Big relief
-
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు ఊరట
-
సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట
-
అజిత్ పవార్ కు భారీ ఊరట..
-
సెబీకి షాక్.. ముకేశ్ అంబానీకి ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)తో 2009లో విలీనమైన పెట్రోలియం లిమిటెడ్ (ఆర్పీఎల్)కు సంబంధించిన షేర్లలో 2007లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల విషయంలో ముకేశ్ అంబానీ మరో రెండు సంస్థలకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ విధించిన జరిమానా విధింపును కొట్టివేస్తూ శాట్ (సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్) ఇచ్చిన రూలింగ్‌ను తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.ఈ విషయంలో సెబీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. శాట్ జారీ చేసిన ఉత్తర్వుపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మా జోక్యాన్ని కోరే ఈ అప్పీల్లో చట్టం ప్రమేయం లేదు. మీరు ఒక వ్యక్తిని ఏళ్ల తరబడి వెంబడించలేరు‘ అని బెంచ్ పేర్కొంది. కేసు వివరాలు ఇవీ... » నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాల్లో ఆర్పీఎల్ షేర్ల విక్రయం, కొనుగోలులో అవకతవకలు జరిగాయన్నది కేసు సారాంశం. » 2009లో ఆర్ఐఎల్తో విలీనం అయిన లిస్టెడ్ అనుబంధ సంస్థ– ఆర్పీఎల్లో దాదాపు 5 శాతం వాటాను విక్రయించాలని 2007 మార్చిలో ఆర్ఐఎల్ నిర్ణయం తీసుకుంది. » ఈ నేపథ్యంలోనే 2007 నవంబర్‌లో ఆర్పీఎల్ ఫ్యూచర్స్‌లో లావాదేవీలు చేపట్టేందుకు ఆర్ఐఎల్ 12 మంది ఏజెంట్లను నియమించిందని, ఈ 12 మంది ఏజెంట్లు కంపెనీ తరపున ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) సెగ్మెంట్లో షార్ట్ పొజిషన్లు తీసుకున్నారని, అదే సమయంలో కంపెనీ నగదు విభాగంలో ఆర్పీఎల్ షేర్లలో లావాదేవీలు చేపట్టిందని సెబీ ఆరోపించింది.» ఈ కేసు విషయంలో సెబీ 2021 జనవరిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)పై రూ. 25 కోట్లు, కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీపై రూ. 15 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ. 20 కోట్లు, ముంబై సెజ్‌పై రూ. 10 కోట్లు జరిమానా విధించింది. నవీ ముంబై సెజ్, అలాగే ముంబై సెజ్‌ను ఒకప్పుడు రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసిన ఆనంద్ జైన్ ప్రమోట్ చేయడం గమనార్హం. 12 సంస్థలకు నిధులు సమకూర్చడం ద్వారా మొత్తం మానిప్యులేషన్ స్కీమ్‌కు నవీ ముంబై సెజ్, ముంబై సెజ్ పాత్రధారులుగా మారినట్లు ఆరోపణ.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!» అంబానీ, నవీ ముంబై సెజ్, ముంబై సెజ్‌లపై 2021లో సెబీ జారీ చేసిన ఉత్తర్వులను శాట్ 2023లో రద్దు చేసింది. జరిమానాకు సంబంధించి డిపాజిట్‌గా ఉంచిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని శాట్ ఆదేశించింది. కార్పొరేట్ సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి ఆరోపణకు మేనేజింగ్ డైరెక్టర్‌ను బాధ్యునిగా చేయలేవని పేర్కొంది. ఇద్దరు సీనియర్ అధికారులు అక్రమ లావాదేవీలు నిర్వహించారని స్పష్టమవుతోందని, ఈ విషయంలో ముకేశ్ అంబానీ పాత్ర ఉన్నట్లు సెబీ రుజువుచేయలేకపోయిందని పేర్కొంది. ఆర్‌ఐఎల్‌పై ఆరోపణలను మాత్రం శాట్ కొట్టివేయకపోవడం గమనార్హం. » కాగా, శాట్ రూలింగ్‌ను సవాలుచేస్తూ, డిసెంబర్ 2023 డిసెంబర్ 4న సెబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట..
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళానికి చెందిన మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. దీనిని జైలు శిక్షగా మారుస్తున్నట్లు తీర్పునిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో.. శిక్షను ఎంత తగ్గించారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ బృందంతోపాటు బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తాము మొదటి నుంచి భారతీయ మాజీ నేవీ అధికారులకు అండగా ఉన్నామని, రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. దీనిపై ఖతార్ అధికారులతోనూ చర్చిస్తున్నట్లు తెలిపింది. చదవండి: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?! కాగా భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు గూఢచర్యం కేసు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసిన భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో వారికి మరణశిక్ష విధించింది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్‌పై ఖతార్ కోర్టు విచారణ జరిపి.. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది. -
లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్! కొత్త విధానం ప్రకటించిన ఆర్బీఐ
అధిక వడ్డీ రేటు ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న హోమ్, ఆటో, ఇతర లోన్లు తీసుకున్నవారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారడానికి రుణగ్రహీతలను అనుమతించే ఫ్రేమ్‌వర్క్ తీసుకురానున్నట్లు తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఫ్రేమ్‌వర్క్ గురించి తెలియజేశారు. ఈ ఫ్రేమ్‌వర్క్ త్వరలో అమలులోకి రానున్నందున లోన్ టెన్యూర్, ఈఎంఐల గురించి రుణగ్రహీతలకు స్పష్టంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచించారు. రుణగ్రహీతలకు సమాచారం అందించకుండానే, వారి సమ్మతి లేకుండానే బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ లోన్ల టెన్యూర్‌ను అసమంజసంగా పొడిగించిన అనేక ఉదంతాలు తాము చేపట్టిన పర్యవేక్షక సమీక్షలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ద్వారా వెల్లడయ్యాయన్నారు. రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించడానికి బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు అనుసరించేలా సరైన కండక్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. లోన్ టెన్యూర్, ఈఎంఐ మార్పుల గురించి రుణగ్రహీతలకు బ్యాంకులు స్పష్టంగా తెలియజేసేలా, ఫిక్స్డ్ రేట్ లోన్లకు మారడం లేదా లోన్లను ఫోర్క్లోజర్ చేయడానికి సంబంధించిన ఆప్షన్ల గురించి సమాచారం అందించేలా ఈ ఫ్రేమ్‌వర్క్ నియంత్రిస్తుందన్నారు. అలాగే వివిధ ఛార్జీలను పారదర్శకంగా బహిర్గతం చేసేలా చేస్తుందన్నారు. దీనికి సంబంధించి సవివరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Bank Charges: బ్యాంక్ కస్టమర్లకు దిమ్మతిరిగే విషయం.. చార్జీలు ఎన్ని రూ.వేల కోట్లు కట్టారో తెలుసా? -
ఊరటపై రాహుల్ గాంధీ రియాక్షన్
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో దక్కిన ఊరటతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలతో పరువు నష్టం కేసు కారణంగా ఆయనకు సూరత్ కోర్టులో రెండేళ్ల శిక్ష పడగా.. ఆ కారణంగానే ఆయన ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రయల్‌కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ స్టే విధించడంతో ఆయనపై వేటు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోర్టు తీర్పు కాపీతో లోక్‌సభ సెక్రటరీని కలిశారు కాంగ్రెస్ ఎంపీలు. ఒకవేళ వేటు వెంటనే తొలగిపోతే మాత్రం ఈ సెషన్‌కే ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉంది. మణిపూర్ అంశంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరగనుంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీకి ఊరట దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత సంబురాలు చేసుకుంటున్నాయి. సత్యమే గెలుస్తుందనే థీమ్‌తో ఆ పార్టీ నేతలంతా రియాక్షన్లు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఈ పరిణామంపై స్పందించారు. ► ‘‘ఏది వచ్చినా.. నా కర్తవ్యం అలాగే ఉంటుంది. దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన’’.. అంటూ తీర్పును చాలా తేలికగా తీసుకుంటూ ట్వీట్ చేశారాయన. ఇవాళ కాకుంటే రేపైనా నిజం గెలుస్తుంది. ఏం జరిగినా నా రూట్ క్లియర్‌గా ఉంది. నేనేం చేయాలి.. నా పనేంటనే విషయంలో నాకు క్లారిటీ ఉంది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ, నాపై ప్రేమ చూపించిన ప్రజలకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. Come what may, my duty remains the same. Protect the idea of India. — Rahul Gandhi (@RahulGandhi) August 4, 2023 ► ఈ పరిణామంపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్విటర్ ద్వారా స్పందించారు. సత్యం ఒక్కటే గెలుస్తుందని ట్వీట్ ఖర్గే.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. రాహుల్‌ను బీజేపీ కుట్రపూరితంగా వేటాడటం పూర్తిగా బట్టబయలైంది. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు రాజకీయాలను ఇకనైనా వాళ్లు ఆపేయాలి అంటూ ట్వీట్ చేశారాయన. Truth Alone Triumphs! We welcome the verdict by the Hon’ble Supreme Court giving relief to Shri @RahulGandhi. Justice has been delivered. Democracy has won. The Constitution has been upheld. BJP’s conspiratorial hounding of Shri Gandhi has been thoroughly exposed. Time for… — Mallikarjun Kharge (@kharge) August 4, 2023 రాహుల్ గాంధీకి దక్కింది భారీ ఊరటనే. ఆయనపై జరిగిన కుట్ర ఇవాళ విఫలమైంది. స్పీకర్‌ను కలిసి ఆయన్ని పార్లమెంట్‌లోకి అనుమతించాలని గట్టిగా కోరతాం. ఆయన అనర్హత ఎత్తేయాలని గళం వినిపిస్తాం. స్పీకర్‌కు లేఖ రాస్తా అని లోక్‌సభలో కాంగ్రెస్ సభా నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. #WATCH | After Supreme Court stays the conviction of Congress leader Rahul Gandhi in 'Modi' surname defamation case, Congress MP Adhir Ranjan Chowdhury says, "The SC's decision is a big relief for Congress leader Rahul Gandhi. The conspiracy against Rahul Gandhi has failed… pic.twitter.com/MogT1DxiQI — ANI (@ANI) August 4, 2023 ఇప్పుడు ప్రతీది సవ్యంగా సాగుతుందేమో.. రాహుల్ గాంధీ ఊరటపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘‘స్వాతంత్రం వచ్చాక.. పరువు నష్టం కేసులో పూర్తిస్థాయి శిక్ష పడిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీనే. కానీ, దేశ సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టు తీర్పును కొట్టేసింది. ఇప్పుడు ప్రతీది సవ్యంగా సాగుతోంది. రాజస్థాన్‌లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ::: గెహ్లాట్ #WATCH | Rajasthan CM & Congress leader Ashok Gehlot on Supreme Court staying conviction of Rahul Gandhi in 'Modi' surname remark " After independence, Rahul Gandhi is the first person who got a full sentence of two years in a defamation case. Today, the Supreme Court rejected… pic.twitter.com/v9RcETEzU3 — ANI (@ANI) August 4, 2023 ► నిజం మాట్లాడేవాడు ఎవరికీ, దేనికి భయపడడు. జనాల మధ్య తిరిగి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకునేవాడు.. రాజు కంటే గొప్పవాడే అవుతాడు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ వీడియోలతో పోస్టులు పెడుతోంది. राजा से बड़ा भाग्य पथिक का होता है pic.twitter.com/eTTAf9LCTg — Congress (@INCIndia) August 4, 2023 ► సూర్య చంద్రులు, సత్యం.. ఈ మూడూ ఎంతోకాలం దాచబడవు.. అంటూ రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. "Three things cannot be long hidden: the sun, the moon, and the truth” ~Gautama Buddha माननीय उच्चतम न्यायालय को न्यायपूर्ण फैसला देने के लिए धन्यवाद। सत्यमेव जयते। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 4, 2023 ► కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేశ్ సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ యంత్రాంగం ఎంత ప్రయత్నించినా.. రాహుల్ గాంధీ లొంగలేదు. న్యాయంపై విశ్వాసం ఉంచాడు. కోర్టు తీర్పు బీజేపీకి, వాళ్ల సహచరులకు ఒక గుణపాఠం. వాళ్లను ఎండగడుతూనే ఉంటాం. రాజ్యాంగ ఆదర్శాలను పాటిస్తుంటాం. కోర్టు తీర్పు సత్యం, న్యాయానికి బలమైన రుజువులు అంటూ ట్వీట్ చేశారు. The Supreme Court judgment is a strong vindication of truth and justice. Despite the relentless efforts of the BJPs machinery, @RahulGandhi has refused to bend, break or bow, choosing instead to place his faith in the judicial process. Let this be a lesson to the BJP and its… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 4, 2023 Look at Jitendra Awhad, he is NCP MLA still celebrating & chanting for Rahul Gandhi along with INC leaders. 🔥🔥pic.twitter.com/lech8heUSd — Amock (@Politics_2022_) August 4, 2023 ► ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్.. కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల గాంధీకి దక్కిన ఊరటపై ‘రాహుల్ గాంధీ’నినాదాలతో సంబురాలు చేసుకున్నారు. ► పరువు నష్టం దావా కేసులో శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూనే.. తమ పోరాటం కొనసాగిస్తానని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ మీడియాకు తెలిపారు. -
కెనడాలోని భారత విద్యార్ధులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: కెనడాలోని భారత విద్యార్థులకు గొప్ప ఉపశమనం లభించింది. విద్యాభ్యాసం నిమిత్తం కెనడా వచ్చిన భారతీయ విద్యార్ధులు ఫేక్ ఆఫర్ లెటర్లతో వచ్చారని నిర్ధారించి కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ బహిష్కరణ వేటు వేసినా విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ చొరవతో స్పందించిన CBSA మానవతాదృక్పథంతో స్పందించి బహిష్కరణ ప్రక్రియను నిలిపివేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ విక్రంజీత్ సహానీ, భారత హై కమిషన్ సహాయంతో బహిష్కరణ వేటుకు గురైన విద్యార్థులకు న్యాయం చేయమని కెనడా ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా అందుకు సానుకూలంగా స్పందిస్తూ 700 విద్యార్ధులపై వారు విధించిన వేటును నిలిపివేశారు. ఈ మేరకు ప్రపంచ పంజాబీ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఎంపీ విక్రంజీత్ సహానీ కెనడా ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తుపై మేము కెనడా ప్రభుత్వాన్ని కోరిన ప్రకారం వారు సానుకూలంగా స్పందించడం చాలా సంతోషకరం. ఈ విద్యార్థుల తప్పేమీ లేదని ఎవరో చేసిన తప్పుకు వీరిని శిక్షించడం సరికాదని వారికి వివరించడం జరిగింది. బ్రిజేష్ మిశ్రా అని జలంధర్ కు చెందిన ఒక ఏజెంట్ తన స్వార్ధం కోసం ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫేక్ రసీదులు ఇచ్చారు. దానికి విద్యార్థులు బలయ్యారు. మీరే అనుమతించారు.. ఎటువంటి తనిఖీలు చేయకుండానే కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వారిని అనుమతించారని వారికి జరిగింది వివరించిన తర్వాత వారు పరిస్థితిని అర్ధం చేసుకుని మొత్తం 700 విద్యార్ధులపై వేసిన వేటును నిలిపివేశారు. ఉదార స్వభావంతోనూ మానవతా దృక్పథంతోనూ స్పందించిన కెనడా ఎంపీ సీన్ ఫ్రేజర్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. Sincere thanks to @seanfraserMP @Bradredekopp @jennykwanBC for their very considerate and compassionate take on 700 students who are victims of fraudulent agencies and obliging our request for staying the deportation. I am hopeful that witness testimonies will help in punishing… pic.twitter.com/eXTXBYMOQ2— Vikramjit Singh MP (@vikramsahney) June 9, 2023 Thanks for this big relief. I am happy that our request has been considered to put an hold on the deputation of students who were made victims of the connivance of their agents and counterparts in Canada for issuing fake admission letters and fee receipts on which they received… https://t.co/Sl2FvbXCGV— Vikramjit Singh MP (@vikramsahney) June 8, 2023 -
ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే రిలీజ్ చేయండి: పాక్ సుప్రీం కోర్టు
ఇస్లామాబాద్: పీటీఐ అధినేత, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్తాన్ సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయన అరెస్ట్‌ను చట్టవిరుద్ధమైందిగా తేల్చిన సుప్రీం కోర్టు.. తక్షణమే ఆయన్ని విడుదల చేయాలని గురువారం సాయంత్రం ఆదేశించింది. అంతకు ముందు.. ఇమ్రాన్ ఖాన్‌ను గంటలోపు తమ ఎదుట ప్రవేశపెట్టాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. దర్యాప్తు సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరోను ఆదేశించింది. దీంతో.. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇమ్రాన్ ఖాన్‌కు కోర్టుకు తీసుకొచ్చారు. అయితే ఆయన అరెస్ట్‌లో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వ్యవహరించిన తీరును ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ను నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారని మండిపడింది. అల్ ఖాదీర్ ట్రస్ట్ ల్యాండ్‌కు సంబంధించిన కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు విచారణకు హాజరైన ఇమ్రాన్ ఖాన్‌ను.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఎనిమిది రోజుల విచారణకు ఇమ్రాన్ ఖాన్‌కు కస్టడీకి తీసుకుంది కూడా. మరోవైపు ఖాన్ అరెస్టును ఖండిస్తూ.. పాక్‌లో అల్లర్లు హింసకు పాల్పడ్డారు పీటీఐ కార్యకర్తలు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు జోక్యం ద్వారా పరిస్థితి కాస్త చల్లబడినట్లయ్యింది. PTI Chairman @ImranKhanPTI in Supreme Court today. His arrest has been declared illegal. pic.twitter.com/ewwwIRfqaz — PTI (@PTIofficial) May 11, 2023 The barbaric arrest of Imran Khan buries the dead democracy of Pakistan in a grave! pic.twitter.com/outJDcFakT — Ashok Swain (@ashoswai) May 9, 2023 -
సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట
-
సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు
న్యూఢిల్లీ: సహారా గ్రూపునకు చెందిన నాలుగు కోపరేటివ్ (హౌసింగ్) సొసైటీల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు, 9 నెలల్లోగా చెల్లింపులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సెబీ వద్ద ఎస్క్రో ఖాతాలో సహారా గ్రూప్ డిపాజిట్ చేసిన రూ.24,000 కోట్ల నిధుల నుంచి రూ.5,000 కోట్లను సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేయాలంటూ జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఓ ప్రజాహిత వ్యాజ్యం విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్జి ఆర్ సుభాష్ రెడ్డి చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తెలిపింది. పెద్ద ఎత్తున ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో పిటిషనర్ల అభ్యర్థన సహేతుకంగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిందని కోపరేషన్ శాఖ ప్రకటన విడుదల చేసింది. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
‘జీ’, సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా చర్యలు: ఎన్సీఎల్ఏటీ భారీ ఊరట
ముంబై: మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి భారీ ఊరట లభించింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) శుక్రవారం జీపై దివాలా చర్యలను ప్రారంభించాలని ఆదేశించిన ఎన్సీఎల్టీ ఉత్తర్వుపై స్టే విధించింది. జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పునిత్ గోయెంకా, కంపెనీకి వ్యతిరేకంగా దివాలా చర్యలను సవాలు చేస్తూ చేసిన అభ్యర్థనను మేరకు ఈ పరిణామం చోటుచేసుకుంది. గోయెంకా దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది. దీనిపై విచారణను మార్చి 27వ తేదీకి వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలపై గోయెంకా సంతోషం వ్యక్తం చేశారు.అందరి వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రతిపాదిత విలీనాన్ని సకాలంలో పూర్తి చేయడంపై కట్టుబడి ఉన్నామన్నారు. కాగా జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్), సిటీ నెట్‌వర్క్స్‌పై దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపడం ఆందోళనకు దారి తీసింది. దీనికి సంబంధించి ఇండస్ఇండ్ బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్లను విచారణకు స్వీకరించింది. జీల్ వ్యవహారంలో సంజీవ్ కుమార్ జలాన్‌ను, సిటీ నెట్వర్క్స్ విషయంలో మోహిత్ మెహ్రాను దివాలా పరిష్కార నిపుణులుగా (ఆర్పీ) నియమించింది. ఉత్తర్వులపై రెండు వారాల స్టే ఇవ్వాల్సిందిగా జీల్ కోరినప్పటికీ ఎన్సీఎల్టీ బెంచ్ నిరాకరించింది. దీనిపై జీ ఎంటర్ప్రైజెస్ ఎండీ పునీత్ గోయెంకా .. నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్ఏటీ) సవాలు చేసిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెడితే జీ గ్రూప్‌లో భాగమైన సిటీ నెట్వర్క్స్ వివిధ బ్యాంకుల నుంచి రూ. 850 కోట్లకు మేర రుణాలు తీసుకుంది. జీల్‌ను హామీదారుగా ఉంచి ఇండస్ఇండ్ నుంచి తీసుకున్న రూ. 89 కోట్ల రుణ చెల్లింపులో సిటీ డిఫాల్ట్ కావడంతో తాజా పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సోనీలో జీల్ విలీనం తుది దశల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో డీల్‌కు అడ్డంకులు ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఎన్సీఏల్ఏటీ తాజా ఉత్తర్వు సంస్థకు భారీ ఊరట కల్పించింది. -
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు ఊరట
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ఉత్పత్తి ధరలపై కేంద్రానికి కీలక సూచనలు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ, ఓఎన్జీసీ ఆయిల్ ఇండియాకు కొంత ఊరట కల్పించింది. ఈ సంస్థలకు ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించిన క్షేత్రాల (లెగసీ ఫీల్డ్స్) నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను.. దిగుమతి చేసుకునే ధరలో 10 శాతం నిర్ణయించాలని పేర్కొంది. అలాగే, ఇవే సంస్థలు కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ (ప్రస్తుత సామర్థ్యం కాకుండా)కు 20 శాతం అధిక ధరను పారిఖ్ కమిటీ సూచించింది. ఇక లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ధరను దిగుమతి ధరలో 10 శాతం లేదా ఎంబీటీయూ గ్యాస్‌కు గరిష్టంగా 6.5 డాలర్లు మించకూడదని పేర్కొంది. అదే సమయంలో కనిష్టంగా 4 డాలర్లను సిఫారసు చేసింది. దీనివల్ల ఎరువుల కంపెనీలపై భారం తగ్గనుంది. ఎందుకంటే వీటికి ప్రధాన ఇంధనంగా సీఎన్జీ ఉన్న విషయం గమనార్హం. ఇవే ధరల పరిమితులు విద్యుత్ రంగానికీ సరఫరా చేసే గ్యాస్‌కు కూడా వరిస్తాయి. ప్రస్తుతం లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర ఎంబీటీయూకు 8.57 డాలర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం దిగుమతి చేసుకునే క్రూడ్ బ్యారెల్ 83 డాలర్లుగా ఉంది. ఇందులో 10 శాతం అంటే 8.3 డాలర్లు అవుతుంది. అయినా కానీ గరిష్ట పరిమితి 6.5 డాలర్లుగానే ఉంటుంది. -
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq — Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022 దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది. ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే! -
మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
-
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి,ముంబై: విమానయాన సంస్థలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగి వస్తున్న నేపథ్యంలో జెట్ ఇంధనం (ATF) ధరలు 2.2 శాతం దిగి వచ్చింది. ఈ మేరకు దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు శనివారం ఒక నోటిఫికేషన్ విడుదల చేశాయి. ధరలు కిలోలీటర్‌కు రూ. 3,084.94 లేదా 2.2 శాతం తగ్గి, కిలోలీటర్‌కు రూ. 138,147.93గా ఉన్నాయని తెలిపాయి. ఈ ఏడాదిలో రేట్లు తగ్గించడం ఇది రెండోసారి మాత్రమే. గత నెలలో ధరలు కిలో లీటర్‌కు రూ. 141,232.87 (లీటర్‌కు రూ.141.23)కు ఉన్నాయి. స్థానిక పన్నులను బట్టి ధరలు కూడా రాష్ట్రానికి, రాష్ట్రానికి రేట్లో వ్యత్యాసం ఉంటుంది. బెంచ్‌మార్క్ అంతర్జాతీయ చమురు ధరల రేట్ల ఆధారంగా ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరించబడతాయి. జూన్ 1 నాటి రివ్యూలో ధరలలో మార్పులేనప్పటికీ జూన్ 16 నాటి పెంపుతో విమాన ఇంధన ధరలు ఆల్ టైం హైకి చేరాయి. మొత్తంగా, సంవత్సరం ప్రారంభం నుండి 11 సార్లు రేట్లు సవరించగా, దీంతో ఆరు నెలల్లో ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం భయాల కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు చేరాయి. ఇదిలా ఉండగా, ఏటీఎఫ్ ధరల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలతో సమావేశమయ్యేందుకు ఇండియన్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్‌లు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. స్పైస్‌జెట్, గోఫస్ట్ ఇండిగో, విస్తారా ఇతర విమానయాన సంస్థలు ఐవోసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ కమిటీలో ఉన్నాయి. -
పద్మావతికి రీలీఫ్.. స్వామి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ/ లక్నో : బాలీవుడ్ చిత్రం పద్మావతి మేకర్లకు పెద్ద ఊరట లభించింది. చిత్ర విడుదలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లను సుప్రీం కోర్టు, అలహాబాద్ హైకోర్టులు కొట్టివేశాయి. దర్శకుడు బన్సాలీ చరిత్రను వక్రీకరించారని.. కాబట్టి విడుదలను అడ్డుకోవాలంటూ సిద్దారాజ్సిన్హ్ ఎం ఛుదాసామ, మరో 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విషయంలో సెన్సార్ బోర్డు అన్ని కోణాలను పరిశీలించాకే సర్టిఫికెట్ ఇస్తుందన్న నమ్మకం వ్యక్తం చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఇక చిత్రం విడుదల కాకముందే అందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో కొందరు అలహాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అందులోని వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. ఈ వివాదాన్ని సంబంధించి విభాగం వద్దే తేల్చుకోవాలంటూ పిటిషనర్‌కు సూచించింది. కాగా, రాణి పద్మిణి-అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య రొమాంటిక్ ఎపిసోడ్ చిత్రీకరించాడంటూ ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన మొదటి నుంచి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని ముందు తమకు ప్రదర్శించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆందోళనకారులకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఈ వివాదంపై ఏకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైపోయింది. బన్సాలీకి నిధులెక్కడివి? : స్వామి కాగా, పద్మావతి చిత్ర వివాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తనదైన శైలిలో స్పందించారు. ఈ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దర్యాప్తు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దుబాయ్ నుంచి నిధులతో హిందూ మహిళలను అవమానించేలా బన్సాలీ చిత్రాలు తీస్తున్నారంటూ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. దుబాయ్ ప్రజలు వాళ్ల మతానికి చెందిన రాజులను గొప్పగా చూడాలని అనుకుంటున్నారని.. అందుకే ఇక్కడి మేకర్లకు నిధులు సమకూరుస్తూ సినిమాలు తీయించుకుంటున్నారంటూ విమర్శించారు. -
జీఎస్టీ: ఈ కామర్స్ సంస్థలకు భారీ ఊరట
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు నేపథ్యంలో ఇ-కామర్స్ సంస్థలకు భారీ ఉపశమనం లభించనుంది. టిడిఎస్, టిసిఎస్ నిబంధనల అమలును ప్రభుత్వం వాయిదా వేసింది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ చట్టం అమలుకు ఇంక నాలుగు రోజులు సమయం ఉండగా ఈ కామర్స్ సంస్థలకు ఊరట కల్పించేలా ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ కామర్స్ సంస్థలు 1 శాతం పన్ను టీసీఎస్ ను వసూలు చేయాల్సిన అవసరం లేదు. దీంతో 1 శాతం పన్నును మూలంలోనే మినహాయించాల్సిన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ లాంటి ఇ-కామర్స్ సంస్థలకు ఊరటనందించింది. వాణిజ్యం మరియు పరిశ్రమల నుంచి పొందిన అభిప్రాయాల ఆధారంగా, సీజీఎస్టీ/ స్టేట్ జిఎస్టి చట్టం 2017 యొక్క టీడీఎస్ (సెక్షన్ 51), టీసీఎస్ (సెక్షన్ 52) కు సంబంధించిన నిబంధనల అమలును ప్రభుత్వం ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చారిత్రక పన్ను సంస్కరణ జీఎస్టీ కోసం ఇకామర్స్ కంపెనీలు, వారి పంపిణీదారులకు మరింత ఎక్కువ సమయం ఇవ్వడానికే ఈ చర్య తీసుకున్నామని పేర్కొంది. జూలై 1 నుంచి అమలు చేయనున్న జీఎస్టీ చట్టం ప్రకారం దీన్ని ఈ కామర్స్ సంస్థలు అమలు చేయాల్సి ఉంది. సెంట్రల్ జిఎస్టి (సిజిఎస్టి) చట్టం ప్రకారం టిటిఎస్ (మూలధనం నుండి పన్ను తగ్గింపు) 1 శాతం పన్నును అమలును పెండింగ్‌లో పెట్టింది. నోటిఫై చేయబడిన సంస్థలు రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ సరకులకు లేదా సేవలకు సరఫరాదారులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఈ నిబంధన అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది. అలాగే రూ.20 లక్షల లోపు చిన్న వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదు కావాల్సిన అవసరంలేదు. మరోమాటలో చెప్పాలంటే ఇ-వ్యాపారం నిర్వహించే వ్యక్తులు తక్షణమే జీఎస్టీఎన్ లో రిజిస్టర్ కావల్సిన అవసరం లేదు.