చండీగర్: అక్రమ మైనింగ్ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్ ఆయన సహాయకుడు కుల్విందర్ సింగ్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి)కి చెందిన దిల్‌బాగ్ సింగ్, సోనిపట్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ ప్రాంగణాలపై జనవరి 4 నుండి ఈడీ దాడులు నిర్వహించింది.
దిల్‌బాగ్ సింగ్ ఆయన సహచరుల ఆవరణలో విదేశీ ఆయుధాలు, 300 కాట్రిడ్జ్‌లు, 100కు పైగా మద్యం సీసాలు, రూ.5 కోట్ల విలువైన నగదు, సుమారు 5 కిలోల ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. దిల్‌బాగ్ సింగ్, కుల్విందర్ సింగ్‌లను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు.
లీజు గడువు ముగిసినప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించిన తర్వాత కూడా యమునా నగర్ పరిసర జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేపట్టినట్లు దర్యాప్తులో తేలింది. పన్నుల సేకరణను సులభతరం చేయడానికి, మైనింగ్ ప్రాంతాలలో పన్ను ఎగవేతలను అరికట్టడానికి 2020లో హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ 'ఇ-రావన్' పథకంలో జరిగిన మోసాన్ని కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment