illegal mining case
-
సీబీఐ విచారణకు అఖిలేశ్ గైర్హాజరు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల తవ్వకం కేసులో సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ ఇచి్చన సమన్లను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బేఖాతరు చేశారు. సీబీఐ సమన్ల ప్రకారం గురువారం ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌కు అఖిలేశ్ వెళ్లాలి. కానీ ఆయన లక్నోలోనే ఉండిపోయారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ‘‘ అంతకుముందే ఖరారైన షెడ్యూల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గురువారం మీ ఆఫీస్‌కు అఖిలేశ్ రావట్లేదు. కానీ అవకాశం ఉన్నంతమేరకు మీకు నా సహాయసహకారాలు ఉంటాయి’’ అని అఖిలేశ్ తరఫున న్యాయవాది సీబీఐకి వివరణ ఇచ్చారు. తర్వాత లక్నోలో పార్టీ ఆఫీస్‌లో జరిగిన వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సభలో అఖిలేశ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టడాన్ని అఖిలేశ్ ప్రస్తావించారు. -
నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ–టెండర్ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2012–16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్ స్పందించారు. ‘‘ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?’’ అంటూ బీజేపీపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు. ఏమిటీ కేసులు? హమీర్పూర్ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012–17లో అఖిలేశ్ సీఎంగా ఉంటూనే 2012–13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ–టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్పూర్ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది. -
అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు
లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మైనింగ్‌లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే..సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది. మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. -
అక్రమ మైనింగ్ కేసులో ఐఎన్ఎల్డి పార్టీ నేత అరెస్టు
చండీగర్: అక్రమ మైనింగ్ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఆయన సహాయకుడు కుల్విందర్ సింగ్‌లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి)కి చెందిన దిల్బాగ్ సింగ్, సోనిపట్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ ప్రాంగణాలపై జనవరి 4 నుండి ఈడీ దాడులు నిర్వహించింది. దిల్బాగ్ సింగ్ ఆయన సహచరుల ఆవరణలో విదేశీ ఆయుధాలు, 300 కాట్రిడ్జ్‌లు, 100కు పైగా మద్యం సీసాలు, రూ.5 కోట్ల విలువైన నగదు, సుమారు 5 కిలోల ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. దిల్బాగ్ సింగ్, కుల్విందర్ సింగ్‌లను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. లీజు గడువు ముగిసినప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన తర్వాత కూడా యమునా నగర్ పరిసర జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేపట్టినట్లు దర్యాప్తులో తేలింది. పన్నుల సేకరణను సులభతరం చేయడానికి, మైనింగ్ ప్రాంతాలలో పన్ను ఎగవేతలను అరికట్టడానికి 2020లో హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ 'ఇ-రావన్' పథకంలో జరిగిన మోసాన్ని కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇదీ చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి కన్నుమూత -
అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎంకు భారీ ఊరట
ఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన జార్ఖండ్ హైకోర్టు పిల్ ఆదేశాలను సోమవారం సుప్రీం కోర్టు పక్కనపెట్టింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మైనింగ్ కుంభకోణం కేసులో సోరెన్‌పై విచారణ కోసం హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) సబబే అని సమర్థించింది జార్ఖండ్ హైకోర్టు. అయితే.. సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం మాత్రం ఇవాళ.. ఆ ఆదేశం చెల్లదని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. హేమంత్ సోరెన్ సత్యమేవ జయతే అంటూ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. सत्यमेव जयते! pic.twitter.com/38JLdRLmsq — Hemant Soren (@HemantSorenJMM) November 7, 2022 దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం అంటూ తన అభ్యర్థనలో హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2021లో మైనింగ్ లీజుల వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్.. బీజేపీ ఫిర్యాదు ద్వారా అనర్హత వేటు అంచున ఉన్నారు కూడా. మరోవైపు ఎన్నికల సంఘం సైతం.. అనర్హత వేటు వ్యవహారంలో గవర్నర్ రమేష్ అభిప్రాయం కోరింది. ఇదీ చదవండి: తప్పు చేస్తే అరెస్ట్ చెయ్యండి అంతే! -
చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్
రాంచీ: అక్రమ మైనింగ్ లీజ్ కేసులో జార్ఖండ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తూ తనకు తానే మైనింగ్ లీజులను కేటాయించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గవర్నర్ రమేష్ బియాస్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో పంపిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తుది నిర్ణయం గవర్నర్ తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం రాంచీకి చేరుకున్న గవర్నర్ రమేష్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండు రోజులు ఉండి వచ్చానని, రాజ్‌భవన్‌కు వెళ్లి ఆ లేఖ చదివే వరకు తాను ఏమీ చెప్పలేదన్నారు. గవర్నర్ నుంచి నిర్ణయం రాకుండానే ప్రభుత్వంపై బీజేపీ దాడికి దిగింది. జేఎంఎం నైతికంగా అధికారంలో కొనసాగలేదని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. సీఈసీ కానీ, గవర్నర్ దగ్గర్నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని సీఎం అన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలే మీడియాలో చూశానే తప్ప అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న డిమాండ్లను జేఎంఎం నాయకులు తిప్పికొట్టారు. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్ అన్నారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. 2019లో ప్రజాస్వామ్యబద్ధంగా తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. గనుల శాఖ వ్యవహారాలను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సోరెన్ స్టోన్ చిప్ మైనింగ్ లీజుని తన కోసం తానే కేటాయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఫిబ్రవరిలో బీజేపీ నేత రఘుబర్‌దాస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 9ఏని హేమంత్ సోరెన్ ఉల్లంఘించారని, ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవల సీఈసీ దర్యాప్తు పూర్తి చేసింది. అసలేమిటీ కేసు? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్నేళ్ల క్రితం రాంచీలో అంగారా బ్లాక్‌లో మైనింగ్ లీజ్ దక్కించుకున్నారు. ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం 2021 సెప్టెంబర్ 9న దరఖాస్తు చేసుకున్నారు. ‘స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ’ సరిగ్గా తొమ్మిది రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 18న అనుమతులు మంజూరు చేసింది. మైనింగ్, పర్యావరణం... రెండు శాఖలూ హేమంత్ పరిధిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఈ అనుమతుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా హేమంత్ తన భార్య కల్పనకు ఓ పారిశ్రామిక కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మీడియా సలహాదారు ప్రసాద్ కూడా అక్రమంగా మైనింగ్ లీజులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పొరపాటు జరిగింది’ అని అడ్వొకేట్ జనరల్ స్వయంగా అంగీకరించారు. హేమంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బియాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో హేమంత్‌కు కేటాయించిన మైనింగ్ లీజ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనర్హత వేటు వేస్తే? ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడితే అధికార సంకీర్ణ కూటమిలో అలజడి రేగే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక జేఎంఎంలో వివాదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేసులో హేమంత్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ముందంజలో నిలువనున్నారు. కానీ, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిపక్వత, పరిపాలనా అనుభవం లేవు. ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమంటూ కొందరు మంత్రులు, సీనియర్ జేఎంఎం నేతలు అప్పుడే గళం విప్పుతుండటం గమనార్హం. మరోవైపు హేమంత్ తన భార్య కల్పనను సీఎంగా చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
యరపతినేనిపై సీబీఐ గురి
సాక్షి, గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను సీఐడీ నుంచి తాజాగా సీబీఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 24న యరపతినేనిపై కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. (క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరమైన చర్యలు) ► యరపతినేని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉండగా పెద్దఎత్తున మైనింగ్ అక్రమాలకు పాల్పడటంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ► కోర్టు జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాడు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణాతోపాటు దాచేపల్లి మండలం నడికుడిలో అక్రమ మైనింగ్ జరిగినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసానుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి యరపతినేనితోపాటు 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. -
సీబీఐకి యరపతినేని అక్రమ మైనింగ్ కేసు
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మరో 15 మందిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసుల విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు రావడం తెలిసిందే. అయినప్పటికీ ఆయనపై గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో యరపతినేనిపై చర్యలు తీసుకోవాలంటూ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల, నడికుడి, అమరావతి ప్రాంతాలకు చెందిన మరో 15 మందిపై 17 కేసులు నమోదయ్యాయి. వీరిలో వేముల శ్రీనివాసరావు, తిప్పవజుల నారాయణశర్మలపై రెండేసి కేసులు, మరో 13 మందిపై ఒక్కో కేసు రిజిస్టర్ అయ్యాయి. యరపతినేనితో కలిపి 16 మందిపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల మండలం కేసనుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణా, దాచేపల్లి మండలం నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరిగినట్టు గుర్తించారు. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసనుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో జరిగిన అక్రమ మైనింగ్‌ను నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ డేమేజీ పబ్లిక్ ప్రాపర్టీ(పీడీపీపీ) యాక్ట్, మైన్స్ అండ్ మినరల్స్(ఎంఎం) యాక్ట్, ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై సీఐడీ విచారణకు గత ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసిన సీఐడీ తన నివేదికను సర్కారుకు అందజేసింది. అయితే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ కొనసాగడంతో సీబీఐ దర్యాప్తు అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్రమ మైనింగ్‌లో అనేక కీలక అంశాలకు సంబంధించి విçస్తృత స్థాయి దర్యాప్తు అవసరమని సీఐడీ సైతం హైకోర్టుకు నివేదించగా, పిల్ దాఖలు చేసిన టీజీవీ కృష్ణారెడ్డి కూడా సీబీఐ దర్యాప్తును కోరారు. ప్రభుత్వం అనుకుంటే సీబీఐ దర్యాప్తునకు చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ హైకోర్టు కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. యరపతినేని, ఆయన అనుచరులపై ►నమోదైన కేసులివీ.. ►యరపతినేని శ్రీనివాసరావు–హైకోర్టు పిల్ 170/2016, మీనిగ అంజిబాబు– 308/2018, ►తిప్పవజుల నారాయణశర్మ–309/2018, ►గ్రంధి అజయ్‌కుమార్–310/2018, ►తిప్పవజుల నారాయణశర్మ–311/2018, ►రాజేటి జాకబ్–312/2018, గుదె వెంకట ►కోటేశ్వరరావు–313/2018, ►వర్సు ప్రకాశ్–314/2018, ►వర్ల రత్నం దానయ్య–315/2018, ►నంద్యాల నాగరాజు–316/2018, ►నీరుమళ్ల శ్రీనివాసరావు–317/2018, ►ఆలపాటి నాగేశ్వరరావు–318/2018, ►వేముల శ్రీనివాసరావు–181/2018, ►వర్సు వెంకటేశ్వరరావు–182/2018, ►వేముల ఏడుకొండలు–183/2018, ►ఈర్ల వెంకటరావు–184/2018, బి. నరసింహా ►రావు–185/2018, వి. శ్రీనివాసరావు–186/2018 -
అక్రమ మైనింగ్
-
యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.యరపతినేనిపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అని, అందుకే అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేనిశ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్ టన్నుల తెల్లరాయి (లైమ్ స్టోన్)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణచేపట్టింది.ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్ కవర్లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందనిఅధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తుసంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చింది. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు బదలాయించడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేనినాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసుబదలాయించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. -
అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగింత
-
యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్షులు
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు ధర్మాసనం సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 మంది సాక్షులు యరపతినేనికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినా అతన్ని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని నిలదీసింది. లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం తరలిపోవడమంటే.. అధికారుల సహకారం లేకుండా సాధ్యమయ్యే పనే కాదని, ఆ అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాగ్ దాఖలు చేసిన కౌంటర్లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గనుల శాఖ అధికారులు సక్రమంగా పని చేయలేదని తేల్చి చెప్పిందని వివరించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 31,30,420 మెట్రిక్ టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని వివరించారు. రూ.20.16 కోట్ల సీనరేజీ ఎగవేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. -
పల్నాడు ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే మైనింగ్ దందా
సాక్షి, గుంటూరు: ఒకప్పుడు అప్పులు తప్ప ఆస్తులు లేవు.. ఆంధ్రా సీడ్స్‌కు అప్పులు ఎగ్గొట్టిన చరిత్ర అతనిది.. 2014 సంవత్సరానికి ముందు ఎన్నికల నిర్వహణ ఖర్చులు పెట్టుకోవడానికి ఇబ్బందులు పడ్డ వ్యక్తి ఆయన.. చివరకు కార్యకర్తల చందాలతో గెలుపొందాడు. అనంతరం ఐదేళ్ల టీడీపీ పాలనలో పల్నాడులో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడు. రూ.వేల కోట్ల ఖనిజ సంపదను దోచేశాడు. ఇలా దందాకు పాల్పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాపం పండింది. అక్రమ మైనింగ్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజ వనరులను దోచుకున్న యరపతినేని, ఆయన అనుచరుల అస్తులను జప్తు చేస్తారని ప్రచారం సాగుతోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్ టన్నుల తెల్లరాయి (లైమ్ స్టోన్)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్ కవర్లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గుండెల్లో రైళ్లు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు బదలాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే. గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు బదలాయిస్తున్నట్టు తెలుస్తుండటంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును అప్పగిస్తే ఆయా సంస్థలు అక్రమంగా సంపాదించిన ఆస్తులను అటాచ్ చేస్తాయని మైనింగ్ మాఫియా సభ్యులు భయపడుతున్నారు. -
ఏపీలో కదులుతున్న మైనింగ్ మాఫియా అక్రమాలు
-
మైనింగ్ కేసులో ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీ అక్రమ మైనింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రాతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీచేసింది. ఈడీ విచారణాధికారి ఎదుట జనవరి 24, 28న హాజరు కావాలని చంద్రకళ, రమేశ్ మిశ్రాలను ఆదేశించింది. మిగిలిన ఇద్దరు అధికారులకు వచ్చేవారం సమన్లు జారీచేస్తామని పేర్కొంది. 2012–16 మధ్యకాలంలో యూపీలోని హామీర్పూర్ జిల్లాలో అక్రమ మైనింగ్ జరిగినట్లు సీబీఐ కేసు నమోదుచేసింది. అప్పట్లో యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ తన వద్ద గనుల శాఖను అట్టిపెట్టుకున్నారనీ, అనుమతుల జారీలో నిబంధనలు ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నగదు చెలామణి చట్టం(పీఎంఎల్ఏ) కింద ఈడీ క్రిమినల్ కేసు నమోదుచేసింది. మైనింగ్ అనుమతుల జారీకి నిందితులు అందుకున్న అవినీతి సొమ్ము హవాలా మార్గాల ద్వారా వచ్చిందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా నిందితుల స్థిర, చరాస్తులను జప్తు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
అఖిలేష్‌కు బెహన్ బాసట
లక్నో : మైనింగ్ స్కామ్‌లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతి సోమవారం అఖిలేష్‌కు బాసటగా నిలిచారు. దాడుల పేరుతో రాజకీయ ప్రత్యర్ధులను భయపెట్టే బీజేపీ వ్యూహాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారని మాయావతి పేర్కొన్నారు. కేంద్రం వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని, కుట్రలను నీరుగార్చాలని అఖిలేష్‌తో భేటీ సందర్భంగా మాయావతి స్పష్టం చేశారని బీఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2012-13లో మైనింగ్ గనుల కేటాయింపు ప్రక్రియలో ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించిన అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదైతే దానికి అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ బాధ్యులు ఎలా అవుతారని సోమవారం ఎస్పీ, బీఎస్పీ నేతల సంయుక్త సమావేశంలో బీఎస్పీ ఎంపీ సతీష్ మిశ్రా ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి నుంచి భాగస్వామ్య పక్షాలు వైదొలుగుతుంటే వారు కొత్తగా సీబీఐతో దోస్తీకి దిగారని ఎద్దేవా చేశారు. కాగా అఖిలేష్‌పై సీబీఐని ప్రయోగించడం పట్ల మోదీ సర్కార్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న నియంత సర్కార్‌ను సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైందని మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. -
సీబీఐ విచారణకు సిద్ధం : అఖిలేష్
లక్నో : అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తల నేపథ్యంలో దర్యాప్తు ఏజెన్సీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని అయితే ప్రజలకు సమాధానం ఇచ్చేందుకు బీజేపీ సంసిద్ధం కావాలని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రత్యర్ధులను వేధించే సంస్కృతిని ప్రవేశపెట్టిందని, భవిష్యత్‌లో ఇది ఆ పార్టీకే ప్రమాదకరమని అఖిలేష్ హెచ్చరించారు. యూపీలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోందని, తమను నిలువరించే వారి చేతిలో ప్రస్తుతం సీబీఐ ఉన్నదని చెప్పుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ సీబీఐ విచారణ జరిపిస్తే తనను ప్రశ్నించారని, మరోసారి బీజేపీ తనపైకి సీబీఐని ఉసిగొల్పినా తాను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ప్రజలకు మాత్రం తగిన సమాధానం చెప్పేందుకు బీజేపీ సిద్ధం కావాలని పేర్కొన్నారు. సీబీఐ ఎందుకు దాడులు చేపడుతోందంటూ వారికేం కావాలో అది తనను అడగవచ్చన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ చేతులు కలుపుతాయని ప్రకటించిన మరుక్షణమే యూపీ మాజీ సీఎం అఖిలేష్‌పై విచారణ చేపట్టవచ్చని సీబీఐ సంకేతాలు పంపడం ప్రకంపనలు రేపుతోంది. -
అఖిలేశ్ మెడకు మైనింగ్ కేసు!
న్యూఢిల్లీ: అక్రమ మైనింగ్ కేసులో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ సీబీఐ విచారణ ఎదుర్కొనే చాన్సుంది. ఈ మేరకు నమోదైన కేసు వివరాల్ని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, ఎస్పీ ఎమ్మెల్సీ రమేశ్ కుమార్ మిశ్రా, బీఎస్పీ నాయకుడు సంజయ్ దీక్షిత్ సహా మొత్తం 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి శనివారం సీబీఐ అధికారులు.. యూపీ, ఢిల్లీలో నిందితులకు చెందిన 14 చోట్ల సోదాలు నిర్వహించారు. 2012–16 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లాలో ఇసుక, కంకర లాంటి ఖనిజాల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్నది తాజా కేసులో ప్రధాన ఆరోపణ. 2012–17 మధ్య కాలంలో నాటి సీఎం అఖిలేశ్ 2012–13లో గనుల శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అందుకే ఆయన పాత్రపై సీబీఐ దృష్టిసారించే వీలుంది. అక్రమంగా కాంట్రాక్టులిచ్చారు.. 2012–14 మధ్య కాలంలో హమీర్పూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన చంద్రకళ ఈ–టెండర్ నిబంధనల్ని ఉల్లంఘించి కాంట్రాక్టులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె అక్రమంగా కొత్త అనుమతులిచ్చారని, పాత వాటిని పునరుద్ధరించారని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు అనుమతిచ్చిన చంద్రకళ, ఇతర అధికారులు.. గుత్తేదారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన చంద్రకళ 2008లో ఐఏఎస్‌కు ఎంపికై, యూపీ కేడర్ అధికారిగా నియమితులయ్యారు. -
టీడీపీ పెద్దల అండదండలతో అక్రమ మైనింగ్
-
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీఐడీ మొక్కుబడి విచారణ
-
అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేసే కుట్ర జరుగుతోందని అధికారులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్‌లో ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి.. అక్రమ సున్నపురాయి క్వారీల కేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని వారు అంటున్నారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని వారు చెప్తున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నలుగురు తహశీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, ఐదుగురు గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. కిందిస్థాయి ఉద్యోగుల్ని బదిలీ చేసి అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వాలని భావిస్తోందని, అందుకే కిందిస్థాయిలో ఉన్న తమను టార్గెట్ చేస్తున్నారని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రాజకీయ నేతలు, వారికి సహకరించిన ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోకుండా.. తమను లక్ష్యంగా చేసుకోవడంపై వారు మండిపడుతున్నారు. -
అక్రమ మైనింగ్ కేసు: యరపతినేనిని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం
-
గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పలు కేసుల్లో తన బెయిలు మంజూరుకు విధించిన షరతులను సడలించాలని కోరుతూ సోమవారం ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అనంతపురం, బళ్లారి ప్రాంతాలకు రాకూడదని, విదేశాలకు వెళ్లకూడదని ఆయనను ఆదేశిస్తూ గతంలో బెయిల్ సమయంలో కోర్టు షరతులు విధించడం తెలిసిందే. స్వస్థలం వెళ్లేందుకు అనువుగా బెయిల్ షరతులను సడలించాలని తాజా పిటిషన్లో జనార్దన్‌రెడ్డి కోరారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్‌ను విచారించి షరతుల సడలింపు కుదరదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ప్రధాన కేసులో చార్జిషీటు దాఖలైన తర్వాత బెయిల్ షరతుల అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. -
గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ మంజూరుకు అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో ధర్మాసనం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఓఎంసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న జనార్దన్‌రెడ్డి అరెస్టయ్యారు. అప్పట్నుంచీ జైల్లోనే ఉన్నారు. మంగళవారం కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే... ‘దర్యాప్తు పూర్తయిందా? ఇంకా చార్జిషీట్లు ఏమైనా ఉన్నాయా?’ అని ధర్మాసనం సీబీఐ న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్సింగ్ను ప్రశ్నించింది. ‘అఫిడవిట్ దాఖలు చేశాం. చార్జిషీట్లు పూర్తయ్యాయి. షరతులతో కూడిన బెయిల్ మంజూరుకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ఆయన తెలిపారు. జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ..‘41 నెలలుగా జైలులోనే ఉన్నారు. సీబీఐ చెప్పినట్టు షరతులతో కూడిన బెయిల్‌కు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని పేర్కొన్నారు. దీంతో ఐదు షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు జస్టిస్ దత్తు చెప్పారు. ఒక్కో చార్జిషీటుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షల పూచీకత్తు చెల్లించాలని, పాస్‌పోర్టును సీబీఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, అనంతపురం, కడప, బళ్లారికి వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడం కానీ సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఐదు షరతులు విధించారు. ఇప్పటి వరకు 4 కేసుల్లో ఏడు చార్జిషీట్లను ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డికి అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో ఉన్నారు. బెయిల్ పత్రాలు తొలుత హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో దాఖలు పరిచిన అనంతరం పరప్పన జైలుకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు 3,4 రోజుల సమయం పడుతుందని జనార్దన్‌రెడ్డి న్యాయవాది హనుమంతరాయ బెంగళూరులో చెప్పారు. ఆయన జైలు నుంచి బయటకు విడుదలయ్యే రోజున జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. కాగా, బెయిల్ సంగతి తెలియగానే బళ్లారి, బెంగళూరులో గాలి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అరెస్ట్ నుంచి బెయిల్ దాకా.. 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌కు తరలించి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచింది. సెప్టెంబర్ 13న వీరిని కోర్టు 6 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మరోసారి కస్టడీకి అప్పగించాలన్న సీబీఐ పిటిషన్‌ను సెప్టెంబర్ 30న కొట్టివేసింది. 2011 డిసెంబర్ 3న సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. 3 సంవత్సరాల 4 నెలలకుపైగా జనార్దన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌లు రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసు తర్వాత కర్ణాటకలో మైనింగ్‌పై సీబీఐ మరో రెండు కేసులు పెట్టింది. తర్వాత బెయిల్ కోసం న్యాయమూర్తిని ప్రలోభ పెట్టారంటూ ఏపీ ఏసీబీ మరో రెండు కేసులు నమోదు చేసింది. వీటన్నింటిలో గాలికి కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. -
కర్ణాటక మంత్రి సంతోష్ లాడ్ రాజీనామా
సాక్షి, బెంగళూరు: అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సమాచార, ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ శుక్రవారం రాత్రి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజీనామా లేఖను సమర్పించారు. సంతోష్ లాడ్ భాగస్వామ్యంలోని మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందంటూ సామాజిక వేత్తలు హీరేమఠ్, అబ్రహాం ఆరోపణలు చేయడంతో పాటు సాక్ష్యాధారాలను గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్‌కు అందజేశారు. బెల్గాంలో సోమవారం నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లాడ్ అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి సూచించడంతో లాడ్ ఆ పని చేయాల్సి వచ్చింది.