ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు.
सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq
— Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022
దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది.
ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే!
Comments
Please login to add a commentAdd a comment