ట్రానిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ చంద్రశేఖరన్ శనివారం టీ-హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా టీ-హబ్‌లో ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువ పారిశ్రామిక వేత్తలకు టీ-హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం సచివాలయానికి వచ్చి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వం తరపున స్టార్టప్స్ కోసం ఇంక్యుబెటర్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సాధ్యమైతే ఇక్కడి స్టార్టప్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాలని కోరారు. టీ-హబ్‌తో భవిష్యత్తులోనూ సంబంధాలు కొనసాగించాలన్నారు.