సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ 3.0 కేబినెట్‌లో తెలంగాణా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్‌కు అవకాశం దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకంగా వ్యవహరించిన బండి సంజయ్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి.. కరీంనగర్‌లో సంబరాలు
బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి వరించడంతో కరీంనగర్‌లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సంజయ్ ఇంటివద్ద, ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. సంజయ్ తల్లి శకుంతల సాక్షి టీవీతో మాట్లాడుతూ, సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం తల్లిగా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందని.. ఇది మాపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన భార్య అపర్ణ సంతోషం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ వ్యక్తిగత ప్రొఫైల్
పుట్టిన తేదీ:11-7-1971
తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) - శకుంతల.
అక్క :శైలజ
అన్నలు : బండి శ్రవణ్ కుమార్
బండి సంపత్ కుమార్
భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)
పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్
కులం: మున్నూరుకాపు,(బి.సి-'డి')
ప్రస్తుత బాధ్యతలు:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు
గతంలో చేపట్టిన బాధ్యతలు:
బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..
కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్‌గా..
బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గా భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. BJP రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జ్‌గా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.
వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా
2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.
2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.
2019లో ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం
2019లో అర్బన్ డెవలప్‌మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్‌గా నియామకం
2019లో టొబాకో బోర్డు మెంబర్‌గా నియామకం.
2019లో మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్‌గా నియామకం
2020లో ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్‌గా నియామకం
2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం
2023లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు
2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం
2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపు
Comments
Please login to add a commentAdd a comment