ఢిల్లీ : పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఓ వ్యక్తి తన పొరిగింటికి చెందిన ఓ కారుకు నిప్పంటించాడు. దహనం చేసేందుకు ఆ కారును సుమారు 600 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో రాహుల్ భాసిన్, రంజీత్ చౌహాన్‌లు నివాసం ఉంటున్నారు. అయితే వారిద్దరి మధ్య పార్కింగ్ విషయంలో నిరంతరం గొడవ జరుగుతుండేది. తాజాగా గత వారం రాహుల్‌కు రంజిత్‌కు పార్కింగ్ విషయంలో మరోసారి గొడవపడ్డారు.దీంతో కోపోద్రికుడైన రాహుల్..రంజీత్ మీద ప్రతీకారం తీసుకోవాలని అనుకున్నారు.
ఇందుకోసం రంజీత్ కారును అపహరించాడు. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ వైపు సుమారు 600 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అనంతరం, రంజిత్ కారుకు నిప్పుపెట్టాడు.
ఆ మరుసటి రోజు ఉదయం తన కారు కనిపించడం లేదంటూ రంజిత్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.చివరకు టెక్నాలజీ సాయంతో రంజిత్ కారును ఉత్తరప్రదేశ్ అమేథీ సమీపంలో దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో కారును గుర్తించారు. సీసీటీవీ పుటేజీల్లో రాహుల్, అతని స్నేహితులు కలిసి రంజిత్ కారును దగ్ధం చేసినట్లు నిర్ధారించారు.ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment