అఖిలేష్‌ యాదవ్‌కు సీబీఐ నోటీసులు | UP Ex CM Akhilesh Yadav summoned by CBI | Sakshi
Sakshi News home page

అఖిలేష్‌ యాదవ్‌కు సీబీఐ నోటీసులు

Published Wed, Feb 28 2024 3:50 PM | Last Updated on Wed, Feb 28 2024 4:06 PM

UP Ex CM Akhilesh Yadav summoned by CBI - Sakshi

లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్‌ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది.

మైనింగ్‌లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది.  ఈ క్రమంలోనే..సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది. 

మైనింగ్‌పై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్‌ చేశారనే అభియోగాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement