
పుట్టిన రోజుల వేడుకలను ఆనందంగా జరుపుకున్న వేళ విధి ఆ స్నేహితుల కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమీపంలో 19 ఏళ్ల ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి తన కారు గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని ఐశ్వర్యా పాండే మృతి చెందింది.
ఐశ్వర్య పాండే, తన నలుగురు స్నేహితులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. అనంతరం అద్దెకు తీసుకున్న హ్యుందాయ్ కారులో గురుగ్రామ్ నుండి తిరిగి అతివేగంతో వస్తుండగా కారు అదుపు తప్పింది. పక్కనే ఉన్న గార్డ్‌రైల్‌పైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో గార్డ్‌రైల్ గుచ్చుకోవడంతో ఐశ్వర్యాతో పాటు ఆమె స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే దేశ్ పాండే చికిత్స పొందుతూ మృతి చెందారు. మద్యమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాదమిక విచారణ తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి : మా సంస్థపై విష ప్రచారం తగదు
Comments
Please login to add a commentAdd a comment