టీహబ్ ను సందర్శించిన రాజీవ్ చంద్రశేఖరన్ | rajeev chandra shekaran visit t hub | Sakshi
Sakshi News home page

టీహబ్ ను సందర్శించిన రాజీవ్ చంద్రశేఖరన్

Published Sun, Mar 6 2016 4:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

టీహబ్ ను సందర్శించిన రాజీవ్ చంద్రశేఖరన్

టీహబ్ ను సందర్శించిన రాజీవ్ చంద్రశేఖరన్

మెంటార్‌గా వ్యవహరించాలని కోరిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు, బీపీఎల్ ఎల క్ట్రానిక్స్ సంస్థ వ్యవస్థాపకుడు రాజీవ్ చంద్రశేఖరన్ శనివారం టీ-హబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా టీ-హబ్‌లో ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. యువ పారిశ్రామిక వేత్తలకు టీ-హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం సచివాలయానికి వచ్చి ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిశారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వం తరపున స్టార్టప్స్ కోసం ఇంక్యుబెటర్ ఏర్పాటు చేయడం పట్ల మంత్రికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సాధ్యమైతే ఇక్కడి స్టార్టప్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాలని కోరారు. టీ-హబ్‌తో భవిష్యత్తులోనూ సంబంధాలు కొనసాగించాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement