తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీల కీలక నేతలు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తిరువనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు 'శశి థరూర్' తనమీద చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు.
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్.. ఒక ఎంపీ ఎంత చేయగలడో, చేయలేడో అర్థం కావడం లేదని, అతనికి 'అవగాహన లేదు' అని రాజీవ్ చంద్రశేఖర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపైన రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందిస్తూ.. 15 ఏళ్లుగా పని చేయని వ్యక్తి నుంచి తనకు ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదని సమాధానం ఇచ్చారు.
నేను ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా ఉన్నప్పుడు.. కొన్ని సమస్యలు నా దృష్టికి వస్తాయి. వాటిని నేను తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం తన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరశాల నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై స్థానికులతో ముచ్చటించారు. చాలా మంది ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
ఇది (పరశాల) ప్రధానంగా గ్రామీణ నియోజకవర్గం, చాలా మంది ప్రజలు సాంప్రదాయ వ్యవసాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎటువంటి పురోగతిని చూడలేదు. ఉద్యోగాలు, అభివృద్ధి లేకుండా విసిగిపోయారు. అధిక నిరుద్యోగిత రేటు గురించి యువత ఎక్కువగా నిరుత్సాహానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పును కోరుకుంటున్నారని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
#WATCH | When asked about Congress MP and candidate against him in Thiruvananthapuram, Shashi Tharoor's statement "he has no understanding how much an MP can do and cannot do", Union Minister Rajeev Chandrasekhar says, "That is fine. I don't want any certificates from a person… pic.twitter.com/cZ3o0aijdd
— ANI (@ANI) April 23, 2024
Comments
Please login to add a commentAdd a comment