legacy
-
ఎట్టకేలకు ప్రియాంక బరిలోకి : ఇందిర వారసత్వాన్ని నిలుపుకుంటుందా?
కాంగ్రెస్ శ్రేణుల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. తమ ప్రియతమ నేత ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కోరిక నెరవేరబోతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొన్నేళ్లుగా, తన సోదరుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ పరోక్షంగా కీలక పాత్ర పోషించిన ప్రియాంక ఇక గాంధీ వారసురాలిగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో కాంగ్రెస్ ప్రచారానికి బాధ్యత వహించిన, రాజకీయాల్లోకి అధికారిక ప్రవేశించినప్పటికీ ఎన్నికల సమరంలోకి దూకడం మాత్రం ఇదే ప్రథమం. రాహుల్ గాంధీ విజయం సాధించి (రెండు చోట్ల గెల్చిన సందర్భంగా ఇక్కడ రాజీనామా చేయాల్సి వచ్చింది) కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. పలువురు కాంగ్రెస్ పెద్ద సమక్షంలో బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ గురించి కొన్ని అంశాలను పరిశీలిద్దాం.రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ప్రియాంక గాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె. ఆమె ముత్తాత దివంగత జవహర్ లాల్ నెహ్రూ , దేశానికి స్వాతంత్ర ఉద్యమ నేత. దేశ తొలి ప్రధానమంత్రి. ప్రియాంక నానమ్మ ఇందిరాగాంధీ , తండ్రి రాజీవ్ గాంధీ ఇద్దరూ నెహ్రూ అడుగుజాడల్లో నడిచినవారే. ఇద్దరూ ప్రధానమంత్రులుగా దేశానికి సేవ చేసిన వారే. అంతేకాదు ఇద్దరూ పీఎంలుగా పదవిలో ఉన్నపుడే హత్యకు గురయ్యారు. 1984లో కేవలం 12 సంవత్సరాల వయస్సులో, నానమ్మ ఇందిర అంగరక్షకులచే హత్యకు గురి కావడాన్ని చూసింది., రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ దుఃఖంనుంచి తేరుకోకముందే ఏడేళ్లకు తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో జరిగిన ఆత్మాహుతి దాడిలో తండ్రి, అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని పొగొట్టుకుంది. అప్పటికి ప్రియాంకకు కేవలం 19 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తల్లికి, సోదరుడుకి అండగా నిలబడింది. ఆ సమయంలోనే ఇందిర గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తుందని అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ పండితులు భావించారు. కానీ అనూహ్యంగా సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలను పుచ్చుకున్నారు. ఇక ప్రియాంక 25 సంవత్సరాల వయస్సులో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాతో పెళ్లి తరువాత రాజకీయాలకు చాలా దూరంగా ఉంది. బిడ్డల పెంపకంలో నిమగ్నమైంది.అయితే 1990ల చివరి నాటికి, కాంగ్రెస్ కష్టాలు మొదలైనాయి. ప్రియాంక రంగంలోకి దిగినప్పటికీ ఆమె పాత్ర తెరవెనుకకు మాత్రమే పరిమితమైంది. సోదరుడు రాహుల్‌కు మద్దతు ఇస్తూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పరోక్షంగా రాహుల్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమయంలో ఆమె ప్రదర్శించిన రాజకీయ నైపుణ్యం, ప్రజలతోసులువుగా మమేకం కావడం సీనియర్ నాయకులను, ప్రజలను ఆకట్టుకుంది. స్టార్ క్యాంపెయినర్‌గా నిలిచింది. బ్యాక్‌రూమ్ వ్యూహకర్తగా, ట్రబుల్షూటర్గా, కాంగ్రెస్‌కు టాలిస్ మాన్‌గా పేరు తెచ్చుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంది. దీంతో ముఖ్యంగా పేద ప్రజలతో ఆమెలో అలనాటి ఇందిరమ్మను చూశారు.అంతేకాదు సామాజిక సమస్యలు, ఉద్యమాల పట్ల ఆమె స్పందించిన తీరు, చూపించిన పరిణితి ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా 2008లో, ఆమె తన తండ్రి ,రాజీవ్ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినిని జైలులో కలుసుకోవడం, ఆమెతో సంభాషించడం విశేషంగా నిలిచింది. అలాగే ఇటీవలి ఎన్నికల్లో మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొని రాయబరేలీలో సోదరుడు రాహుల్‌ని, అప్పటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీ లాల్ శర్మను గెలిపించి అమేథీని దక్కించుకుని పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి. చివరికి ఇన్నాళ్లకు కేరళనుంచి ఎన్నికల సమరంలోకి దిగింది ప్రియాంక గాంధీ వాద్రా. అనేక సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య దేశాన్ని ఏలి శక్తివంతమైన మహిళగా ఖ్యాతికెక్కిన ఇందిదా గాంధీ వారసత్వాన్ని నిలుబెట్టుకుందా? ప్రజల ఆదరణను నోచుకుంటుందా? బహుళ ప్రజాదరణ నేతగా ఎదుగుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ప్రియాంక చదువు,కుటుంబం1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ.మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రియాంక గాంధీ, భర్త రాబర్ట్ వాద్రాపై మనీ లాండరింగ్, వివాదాస్పద భూముల కొనుగోళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని వాద్రా ఖండిచారు. అలాగే ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, గాంధీ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు ఉద్దేశించినవని పార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. -
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
నైపుణ్యాల కొరతే అడ్డు
న్యూఢిల్లీ: నిరుద్యోగం పట్ల ప్రజల్లో ఉన్న ఆలోచనా ధోరణి సరైంది కాదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. నరేంద్ర మోదీ సారథ్యంలో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే నాటికే నిరుద్యోగ సమస్య వారసత్వంగా వచి్చందని, అప్పటికి పని ప్రదేశాల్లోని 42 కోట్ల ఉద్యోగుల్లో 31 కోట్ల మందికి నైపుణ్యాలు లేవని చెప్పారు. ‘‘నిరుద్యోగం పట్ల ఈ విధమైన ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఎన్నో ఉద్యోగాలు, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కలి్పంచాం. కానీ వారికి నైపుణ్యాలు అవసరం. స్వాతంత్య్రం వచి్చన 65 ఏళ్ల తర్వాత కూడా ప్రతి నలుగురిలో ముగ్గురికి నైపుణ్యాలు లేవు. గత తొమ్మిదేళ్లుగా మేము దీన్ని పరిష్కరించే క్రమంలో ఉన్నాం’’అని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి చంద్రశేఖర్ పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో కరోనా కాలం రెండున్నరేళ్లను మినహాయించి చూస్తే, తాము 6.25 కోట్ల యువతలో నైపుణ్యాలు కలి్పంచామని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం, ప్రధాని మోదీ దృష్టి అంతా స్థానికంగానే ఎన్నో ఆర్థిక అవకాశాలు కలి్పంచాలన్న దానిపైనే. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న సంప్రదాయ కళలు, నైపుణ్యాలను.. ఉత్పత్తుల ఆవిష్కరణ దిశగా పునరుజ్జీవింపజేయాల్సి ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ను చేరుకునేలా అనుసంధాన కలి్పంచాలి’’అంటూ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. -
‘నెహ్రూ వారసత్వం దీపస్తంభం వంటిది’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘనంగా నివాళులర్పించారు. నెహ్రూ వారసత్వం దీపస్తంభంలా నిలిచిపోతుందని, భారతదేశ ఆదర్శం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను ప్రకాశింప జేస్తుందని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ దూరదృష్టి, విలువలు ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, రాహుల్ తదితరులు శనివారం శాంతివన్‌లోని నెహ్రూ స్మారకాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ‘మన మాజీ ప్రధాని నెహ్రూకు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
గెలుపు దారి: దుఃఖనది దాటి గెలిచారు
రోహిక మిస్త్రీ, రేఖా ఝున్ఝున్వాలాల మధ్య ఉన్న ప్రధాన సారూప్యత ఏమిటంటే... ఇద్దరూ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని నిలబడ్డారు. తడబడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. తమ తెలివితేటలు, కార్యదక్షతతో విజయపరంపరను ముందుకు తీసుకు వెళుతున్నారు. తాజాగా ఫోర్బ్స్ వరల్డ్స్ బిలియనీర్స్ జాబితాలో మన దేశం నుంచి చోటు సంపాదించిన న్యూకమర్స్లో ఈ ఇద్దరూ ఉన్నారు... సైరస్ మిస్త్రీ పరిచయం అక్కరలేని పేరు. లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేసిన మిస్త్రీ ఆతరువాత కుటుంబవ్యాపారంలోకి వచ్చాడు. 2012లో టాటా గ్రూప్ ఛైర్మన్ అయ్యాడు. మిస్త్రీ జీవితంలో జయాపజయాలు ఉన్నాయి. ‘నిర్దేశిత లక్ష్యాల విషయంలో మిస్త్రీ విఫలమయ్యాడు’ అంటూ కొద్దికాలానికి ఛైర్మన్ పదవి నుంచి మిస్త్రీకి ఉద్వాసన పలికింది టాటా గ్రూప్. న్యాయపోరాటం సంగతి ఎలా ఉన్నా మిస్త్రీ ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భర్తకు అండగా నిలబడి ఎంతో శక్తిని ఇచ్చింది రోహిక. ప్రచారానికి దూరంగా ఉండే రోహిక గురించి బయట పెద్దగా ఎవరికి తెలియదు. అయితే భర్త నోటి నుంచి ‘రోహిక’ పేరు వినిపించేది. దిగ్గజ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా కుమార్తె అయిన రోహిక కొన్ని ప్రైవెట్, పబ్లిక్ కంపెనీలలో డైరెక్టర్‌గా పనిచేసింది. ఒకసారి రోహికను క్లెమెన్టైన్ స్పెన్సర్ చర్చిల్తో పోల్చాడు సైరస్ మిస్త్రీ. చర్చిల్ భార్య అయిన క్లెమెన్టైన్ ధైర్యశాలి. ముందుచూపు ఉన్న వ్యక్తి. భర్తకు ఎన్నో సందర్భాలలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చింది. తప్పులను సున్నితంగా ఎత్తి చూపింది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం తన నైజం. వర్క్–ఫ్యామిలీ లైఫ్‌లో సమన్వయాన్ని కోల్పోతున్న మిస్త్రీని దారిలోకి తెచ్చింది రోహిక. ‘సమస్యలు ఉన్నాయని సరదాలు వద్దనుకుంటే ఎలా!’ అంటూ భర్తను విహారయాత్రలకు తీసుకెళ్లేది. ఆ యాత్రలలో వ్యాపార విషయాలు అనేవి చివరి పంక్తిలో మాత్రమే ఉండేవి. 54 ఏళ్ల వయసులో సైరస్ మిస్త్రీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోహికకు ఊహించిన షాక్! దుఃఖసముద్రంలో మునిగిపోయిన రోహిక తనకు తాను ధైర్యం చెప్పుకొని ఒడ్డుకు వచ్చింది. మైదానంలో అడుగు పెట్టి ఆట మొదలు పెట్టింది. ‘నువ్వే నా ధైర్యం’ అనేవాడు రోహికను ఉద్దేశించి మిస్త్రీ. భర్త జ్ఞాపకాలనే ధైర్యం చేసుకొని, శక్తిగా మలచుకొని ముందుకు కదిలింది రోహిక. ‘మిస్త్రీల శకం ముగిసింది’ అనుకునే సందర్భంలో ‘నేనున్నాను’ అంటూ వచ్చి గెలుపు జెండా ఎగరేసింది రోహిక మిస్త్రీ. స్టాక్ మార్కెట్ చరిత్రలో ‘స్టార్’గా మెరిశాడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా. పెట్టుబడి పాఠాల ఘనాపాఠీ రాకేష్‌కు భార్య ఎన్నో పాఠాలు చెప్పింది. అవి ఆరోగ్య పాఠాలు కావచ్చు. ఆత్మీయ పాఠాలు కావచ్చు. రేసులకు వెళ్లి ఏ అర్ధరాత్రో ఇంటికి వచ్చే భర్తను ఆ అలవాటు మానిపించింది. సిగరెటు అలవాటును దూరం చేసింది. ఆరోగ్యకరమైన జీవనశైలి దిశగా భర్తను అడుగులు వేయించింది. తన పేరు, భార్య పేరులోని కొన్ని ఆంగ్ల అక్షరాలతో తన స్టాక్ బ్రోకింగ్ కంపెనీకి ‘రేర్’ అని పేరు పెట్టాడు రాకేశ్. భర్త హఠాన్మరణం రేఖను కుంగదీసింది. చుట్టూ అలముకున్న దట్టమైన చీకట్లో వెలుగు రేఖ కరువైంది. అలాంటి దురదృష్టపు రోజుల్లో వేధించే జ్ఞాపకాలను పక్కనపెట్టి వెలుగు దారిలోకి వచ్చింది రేఖ. ‘ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు’ అనే సామెత ఉంది. అది నిజమో కాదో తెలియదుగానీ ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో చదువుకున్న రేఖ భర్త రాకేశ్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని దర్శించింది. అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంది. భర్త బాటలోనే ఇన్వెస్టర్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఘనమైన విజయాలు సాధిస్తోంది రేఖ ఝున్‌ఝున్‌వాలా. -
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు ఊరట
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ఉత్పత్తి ధరలపై కేంద్రానికి కీలక సూచనలు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ, ఓఎన్జీసీ ఆయిల్ ఇండియాకు కొంత ఊరట కల్పించింది. ఈ సంస్థలకు ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించిన క్షేత్రాల (లెగసీ ఫీల్డ్స్) నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను.. దిగుమతి చేసుకునే ధరలో 10 శాతం నిర్ణయించాలని పేర్కొంది. అలాగే, ఇవే సంస్థలు కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ (ప్రస్తుత సామర్థ్యం కాకుండా)కు 20 శాతం అధిక ధరను పారిఖ్ కమిటీ సూచించింది. ఇక లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ధరను దిగుమతి ధరలో 10 శాతం లేదా ఎంబీటీయూ గ్యాస్‌కు గరిష్టంగా 6.5 డాలర్లు మించకూడదని పేర్కొంది. అదే సమయంలో కనిష్టంగా 4 డాలర్లను సిఫారసు చేసింది. దీనివల్ల ఎరువుల కంపెనీలపై భారం తగ్గనుంది. ఎందుకంటే వీటికి ప్రధాన ఇంధనంగా సీఎన్జీ ఉన్న విషయం గమనార్హం. ఇవే ధరల పరిమితులు విద్యుత్ రంగానికీ సరఫరా చేసే గ్యాస్‌కు కూడా వరిస్తాయి. ప్రస్తుతం లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర ఎంబీటీయూకు 8.57 డాలర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం దిగుమతి చేసుకునే క్రూడ్ బ్యారెల్ 83 డాలర్లుగా ఉంది. ఇందులో 10 శాతం అంటే 8.3 డాలర్లు అవుతుంది. అయినా కానీ గరిష్ట పరిమితి 6.5 డాలర్లుగానే ఉంటుంది. -
'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్.. లెజెండరీ షేన్ వార్న్ భౌతికంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన వార్న్ క్రీడాలోకాన్ని కంటతడి పెట్టించాడు. అతను భౌతికంగా లేకపోయినా..వార్న్ జ్ఞాపకాలు మాత్రం చిరకాలం మిగిలిపోనున్నాయి. కాగా ఇవాళ(సెప్టెంబర్ 13) దివంగత స్పిన్నర్ షేన్ వార్న్ పుట్టినరోజు. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్న్‌కు ప్రత్యేక నివాళి. కాగా వార్న్ పుట్టినరోజు సందర్భంగా అతని ట్విటర్లో ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ట్విటర్ నుంచి వచ్చిన మెసేజ్ అందరిని ఆకట్టుకుంటుంది.'' భౌతికంగా దూరమైన మీరిచ్చిన వారసత్వం ముఖ్యమైన వాటిపై గొప్ప దృక్పథాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి జీవితం గొప్పతనాన్ని సూచిస్తుంది. జీవితంలో మీరేం సాధించారన్నది అక్కడి ప్రజలు, ప్రదేశాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది. షేన్ వారసత్వం ఎన్నటికి బతికే ఉంటుంది.. హ్యాపీ బర్త్‌డే షేన్ వార్న్.. మీరెప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటారు.'' అంటూ ట్వీట్ చేశారు. ఇక షేన్ వార్న్ 1992లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్లో వార్న్.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్ వార్న్ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్న సంగతి తెలిసిందే. A legacy gives you a perspective on what's important. It is about the richness of an individual's life, including what they accomplished and the impact they had on people and places. Shane’s Legacy will live on. Happy birthday - always in our hearts 🤍🤍🤍 pic.twitter.com/qL5NPIZnUk — Shane Warne (@ShaneWarne) September 12, 2022 చదవండి : FIFA-23 Ratings: మెస్సీ,చదవండి రొనాల్డోలకు ఊహించని షాక్.. నాకసలు ఈ జాబ్ అవసరమే లేదు.. కానీ ఇప్పుడు -
శతవసంత స్వరమాధురి
ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ సంగీత సామ్రాజ్యంలో ‘భీమ్ సేన్ గురురాజ్ జోషీ’ది అగ్రగణ్య స్థానమని చెప్పాలి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో మేరునగ ధీరునిగా పేరుగాంచిన ఆయన 1922 ఫిబ్రవరి 4న కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లాలోని రాన్ ప్రాంతంలో జన్మించారు. ‘పండిట్ భీమ్ సేన్ జోషీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన తన చిన్నతనంలో పదకొండవ ఏటనే అబ్దుల్ కరీంఖాన్ గానం విని తన్మయుడై ఆయన స్వరానికి ఉత్తేజం చెంది తానూ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును వెతుక్కొంటూ ఇల్లు వదలి గ్వాలియర్ చేరుకొని ఓ సంగీత పాఠశాలలో చేరి, ఆ తరువాత మంచి గురువు కోసం అనేక చోట్ల తిరిగి తిరిగి చివరకి 1936లో ‘సవాయిగంధర్వ’ వారి వద్ద శిష్యునిగా చేరారు. ఇక అప్పటి నుండి 24 జనవరి 2011న తన 88వ ఏట ఈలోకం వీడి వెళ్లేంత వరకు తన గంధర్వ గానంతో ‘హిందుస్తానీ సంగీతాన్ని’ అజరామరం చేస్తూనే ఉన్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర భూషణ్, కర్ణాటకరత్న లాంటి గౌరవ పురస్కారాలతో పాటు... భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా పండిట్ భీమ్ సేన్ జోషీని వరించింది. (సకిన రామచంద్రయ్య: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఆలాపనలే కాక ఆయన కన్నడ భజనలు, మరాఠీ అభంగులు, ‘బసంత్ బహార్, తాన్ సేన్’ లాంటి చలన చిత్రాల్లో పాటలు తనకు తానే సాటి అన్నట్టుగా గానం చేశారు. భీమ్ సేన్ జోషీ కర్నాటకకు చెందిన పురందర దాసు కృతులు కూడా ఆలపించటం విశేషం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఆయన కలిసి చేసిన ‘జుగల్ బందీ’ కచేరీలు సంగీతాభిమానులకు మరచిపోలేని అనుభూతులు. కర్ణాటక సంగీతంలో ‘సంగీత సామ్రాజ్ఞి’ ‘భారతరత్న’ అవార్డు గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో కలసి కూడా భీమ్ సేన్ జోషీ సంగీత కచ్చేరీలు చేశారు. ‘కిరానా ఘరానా’ స్వరశైలిలో ప్రఖ్యాతి గాంచిన భీమ్ సేన్ జోషీ హిందూస్తానీ సంగీతంలో ఓ ధ్రువ తారలా వెలిగారు. శుద్ధ కళ్యాణ్, పురియా కళ్యాణ్, పురియా, ముత్ లానీ, మారు బిహాగ్, తోడి లాంటి హిందుస్తానీ రాగాల్లో ఆయన సంగీత రసజ్ఞత ఆపూర్వం. ‘మిలేసుర్ మేరా తుమ్హారా’, అంటూ 1980 దశకంలో దూరదర్శన్ వీడియో కోసం ఆయన పాడిన పాట వినని వారుండరు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) సంగీతం సార్వత్రికమైనది. దానికి భాషా భేదాలు లేవు. అందునా భారతీయ సంగీతం వేదకాలం నుండి ప్రఖ్యాతమైంది. అటువంటి భారతీయ సంగీత సౌరభాన్ని ఈ ప్రపంచానికి పంచిపెట్టిన మహా విద్వాంసుడు ‘భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషీ’ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి. – డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ జర్నలిస్టు (ఫిబ్రవరి 4న పండిట్ భీమ్సేన్ జోషీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా) -
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన
సాక్షి, ముంబై: చెట్టంత కొడుకును కోల్పోవడాన్ని మించిన విషాదం ఈ ప్రపంచంలో బహుశా మరొకటి ఉండదేమో. 13 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం అంతటి విషాదాన్నుంచి ఇపుడిపుడే కోలుకుంటోంది. సుశాంత్ కు తుది నివాళులర్పించిన కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ (ఎస్ఎస్ఆర్ఎఫ్) పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే పాట్నాలో సుశాంత్ చిన్నతనంలో తిరిగిన ఇంటిని ఒక స్మారక చిహ్నంగా మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుశాంత్ కుటుంబం ఒక ప్రకటనలో విడుదల చేసింది. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!) సుశాంత్ కు నివాళిగా సినిమా, క్రీడలు, విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతులైన వారికి సాయం చేయాలని నిర్ణయించింది. అలాగే పాట్నాలోని రాజీవ్ నగర్‌లోని ఏర్పాటు చేయబోయే స్మారక చిహ్నంలో సుశాంత్ వ్యక్తిగత జ్ఞాపకాలు, వస్తువులు ఉంచుతామని తెలిపింది. అందులో వేలాది పుస్తకాలు, టెలిస్కోప్, ఫ్లైట్-సిమ్యులేటర్ మొదలైనవి అభిమానుల కోసం అందుబాటులో ఉంటాయనీ వెల్లడించింది. దీంతోపాటు అతని జ్ఞాపకాలు సజీవంగా ఉంచేందుకు సుశాంత్ ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ పేజీని లెగసీ ఖాతాలుగా నిర్వహించాలని భావిస్తున్నామని తెలిపింది. (సుశాంత్ ఫైనల్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్) “గుడ్ బై సుశాంత్!” సుశాంత్ కలల్ని, ఆ కళ్లలోని మెరుపును ఇక చూడలేం. తన కలల ప్రపంచాన్ని, తనకెంతో ఇష్టమైన చుక్కలను, టెలీస్కోప్ను వదిలి.. తానెప్పుడూ కలలుగనే అనంత విశ్వంలో ఆకాశంలోని చుక్కల్లో కలిసి పోయాడు. సైన్స్ గురించి అతని తపనను మళ్లీ చూడలేం. ఈ లోటు తీరనిది. ఎప్పటికీ పూడని శాశ్వత శూన్యతను సృష్టించింది. సింహంలా కలలు గన్న సుశాంత్ తమకు ప్రేరణ. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక మాకు గుల్షన్ మాత్రమే.. అభిమానులలో ప్రతి ఒక్కరినీ నిజంగా ప్రేమించాడు. ఎంతో ఇష్టపడ్డాడు. గుల్షన్‌ను ఎంతో ప్రేమతో నింపినందుకు అందరికీ ధన్యవాదాలు'' కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీ ప్రపంచాన్ని, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నెపొటిజమ్ లేదా బంధుప్రీతి బాలీవుడ్‌ను ఏలుతోందంటూ దుమారం రేగిన సంగతి తెలిసిందే. . -
రూపాయి భారీగా పతనమైంది అప్పుడే!
భారత్ ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలోకి నడవడం ప్రారంభించి యాభై ఏళ్లు పూర్తైంది. సరిగ్గా 06/06/1966 న మన కరెన్సీ రూపాయి విలువను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఒక్కసారిగా 36.5 శాతం తగ్గించేశారు. దీంతో డాలర్ తో రూపాయి మారకం విలువ 57.4 శాతానికి పడిపోయింది. లాల్ బహదూర్ శాస్త్రి అకాల మరణానంతరం కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన ఇందిరా 1966లో దేశంలో వచ్చిన తీవ్రమైన కరువును తట్టుకునేందుకు రూపాయి విలువను భారీగా తగ్గించి, ఇతర దేశాల నుంచి బియ్యం, నిత్యవసర వస్తువుల దిగుమతులకు అనుమతినిచ్చారు. 1965లో రూ.2,194 కోట్ల విలువైన వస్తువులను దిగుమతుల ద్వారా తెచ్చుకున్న ఇండియా కేవలం రూ.1,264 కోట్ల ఎగుమతులను మాత్రమే చేసింది. దీంతో 60వ దశకంలో అత్యధికంగా రూ.930 కోట్ల లోటును భారత్ చవిచూసింది. 1966లో వచ్చిన తీవ్ర కరువు కారణంగా భారత్ అమెరికా సాయాన్ని కోరింది. 'ఫుడ్ ఫర్ పీస్' పేరుతో అమెరికా సాయం చేస్తూ భారత్ కరెన్సీలోనే డబ్బును చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో అమెరికా భారత్ కు సముద్ర రవాణా ద్వారా దాదాపు 16 మిలియన్ టన్నుల గోధుమ, ఒక మిలియన్ టన్ను బియ్యం, ఒక బిలియన్ డాలర్ల రుణాన్ని అందజేసింది. సరళీకరణ చేసుకోవాలని భారత్ కు సూచించింది. దీనిపై నిర్ణయం తీసుకున్న ఇందిరా గాంధీ అప్పటివరకు డాలర్ తో రూ.4.76గా ఉన్న మారకం విలువను రూ.7.50లకు పెంచారు. డాలర్ తో రూపాయి మారకం విలువను తగ్గించడంతో ఇందిరాపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ప్రపంచబ్యాంకు, అమెరికాకు దేశాన్ని అమ్మేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. 1970లో ఇందిరా ఆర్థిక లోటును రూ.100 కోట్లకు తీసుకువచ్చారు. ఆనాడు ఇందిరా తీసుకున్న నిర్ణయం కారణంగానే నేడు మన ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటూ అభివృద్ధికి చేరువ అవుతోంది. 1947లో ఆగష్టు 15న డాలర్ తో సమానంగా ప్రారంభమయిన రూపాయి విలువ నేటికి 06/06/2016కి 600 శాతం పడిపోయింది. ఇక్కడ నుంచి మనం ఎక్కడకు వెళ్లనున్నామో! -
సంస్కారం వారసత్వం
జీవన కాలమ్ ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్‌మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ప్రపంచ ప్రఖ్యాత శ్రీలంక క్రికెట్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ని ఒక పాత్రికేయుడు అడిగాడు, ‘‘ఆటలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ పెంకిగా ప్రవర్తించడం మీద మీ అభి ప్రాయమేమిటి?’’ అని. సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘తల్లిదండ్రుల పెంపకం సరిగా లేకపోవడం కారణం’ అన్నది మురళీధరన్ సమాధానం. ఈయన ఈతరం ఆటగాడు. బొత్తిగా కిందటి శతాబ్దపు దిక్కుమాలిన కారణం చెప్పాడేమిటి! మరో కారణం- తన కంటే సీనియర్స్ (పెద్దలు) అతన్ని సరిదిద్దకపోవడం. ఇదీ ఆశ్చర్యకరమైన సమాధానమే. నేను విజయవాడలో ఆంధ్రప్రభలో పనిచేసే రోజుల్లో ఓసారి నీలంరాజు వేంకటశేషయ్య గారింట్లో విందుకి వెళ్లాను. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు, కాటూరి, రావూరి వెంకటసత్యనారాయణరావు గారూ- ఇలాంటి పెద్దలు ఉన్నారు. మాలాంటి కుర్రాళ్లం ఉన్నాం. మమ్మల్నందరినీ పేరు పేరునా పలకరించారు పింగళి. ‘పేరు?’ మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ‘ఎవర బ్బాయి తమరు!’ ‘ఫలానా పురాణం వెంకయ్యగారి కొడుకుని’ ‘అంటే రామయ్య మీకేమవుతారయ్యా?’ ‘తాతగారండి!’ వెంటనే ఆయన కళ్లలో మెరుపు. ‘నువ్వు మా రామయ్య మనవడివిరా!’ ఆనందం. అందరినీ ఇలా పేరుపేరునా పలకరించి, ‘ఏమండీ!’ అని ప్రారంభించి, ‘ఏమోయ్!’ దాకా ప్రయాణించి, ‘నువ్వుట్రా!’ అని ఆత్మీయంగా గుండెలకు హత్తుకునే దాకా ప్రశ్నలు సాగేవి. నేను చదువుకున్న చదువు, సాధించిన విజయాలూ కాదు, తెచ్చుకున్న వారసత్వం నా బ్యాంకు ఎకౌంట్. మరి నా ప్రతిభ? నా పరపతి? - నా ముందు తరానికి. ఆ కాలంలో కొత్త మనిషిని చూస్తే అడిగే మొదటి ప్రశ్న, ‘ఎవరబ్బాయివి బాబూ!’ అని. నా పరపతి నా తల్లిదండ్రులు నాకిచ్చిన వైభవం. దాదాపు 66 ఏళ్ల కిందట- మా పెత్తండ్రి కొడుకు- నాకు అన్నయ్య- పెళ్లి సంబంధం చూడడానికి మా అమ్మ, పిన్నితో వెళ్లాను. నాకప్పుడు పదేళ్లు. పెళ్లి కూతురుని కూర్చోపెట్టారు. పక్కనే ఎవరో అమ్మలక్కలు, తల్లి వగైరాలున్నారు. మా అమ్మ, పిన్ని పెళ్లికూతురుని చూశారు. తర్వాత ప్రశ్న, ‘తల్లి ఎవరు?’ ఆవిడ చిరునవ్వు నవ్వింది. ‘మీకెంత మంది పిల్లలు?’ పురుళ్లు ఎక్కడ పోసుకున్నారు? ఆరోగ్యం బాగుందా? చక్కెర, రక్తపోటు ఏమైనా ఉన్నాయా? మీ నాన్నగారేం చేసేవారు? - ఇవీ ప్రశ్నలు. ఇదేమిటి? ఎదురుగా పెళ్లి కూతురు కూర్చుంటే ముసలా విడతో పలకరింతలేమిటి? అని నాకు విచికిత్స. కాని పలకరించాల్సింది ఆవిడనే అని పాతికేళ్ల తర్వాత తెలిసివచ్చింది. వయసు గడిచి, పిల్లలు పుట్టాక- ఈ అమ్మాయి అక్షరాలా తల్లి రూపునీ, ఆరోగ్యాన్నీ, స్వభా వాన్నీ పుణికి పుచ్చుకుంటుంది. ఆవిడకి రక్తపోటు ఉందా? కీళ్ల నొప్పులు ఉన్నాయా? పురుళ్లు అయ్యాక ఒళ్లు వచ్చిందా? అక్షరాలా యథాతథంగా పిల్లకీ ఉంటుంది. అది జెనిటిక్ వారసత్వం. ఇది ఒక పార్శ్వం. వాళ్ల నాన్నగారు, ఆమె పుట్టింటినుంచి తెచ్చిన వారస త్వం. సామాజిక వారసత్వం. ఇవి ఎదురుగా కూర్చున్న పిల్లకి భవిష్యత్తులో పెట్టుబడులు. ఇది శాస్త్రీయమైన పరిణామం. హిరణ్యకశిపుడుకి ప్రహ్లాదుడు పుట్టడం, లీలావతి గర్భంతో ఉన్నప్పుడు చేసుకున్న పుణ్యం. అది మినహాయింపు. తర్వాత పెళ్లి జరిగింది. ఇద్దరూ 54 ఏళ్లు కాపురం చేశారు. మా అన్నయ్య వెళ్లిపోయాడు. ఇప్పటికీ 85 ఏళ్ల వదినెగారు పిల్లలతో, మనుమలతో, మునిమ నుమలతో నిక్షేపంగా ఉంది. పార్కుల్లో ప్రేమించి, ప్రేమ తమ హక్కని భావించి, ఆఫీసులలో కలసి పనిచేయడానికి ప్రేమని గుర్తు పెట్టుకున్న నేటి తరం యువత చాలా సందర్భా లలో పప్పులో కాలేయడం- సంవత్సరం తిరగకుండానే విడిపోవడం మనం చూస్తున్నాం. పెళ్లిలో ఇది ఒక పార్శ్వం. అమ్మాయి అందం, స్వభావం, దృక్పథం - ఇవన్నీ ఇద్దరూ ఒకటైతే మార్చుకోవచ్చు. కానీ సంప్రదా యం - అనుభవంతో రంగరించిన, తరతరాలు అందిం చిన వారసత్వానికి ప్రత్యామ్నాయం లేదు. దగ్గరతోవ లేదు. అదే క్రిస్ గేల్కీ, ముత్తయ్య మురళీధరన్కీ తేడా. ఆ విలువలే ఇవాళ ఏ కాస్తో వివాహ వ్యవస్థకి గొడుగు పడుతున్నాయి. ముత్తయ్య చెప్పిన మరొకమాట. గేల్ పెంకితనానికి పెద్దలూ, సీనియర్లూ సరిదిద్దకపోవడం మరొక కారణమని. అస్తు. కానీ మనకి ‘పెద్దరికం’ ఎక్కడ చచ్చింది? కాల్‌మనీ రాకెట్లు నడుపుతున్న పెద్దవారా? ఆస్తుల్ని దోచుకుంటున్న నాయకులా? మతాన్నీ, కులాన్నీ పణంగా పెట్టి రాజకీయ పబ్బాన్ని గడుపుకొంటున్న అవకాశవాదులా? ఇవాళ యువతరంలోని ‘అవ్యవస్థ’కి పెద్ద లోపం- భ్రష్టుపట్టిన పెద్దల వారసత్వం. ఇంతకీ ముత్తయ్య మురళీధరన్ చేసిన అపకారం నా కాలమ్‌కి పెట్టుబడి. - గొల్లపూడి మారుతీరావు -
ఇమ్రాన్ హత్యకు రెండో భార్య కుట్ర?
పాకిస్థాన్ రాజకీయ నాయకుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌ను అతని రెండో భార్య రెహమ్ విషమిచ్చి చంపాలనుకుందా.. తద్వారా అతని రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని ప్లాన్ వేసిందా? అందుకోసమే ఇద్దరి మధ్య ఘర్షణ.. తత్ఫలితంగానే తలాఖ్ వరకు వ్యవహారం వెళ్లిందని తాజాగా తెలుస్తోంది. చివరకు పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్‌ను ఆయన సన్నిహితుల ద్వారా ఈ విషయమై హెచ్చరించాయట. పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్ సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ రెండో భార్య రెహమ్‌కు విడాకులు ఇచ్చిన నేపథ్యంలో ఇపుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు అరిఫ్ నిజామి స్థానిక మీడియాతో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లిద్దరు పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ వ్యవహారాలను తనకు చెప్పాల్సిందిగా రెహమ్ ఇబ్బంది పెట్టిందని, ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని చెప్పుకొచ్చారు. ఆమెను లండన్‌లో జరుగుతున్న మీటింగ్‌కు పంపించి, ఆమెకు డైవోర్స్ నోటీసును ఈ -మెయిల్ ద్వారా పంపించారన్నారు. ఇమ్రాన్ జీవితాన్ని రెహమ్ నరకంగా మార్చివేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇమ్రాన్ సన్నిహితుల ద్వారా అతణ్ని హెచ్చరించాయని తెలిపారు. ఆమె అతణ్ని మట్టుబెట్టే అవకాశాలున్నాయనే అనుమానాల్ని వ్యక్తం చేశాయన్నారు. అసలు రెహమ్ - ఇమ్రాన్ పెళ్లి జరగకుండా ఉండేందుకు తాను గట్టిగా ప్రయత్నించానన్నాడు. ఒకదశలో ఇమ్రాన్‌కు దూరంగా ఉండాలని రెహమ్‌ను తాను హెచ్చరించినట్టు కూడా తెలిపారు. అయినా తమ సలహాను ఇమ్రాన్ లక్ష్యపెట్టలేదన్నారు. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహితుడైన మరో జర్నలిస్టు షాహిద్ మసూద్ కూడా నిజామి వ్యాఖ్యలను సమర్ధించారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అస్వస్థతకు గురైనపుడు వైద్య పరీక్షలు చేయించగా. అతడి శరీరంలో ఎలకల మందుకు సంబంధించిన అవశేషాలు లభించాయన్నారు. కాగా 63 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్, టీవీ జర్నలిస్ట్ రెహమ్ ఇద్దరూ 2014 డిసెంబర్ నెలలో పెళ్లి చేసున్నారు. ఏడాది తిరగక ముందే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటించడం సంచలనం రేపింది.