న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ఉత్పత్తి ధరలపై కేంద్రానికి కీలక సూచనలు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ, ఓఎన్‌జీసీ ఆయిల్ ఇండియాకు కొంత ఊరట కల్పించింది. ఈ సంస్థలకు ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించిన క్షేత్రాల (లెగసీ ఫీల్డ్స్) నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను.. దిగుమతి చేసుకునే ధరలో 10 శాతం నిర్ణయించాలని పేర్కొంది. అలాగే, ఇవే సంస్థలు కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ (ప్రస్తుత సామర్థ్యం కాకుండా)కు 20 శాతం అధిక ధరను పారిఖ్ కమిటీ సూచించింది.
ఇక లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ధరను దిగుమతి ధరలో 10 శాతం లేదా ఎంబీటీయూ గ్యాస్‌కు గరిష్టంగా 6.5 డాలర్లు మించకూడదని పేర్కొంది. అదే సమయంలో కనిష్టంగా 4 డాలర్లను సిఫారసు చేసింది. దీనివల్ల ఎరువుల కంపెనీలపై భారం తగ్గనుంది. ఎందుకంటే వీటికి ప్రధాన ఇంధనంగా సీఎన్‌జీ ఉన్న విషయం గమనార్హం. ఇవే ధరల పరిమితులు విద్యుత్ రంగానికీ సరఫరా చేసే గ్యాస్‌కు కూడా వరిస్తాయి. ప్రస్తుతం లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర ఎంబీటీయూకు 8.57 డాలర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం దిగుమతి చేసుకునే క్రూడ్ బ్యారెల్ 83 డాలర్లుగా ఉంది. ఇందులో 10 శాతం అంటే 8.3 డాలర్లు అవుతుంది. అయినా కానీ గరిష్ట పరిమితి 6.5 డాలర్లుగానే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment