న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు.
గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment