Parking issue
-
పార్కింగ్ గొడవ: 600 కిలోమీటర్లు తీసుకెళ్లి కారుకు నిప్పెట్టాడు
ఢిల్లీ : పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఓ వ్యక్తి తన పొరిగింటికి చెందిన ఓ కారుకు నిప్పంటించాడు. దహనం చేసేందుకు ఆ కారును సుమారు 600 కిలోమీటర్లు దూరం తీసుకెళ్లడం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ ప్రాంతంలో రాహుల్ భాసిన్, రంజీత్ చౌహాన్లు నివాసం ఉంటున్నారు. అయితే వారిద్దరి మధ్య పార్కింగ్ విషయంలో నిరంతరం గొడవ జరుగుతుండేది. తాజాగా గత వారం రాహుల్‌కు రంజిత్‌కు పార్కింగ్ విషయంలో మరోసారి గొడవపడ్డారు.దీంతో కోపోద్రికుడైన రాహుల్..రంజీత్ మీద ప్రతీకారం తీసుకోవాలని అనుకున్నారు.ఇందుకోసం రంజీత్ కారును అపహరించాడు. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ వైపు సుమారు 600 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అనంతరం, రంజిత్ కారుకు నిప్పుపెట్టాడు.ఆ మరుసటి రోజు ఉదయం తన కారు కనిపించడం లేదంటూ రంజిత్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు.చివరకు టెక్నాలజీ సాయంతో రంజిత్ కారును ఉత్తరప్రదేశ్ అమేథీ సమీపంలో దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో కారును గుర్తించారు. సీసీటీవీ పుటేజీల్లో రాహుల్, అతని స్నేహితులు కలిసి రంజిత్ కారును దగ్ధం చేసినట్లు నిర్ధారించారు.ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది.సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. కాగా వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాలు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు నిత్యం వందలాది మంది తమ నివాసాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేయడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారిని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్ద నివసించే ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో విసిగిపోయిన నరోత్తమ్ అనే పెద్దాయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే తాను సీఎంతో మాట్లాడాలని చెప్పడంతో అధికారులు అనుమతించారు. దీంతో సీఎం కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘మీ కోసం వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్క పార్క్ చేస్తున్నారని.. దీంతో అతని గేట్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ కారణంగా నేను, నా కుటుంబ సభ్యులు కార్లు బయటకు తీసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. గత అయిదేళ్లనుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నమని, ఇక భరించలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. ఆయన ఇంకా తనకు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే ఉంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పనే ఇప్పటికీ సీఎం అధికారిక నివాసంలో నివసిస్తున్నారు. అయితే వచ్చే నెల ఆగస్టులో సిద్దరామయ్య కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. -
ఇదేందయ్యా పోలీస్ సార్..!
-
పార్కింగ్ విషయంలో గొడవ.. మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ
సాక్షి,సైదాబాద్: వాహనం పార్కింగ్ విషయమై జరిగిన గొడవలో ఓ మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్‌కు చెందిన ఓ మహిళ, భర్తతో కలిసి పూర్ణోదయాకాలనీ రహదారిపై టీ స్టాల్ నడుపుతున్నారు. కొంతకాలం క్రితం వీరి టీ స్టాల్‌కు దగ్గరలోనే పూసలబస్తీకి చెందిన తన్నీరు శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో టీ స్టాల్ దంపతుల కుమారుడు తన బైక్‌ను టిఫిన్ సెంటర్ ముందు నిలపగా, యజమాని కుమారుడు కింద పడేశాడు. చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి.. ఎందుకిలా చేశావని ప్రశ్నించినందుకు అతడిపై టిఫిన్ సెంటర్ యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకొనేందుకు వచ్చిన తల్లిపై కూడా దాడి చేయగా ఆమె రోడ్డుపై పడిపోయింది. అయినా వదలకుండా ఆమె చీరలాగి కొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన తన్నీరు రామారావు, రమేష్, రాజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి మహిళలతో అసభ్యకర డ్యాన్స్: ముగ్గురి అరెస్టు నాగోలు: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవంలో మద్యం తాగి, డీజే ముసుగులో మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించిన ముగ్గురు నిర్వాహకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేస్ సంస్థ 5 వార్షికోత్సవం సోమవారం రాత్రి నాగోలులోని ఓ గార్డెన్స్‌లో జరిగింది. కంపెనీ ఉద్యోగుల సమావేశం పూర్తయ్యాక మద్యం తాగి, డీజే పాటల హోరులో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్గనైజర్ పి.రవీందర్‌రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీప్‌కుమార్‌ను అరెస్టు చేసి డీజేను స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఒక్క దెబ్బతో తల్లి ప్రాణం తీశాడు
-
దారుణం: ఒక్క దెబ్బతో తల్లి ప్రాణం తీశాడు
న్యూఢిల్లీ: నవ మోసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి బిడ్డను కంటుంది తల్లి. అమ్మ అనే పిలుపు కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన కడుపులో ఊపిరి పోసుకున్న ఆ ప్రాణి కోసం జీవితాంతం కష్టపడతుంది. తనకు చేతనైనంతలో బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటుంది. పిల్లల కోసం తన జీవితాన్నే కరిగించుకునే ఆ తల్లి కోరుకునేది చివరి దశలో చిన్న పలకరింపు.. కాస్తంత ప్రేమ. కానీ ఏందుకో ఏమో.. తమ కోసం జీవితాన్నే అర్పించిన తల్లిదండ్రులను చూసుకోవాలంటే మనసు రాదు లేదు చాలా మందికి. వృద్ధులని కూడా చూడకుండా వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పట్టెడన్నం పెట్టడానికి బరువై వారిని వదిలించుకుంటున్నారు. అది కుదరకపోతే చివరకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే హత్య చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఓ ప్రబుద్ధుడు వృద్ధురాలైన తల్లిని కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై విరుచుకుపడుతున్నారు నెటిజనులు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అంటారు కానీ అది వాస్తవం కాదు.. స్వయంగా తల్లిదండ్రులను నరకంలోకి నెట్టేవాడు అంటున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో అవ్తార్ కౌర్ అనే 76 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు కోడలుతో కలిసి నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం పార్కింగ్ స్థలం గురించి కౌర్‌కు, పక్కింటి వారికి మధ్య వివాదం మొదలయ్యింది. అది కాస్త ముదరడంతో పొరుగింటి వారు పోలీసులకు కాల్ చేశారు. ఇంతలో కౌర్ కొడుకు కోడలు కిందకు వచ్చి జరుగుతున్న గొడవను చూశారు. తల్లి వల్ల అనవరంగా తాను పక్కింటి వారితో మాటలు పడాల్సి వచ్చిందని ఆగ్రహానికి గురైన కౌర్ కుమారుడు తల్లి చెంప మీద బలంగా కొట్టాడు. దాంతో కౌర్ కింద పడిపోయింది. వెంటనే ప్రాణాలు విడిచింది. ఆమె కొడలు కౌర్‌ని పైకి లేపడానికి ప్రయత్నించింది.. కానీ అప్పటికే ఆమె ప్రాణం పోయింది. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు కౌర్ కుమారుడు, పొరుగింటి వారి మీద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. దాంతో ఈ వీడియో వైరలవుతోంది. చదవండి: దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు.. -
ఏబీవీపీ జాతీయాధ్యక్షుడిపై మహిళ ఫిర్యాదు
చెన్నై: పార్కింగ్ స్థలం వివాదంలో ఏబీవీపీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం తనను వేధిస్తున్నారంటూ 62 ఏళ్ల మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్బయ్య తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తున్నారని.. వాడిన మాస్కులను, వేపాకులను తన ఇంటి ముందు పడేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, సీసీటీవీ వీడియోలను పోలీసులకు అందించారు. మహిళ బంధువు, అప్‌కమింగ్ కమెడియన్ బాలాజీ విజయరాఘవన్.. దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వివాదం గురించి మాట్లాడుతూ.. ‘షణ్ముగం మా ఆంటీ పర్మిషన్తో పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందుకు గాను 1500 రూపాయల అద్దె చెల్లించాల్సిందిగా మా ఆంటి షణ్ముగాన్ని కోరింది’ అని తెలిపాడు. (72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం) బాలాజీ మాట్లాడుతూ.. ‘దాంతో షణ్ముగం మా ఆంటీ ఇంటి ముందు మూత్ర విసర్జన చేయడం.. వాడేసిన మాస్క్‌లను ఇంటి ముందు పడేయడం చేస్తున్నాడు. అతడి చర్యలతో విసిగిపోయిన మా ఆంటీ దీని గురించి అడంబక్కం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది’ అని తెలిపారు. షణ్ముగం, ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగానే కాక కిల్పాక్ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ రాయపేట ఆసుపత్రిలో డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ హెడ్‌గా పని చేస్తున్నారు. (ప్రయాణికుల్లా వచ్చి...) ఈ అంశంపై డీఎంకే నాయకురాలు కనిమొళి ట్విటర్లో స్పందించారు. ‘మితవాద నాయకుల మీద ఫిర్యాదులు వస్తే.. పోలీసులు గుడ్డివాళ్లలాగా ప్రవర్తించడం రివాజుగా మారింది. సీఎంఓ తమిళనాడు తక్షణమే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాలి’ అని డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియో, ఫిర్యాదు అన్ని ఫేక్ అంటుంది ఏబీవీపీ. జాతీయ అధ్యక్షుడి పరువు తీయడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డది. ఫిర్యాదు చేసిన మహిళ వెనక ఎన్ఎస్యూఐ ఉందని ఆరోపించింది. -
బండెనక బండి.. పరిష్కారమేదండి..!
బెజవాడలో వాహనాల పార్కింగ్ పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.. ప్రధాన సెంటర్లలో పార్కింగ్ ఏర్పాట్లు లేకపోవడం.. షాపింగ్ కాంప్లెక్స్‌లలో వాహనాలకు సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో వాహనదారులకు రోడ్లే పార్కింగ్ స్థలాలు అవుతున్నాయి. దీంతో ఇప్పటికే నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన విజ యవాడ నగర పాలక సంస్థ మిన్నకుండిపోవడం.. ట్రాఫిక్ పోలీసులు అడపా దడపా వాహనదారులకు ఫైన్ విధించి చేతులు దులుపుకోవడం తప్ప.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తీవ్రతరం అవుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో వాహనదారులకు పార్కింగ్ ఆందోళనకర సమస్యగా మారింది. సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో బిజీగా ఉన్న రోడ్లకు ఇరువైపులా పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలోని మహాత్మాగాంధీ రోడ్, కార్ల్‌మార్క్స్ రోడ్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, టికిల్ రోడ్ సహా ప్రధాన రహదారులు ప్రతిరోజూ రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా గవర్నర్‌పేట, బీసెంట్ రోడ్, నక్కల్ రోడ్, సూర్యారావుపేట, కస్తూరీబాయ్‌పేటతోపాటు ఇతర వాణిజ్య ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. రోడ్డుకు ఇరువైపులా అనధికార పార్కింగ్ వల్ల పాదాచారులు సైతం రహదారులపై నడవలేని పరిస్థితి నెలకొంది. నిత్య నరకం.. నగరం రాజధాని ప్రాంతంలో భాగమయ్యాక జనాభా భారీగా పెరిగింది. 2011లో పది లక్షలు ఉన్న జనాభా ప్రస్తుతం 17 లక్షలకు చేకుందని అంచనా. వాహనాల సంఖ్య సైతం రెట్టింపైంది. ప్రస్తుతం విజయవాడలో మొత్తం 6,87,088 వాహనాలు ఉన్నాయి. ట్రాన్స్‌పోర్టు వాహనాలు 90,837 కాగా.. నాన్ ట్రాన్స్‌పోర్టు 5,96,251 ఉన్నాయి. అయితే రహదారులు మాత్రం ఇరుకిరుకుగానే ఉన్నాయి. ప్రధాన రహదారుల్లో ఉన్న వాణిజ్య భవనాల్లో 90 శాతం వాటికి పార్కింగ్ సౌకర్యాలు లేవు. రోడ్లే దిక్కు.. నగరంలోని అత్యధిక శాతం షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో పార్కింగ్ సదుపాయాలు లేవు. దీంతో షాపింగ్ కాంప్లెక్స్‌లకు వెళ్లే వాహనదారులు రహదారులపైనే తమ వాహనాలు పార్కు చేసి వెళ్తున్నారు. చాలా వరకు షాపింగ్ కాంప్లెక్స్‌లు సెల్లార్లను స్టాక్‌యార్డులుగా వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల వాహనాలను రహదారులపైనే పార్కింగ్ చేయాలని కోరుతుండటం గమనార్హం. మరికొన్ని చోట్ల పార్కింగ్ ఫీజులు అధిక మొత్తంలో షాపింగ్ కాంప్లెక్స్‌ల యాజమాన్యాలు వసూలు చేస్తుండటంతో వాహనదారులు రోడ్లపైనే తమ వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ అధికారులు 18 సముదాయాల్లో పార్కింగ్ ప్రదేశాల్లో నిర్మించిన కట్టడాలను తొలగించారు. 59 వాణిజ్య భవనాలకు నోటీసులు జారీ చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. అటకెక్కిన ప్రతిపాదనలు.. నగరంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు చిత్తూరి కాంప్లెక్స్, కాళేశ్వరరావు మార్కెట్, ఎన్టీఆర్ కాంప్లెక్స్‌ల్లో స్మార్ట్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డుల్లోనూ అలాంటి పార్కింగ్ కేంద్రాలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి తరువాత దానిని విస్మరించింది. అలాగే నగరంలో బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను అధికారులు అటకెక్కించడంతో అవి కలగానే మిగిలిపోయాయి. కృష్ణా జిల్లా రహదారి భద్రతా సలహా కమిటీ నగరంలో పార్కింగ్ సమస్యపై దృష్టి సారించింది. నగరంలో వాణిజ్య ప్రాంతాల్లో పార్కింగ్ సముదాయాలను నిర్మించాలని వీఎంసీ అధికారులకు సూచించింది. ఇదీ ప్రతిపాదనగానే మిగిలిపోయింది. కేసులు నమోదు చేసినా.. వీధుల్లో అనధికార పార్కింగ్‌పై చర్యలు తీసుకోవడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అనధికారికంగా పార్కింగ్ చేసిన వాహనదారులపై 16వేల కేసులు నమోదు చేశారు. అయినా నేటికీ ప్రధాన రహదారులు, జంక్షన్లలో వాహనాల పార్కింగ్ కొనసాగుతూనే ఉంది. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాం. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని బీసెంట్ రోడ్డు, వన్‌టౌన్ ప్రాంతాల్లో నిర్మించాలని నిర్ణయించాం. అయితే వన్‌టౌన్ ప్రాంతంలో వీఎంసీకి చెందిన స్థలం లేదు. ప్రైవేటు భూమి సేకరించాల్సి ఉంది. బీసెంట్ రోడ్డులో నిర్మించే భవనానికి దాదాపు రూ. 5 కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నాం. ప్రభుత్వ ఆమోదించి ప్రత్యేక నిధులు విడుదల చేస్తే వాటి నిర్మాణాలు మొదలు పెడతాం. – ప్రసన్న వెంకటేష్, కమిషనర్, వీఎంసీ -
పార్కింగ్ లేక పరేషాన్!
సోమాజిగూడ: నగరంలోని అమీర్‌పేట్ మార్కెట్ పేరు తెలియని వారుండరు. అంతటి ఖ్యాతి గాంచిన మార్కెట్‌కు పార్కింగ్ సమస్య తలెత్తింది. అందుకు కారణం మెట్రోరైల్ నిర్మాణ పనులు తోడయ్యాయని చెప్పవచ్చు. అమీర్‌పేట్ చౌరస్తానుంచి పంజగుట్ట వచ్చే మార్గంలో ఎడుమ వైపు వాణిజ్య సముదాయాలు ఎక్కువ. వాటిలో ముఖ్యంగా బట్టల దుకాణాలే అధికం. షాపుల ముంగిట ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు తమ వాహనాలను అక్కడున్న ఫుట్‌పాత్‌పై పార్కు చేసేవారు. అయితే ప్రస్తుతం ఆయా ఫుట్‌పాత్‌లకు ఎల్అండ్ టీ అధికారులు రెయిలింగ్ ఏర్పాటు చేశారు. దీంతో షాపింగ్‌కు వచ్చేవారికి వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియక సతమతం అవుతున్నారు. షాపులకు పార్కింగ్ సదుపాయం లేదు అమీర్‌పేటలోని వాణిజ్య సముదాయాలకు పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో కార్లను కిలోమీటర్ల దూరంలో పార్కు చేసి షాపింగ్‌కు రావలసి వస్తోంది. పార్కింగ్ లేమితో అమీర్‌పేట్‌లోని వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. హాకర్స్‌తో తలనొప్పి కోట్లాది రూపాయల పెట్టుబడితో షాపులు నిర్వహిస్తున్న వారికి హాకర్స్‌తో మరో తలనొప్పి వస్తోంది. వస్త్రదుకాణాల ముంగిట హాకర్స్ బండ్లపై వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారు విక్రయించే వన్నీ రెడీమేడ్ దుస్తులే. దుకాణాల ముంగిట ఉన్నది ఫుట్‌పాత్ మాత్రమే. దీన్ని ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. వేలాది రూపాయిలు అద్దెగా చెల్లిస్తూ వ్యాపారాలు సాగక నానా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రోడ్డుపైనే బస్సులు నిలిపివేత.. మెట్రోరైల్ నిర్మాణ పనుల కారణంగా ప్రధాన రహదారి కుంచించుకు పోయి ఇరుకుగా మారింది. అటుగా వెళ్లే బస్సులు ప్రధాన రహదారిపైనే నిలిపేస్తున్నారు. షాపింగ్‌కు వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కుచేయడంతో తరచూ ట్రాఫిక్ సమస్యతో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. గంటల తరబడి వాహనాలు ఎటూ వెళ్లే మార్గంలేక నానా ఇబ్బందులు తప్పడంలేదు. -
నో పార్కింగ్ 'జర్నీ'
మరో వారం రోజుల్లో సిటీలో మెట్రో రైలు కూతపెట్టనుంది. మెట్రో జర్నీకోసం కలలుగంటున్న సిటీజన్లకు.. పలు స్టేషన్ల వద్ద పార్కింగ్ సహా వసతుల లేమి స్వాగతం పలుకుతోంది. అరకొర పనులు..అసంపూర్తి నిర్మాణాలు చాలాచోట్ల దర్శనమిస్తున్నాయి. నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్ (13 కి.మీ) మార్గంలో ఈ నెల 28న ప్రధాని మోదీ చేతులమీదుగా మెట్రో రైలు ప్రారంభోత్సవం జరగనుంది. ఈనేపథ్యంలో ఆయా స్టేషన్ల వద్ద ప్రారంభానికి సన్నద్ధత ఎలా ఉంది? ప్రయాణికులకు కల్పించిన వసతులేమిటి తదితర అంశాలను రెండు కారిడార్ల పరిధిలోని 30 కి.మీ మార్గంలో ‘సాక్షి’ బృందం సోమవారం విస్తృతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ విజిట్‌లో పలుస్టేషన్ల వద్ద సమస్యలే స్వాగతం పలికాయి. మొత్తం 24 స్టేషన్లకు గాను 11 చోట్ల మాత్రమే పార్కింగ్ వసతి ఉన్నట్లు తేలింది. మిగతా 13 చోట్ల వాహనాలు నిలపడం పెద్ద సమస్యే. మెట్రో స్టేషన్ల వద్ద ఇదీ పార్కింగ్ పరిస్థితి... మార్గం: నాగోల్–అమీర్‌పేట్ 17 కి.మీ మొత్తం స్టేషన్లు: 14 పార్కింగ్ వసతి ఉన్నవి: నాగోల్, ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్స్, రసూల్‌పురా, బేగంపేట్, అమీర్‌పేట్ పార్కింగ్ వసతి లేనివి: స్టేడియం, ఎన్జీఆర్ఐ, హబ్సిగూడ, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ వైఎంసీఏ, ప్యారడైజ్, ప్రకాశ్‌నగర్ మార్గం:మియాపూర్–ఎస్.ఆర్.నగర్ 13 కి.మీ మొత్తం స్టేషన్లు:10 పార్కింగ్ వసతి ఉన్నవి: మియాపూర్ టర్మినల్ స్టేషన్, బాలానగర్, కూకట్పల్లి, భరత్‌నగర్ పార్కింగ్ వసతి లేనివి: జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, మూసాపేట్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్.ఆర్.నగర్ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కలల మెట్రో కళ్ల ముందుకొస్తుంటే... స్టేషన్లలో వసతుల లేమి ప్రయాణికులకు నిరాశే మిగిల్చనుంది. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సమస్య ప్రధానంగా మారింది. కొన్ని చోట్ల ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ స్థలమున్నా... బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు మాత్రం తగిన ఏర్పాట్లు లేవు. ఇక ముహూర్తం ముంచుకొస్తున్నా చాలా స్టేషన్లలో పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో ఫుట్‌పాత్‌లు నిర్మించనే లేదు. సుందరీకరణ పనులూ అంతంత మాత్రంగానే జరిగాయి. వ్యర్థాలు పేరుకుపోయి స్టేషన్లు డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. నవంబర్ 28న మెట్రో రైలు ప్రారంభం నేపథ్యంలో నాగోల్–అమీర్‌పేట్ (17 కి.మీ), మియాపూర్–అమీర్‌పేట్(13 కి.మీ) మార్గంలోని 24 స్టేషన్లలో ‘సాక్షి’ సోమవారం విజిట్ నిర్వహించగా.. ఈ అసౌకర్యాలు కళ్లకు కట్టాయి. అమీర్‌పేట్ స్టేషన్ ⇒ ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్‌గా ఉన్న అమీర్‌పేటలో పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ⇒ ఫుట్‌పాత్ పనులు ఇంకా చేపట్టలేదు. ⇒ సుందరీకరణ పనుల ఊసే లేదు. ⇒ స్టేషన్ కింది భాగంలో వ్యర్థాలు పేరుకుపోయి డంపింగ్‌యార్డులా మారింది. ⇒ మెట్రో కింది భాగంలో లైటింగ్ వ్యవస్థ పూర్తి చేయాల్సి ఉంది. ⇒ ప్రయాణికుల వాహనాల నిలుపుదలకు సారథి స్టూడియో సమీపంలో పార్కింగ్ కేటాయించారు. కానీ లింక్ బస్సులు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ లేదు. ⇒ అమీర్‌పేట్ రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రహదారిపైకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మియాపూర్ స్టేషన్ ♦ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయలేదు. ♦ కొన్ని ప్రాంతాల్లో టైల్స్ వేసినా... ఎక్కువ భాగం ఇంకా చదును చేయాల్సి ఉంది. ♦ పచ్చదనం పనులు కొంతమేర మాత్రమే చేపట్టారు. ♦ హెలీ ప్యాడ్, పైలాన్ నిర్మాణం కొనసాగుతోంది. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఎస్కలేటర్ ఏర్పాటు చేశారు. బాలానగర్ ♦ స్టేషన్‌కు సమీపంలో ఎక్కడా పార్కింగ్ సౌకర్యం లేదు. రైలు ఎక్కేందుకు ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ప్రయాణికులు స్టేషన్ సమీపంలోకి వస్తే ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ♦ సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్ వరకు వచ్చేందుకు మినీ బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. ♦ స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ ♦ పార్కింగ్ పనులు ఇప్పుడే ప్రారంభించారు. ♦ పచ్చదనం ఏర్పాటు చేసేందుకు స్థలం కూడా లేదు. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఏర్పాటు చేశారు. ఎర్రగడ్డ ♦ ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ వసతి లేదు. ♦ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు లేవు. ♦ ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయలేదు. ♦ ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు వస్తే ట్రాఫిక్ తప్పదు. ఈఎస్ఐ ♦ ఈ స్టేషన్లోనూ పార్కింగ్‌కు అవకాశం లేదు. ♦ స్టేషన్ నిర్మాణం కారణంగా ప్రధాన రహదారి రెండు వైపులా 30 ఫీట్లకు తగ్గిపోవడంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు చిక్కులు తప్పవు. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఫుట్‌పాత్‌లు నిర్మించారు. ♦ స్టేషన్‌కు ఒకేసారి అధిక సంఖ్యలో జనం తరలివస్తే ట్రాఫిక్ తప్పదు. మూసాపేట్ ♦ బైక్‌లు, కార్లకు పార్కింగ్ లేదు. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. వీటిని ఎక్కడ నిలపాలనే దానిపై ఇంకా ఓ క్లారిటీ లేనట్టు తెలుస్తోంది. ♦ టైల్స్ నిర్మాణం కొనసాగుతోంది. అనుకున్నంత స్థాయిలో హరితం లేదు. ♦ పారిశుధ్య లోపం కనిపిస్తోంది. ♦ ఫుట్‌పాత్‌లు ఇంకా ఏర్పాటు చేయలేదు. కేపీహెచ్‌బీ ♦ ఈ మెట్రో స్టేషన్‌కు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటే. ఇక్కడ స్టేషన్ లోపల అన్ని వసతులు ఏర్పాటు చేశారు కానీ పార్కింగ్‌పై అధికారులు దృష్టి సారించలేదు. ♦ ట్యాక్సీలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చే ప్రయాణికులు స్టేషన్ సమీపంలో దిగడానికి వస్తే ట్రాఫిక్ జామయ్యే అవకాశం ఉంది. ♦ సమీప కాలనీల నుంచి మెట్రో స్టేషన్ వరకు వచ్చేందుకు మినీ బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. ♦ స్టేషన్ సమీపంలో ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. ఎస్ఆర్ నగర్ ♦ పార్కింగ్ స్థలం లేదు. ♦ ప్రధాన రహదారి కుంచించుకుపోవడంతో ఈ మార్గంలో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు వీలుగా ప్రత్యేక మార్గాలు లేవు. ♦ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. ♦ ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ దిగి ప్రధాన రహదారిపైకి తరలివస్తే ట్రాఫిక్ చిక్కులు తప్పవు. కూకట్పల్లి ♦ ఈ స్టేషన్‌కు పార్కింగ్ వసతి లేదు. ఇదే ఇక్కడ పెద్ద సమస్య. బయట నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి ఉంది. ♦ ఈ స్టేషన్ సమీపంలో బస్స్టేషన్లు ఉండడం కొంత అనుకూలం. బస్సుల్లో వచ్చి ఇక్కడి నుంచి మెట్రో రైలులో ప్రయాణించవచ్చు. ♦ సమీప కాలనీలకు కనెక్టివిటీ వాహనాలు నడపాల్సిన అవసరం ఉంది. లేకుంటే ప్రైవేట్ క్యాబ్‌లు, ఆటోలు ఆశ్రయించాల్సి వస్తుంది. భరత్‌నగర్ ♦ ప్రయాణికుల వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేదు. ♦ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు నిలిపేందుకు తగినంత స్థలం లేదు. ♦ ఫుట్‌పాత్‌లు, పచ్చదనం కానరాలేదు. ♦ ఎక్కడి టైల్స్ అక్కడే పడేసి ఉన్నాయి. ♦ ప్రయాణికులు చాలా జాగ్రత్తగా బయటకు వెళ్లాలి. పక్కన మూసీ నది నాలా ఉంది. చిన్నపాటి రక్షణ ఏర్పాట్లు చేసి వదిలేశారు. బేగంపేట్ ♦ స్టేషన్‌కు ఒకవైపే మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. రెండు రైళ్లు ఒకేసారి వస్తే.. ప్రయాణికులందరూ ఒకే మార్గం గుండా రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్రిడ్జి కింది నుంచే వాహనాలతో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ♦ ఇక ఫుట్‌పాత్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ♦ ప్రయాణికుల వాహనాలకు సరిపడా పార్కింగ్ స్థలం లేదు. ♦ స్టేషన్ కింది భాగం వ్యర్థాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. ♦ లైఫ్‌స్టైల్ బిల్డింగ్ వైపున్న లిఫ్ట్ ఎదుట కేబుళ్లు వదిలేశారు. ప్రకాష్‌నగర్ ♦ పేరుకే ప్రకాష్‌నగర్ మెట్రో స్టేషన్. ఇది ఆ ప్రాంతానికి సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంది. ♦ పార్కింగ్ స్థలం లేనే లేదు. పార్కింగ్ కోసం రసూల్‌పురా చౌరస్తాలో కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. ♦ ఫుట్‌పాత్ పనులు కొనసాగుతున్నాయి. ♦ నిర్మాణ వ్యర్థాలు, చెత్తా చెదారం షరామామూలే. ♦ బేగంపేట్ రహదారి మధ్యలో మెట్ల మార్గం ఉండడంతో ప్రయాణికులు ఒకేసారి రోడ్డు మీదకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మెట్టుగూడ ♦ స్టేషన్‌కు ఓ వైపు రైల్వే క్వార్టర్లు, మరోవైపు ప్రైవేట్ భవనాలు, అపార్టుమెంట్లు ఉన్నాయి. దీంతో పార్కింగ్ స్థలం లేకుండా పోయింది. ♦ ఫుట్‌పాత్ పనులు జరుగుతున్నాయి. ♦ ట్రాఫిక్‌జామ్‌తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. హబ్సిగూడ ♦ ప్రత్యేకంగా పార్కింగ్ లేదు. అయితే బస్టాప్ నుంచి మరికొంత దూరం వరకు వాహనాలు నిలుపుకోవచ్చు. ♦ స్టేషన్‌కు రెండు వైపులా బస్టాపులు ఉన్నాయి. ♦ సారథి స్టూడియోను ఆనుకొని విశాలమైన బస్బే ఉంది. ♦ సుప్రభాత్ హోటల్ దగ్గర ఇంకా ఫుట్‌పాత్ పనులు జరుగుతున్నాయి. రసూల్‌పురా ♦ పార్కింగ్ స్థలం కేటాయించినప్పటికీ అందులో చెత్తాచెదారం పేరుకుపోయింది. చదును చేయాల్సి ఉంది. ♦ ఫుట్‌పాత్‌ల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. ♦ అందమైన పూల మొక్కలు తెచ్చారు. కానీ నాటలేదు. ♦ నిర్మాణ వ్యర్థాలు ఎక్కడికక్కడే గుట్టులుగా ఉన్నాయి. ప్యారడైజ్ ♦ స్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో పార్కింగ్ స్థలం ఉంది. ♦ ఫుట్‌పాత్ పనులు 20 శాతమే పూర్తయ్యాయి. ♦ హరితం ఊసే లేదు. ♦ చాలా పనులు చేయాల్సి ఉంది. పరేడ్‌గ్రౌండ్ ♦ ఈ స్టేషన్లో ప్రయాణికులకు అనువైన వసతులున్నాయి. ♦ జీహెచ్ఎంసీ కార్యాలయ భవనం, రక్షణశాఖ స్థలం, మరోవైపు పెట్రోలుబంక్ స్థలాన్ని మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ♦ అయితే విశాలమైన పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైనంత స్థలం ఉన్నప్పటికీ... ఆ దిశగా పనులు నేటికీ ప్రారంభం కాలేదు. సికింద్రాబాద్ ఈస్ట్ ♦ చాలా ఇరుకైన ప్రదేశంలో ఈ స్టేషన్ ఉంది. ♦ ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు. ♦ క్యాబ్‌లు, కార్లలో వచ్చి ప్రయాణికులు చాలా దూరంలో దిగి రావాల్సిందే. ♦ మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్న గోపాలపురం పోలీస్ స్టేషన్ భవనం స్థలాన్ని పార్కింగ్‌కి కేటాయిస్తారని ప్రచారం జరిగినా... నేటికీ ఆ దిశగా పనులు జరుగలేదు. సదరు స్థలాన్ని చదును చేసి ప్రస్తుతం స్క్రాప్ వస్తువుల కేంద్రంగా వాడుతున్నారు. తార్నాక ♦ ప్రయాణికులు తమ వాహనాలు పార్క్ చేసేందుకు స్థలం లేదు. ♦ స్టేషన్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గం చాలా ఇరుగ్గా ఉంది. మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ఉంది. ♦ వాహనాలను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లు, డీసీఎంలు వందలాదిగా వస్తాయి. ♦ దీంతో ప్రయాణికులు ఎటువైపు వెళ్లాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ♦ ట్రాఫిక్ రద్దీకి అవకాశం ఉంది. ఫుట్‌పాత్ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఎన్జీఆర్ఐ ♦ ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. ♦ పెద్ద వాహనాలు నిలిపేందుకు అవకాశం లేదు. ♦ స్టేషన్‌కు రెండు వైపులా ఫుట్‌పాత్‌లు లేవు. ♦ వర్షాకాలం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీళ్లు నిలుస్తాయి. స్టేడియం ♦ ఈ స్టేషన్‌కు రెండు వైపులా రోడ్డు ఇరుకుగా ఉంది. ♦ ప్రయాణికుల రాకపోకలకు ఫుట్‌పాత్‌లు ఉన్నప్పటికీ, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్టేషన్ దిగి వెళ్లేటప్పుడు వాహనాల రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ♦ హబ్సిగూడ వైపు వెళ్లే మార్గంలో ఫుట్‌పాత్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ♦ స్టేడియానికి ఇరువైపులా మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ♦ రోడ్ల తవ్వకాల కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. అటు వైపు ప్రయాణికులు ఎక్కడం, దిగడం చాలా కష్టం. ♦ పైపులైన్ పనులతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఉప్పల్ ♦ ఇక్కడ ద్విచక్ర వాహనాలకు మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంది. ♦ కార్లు, బస్సులు, ఆటోలు తదితర పెద్ద వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు లేవు. ♦ రెండువైపులా బస్టాపులు ఉన్నాయి. ప్రయాణికులు నేరుగా బస్టాపులకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ♦ ఫుట్‌పాత్‌లు, గ్రీనరీ ఏర్పాటు చేశారు. నాగోల్ ♦ వాహనాలకు పార్కింగ్ సదుపాయం లేదు. ♦ స్టేషన్‌కు ఎదురుగా రెండకరాల్లో డంపింగ్ యార్డ్ ఉంది. దుర్గంధంతో ప్రయాణికులు ముక్కు మూసుకోవాల్సిందే. ♦ స్టేషన్‌కు సమీపంలోనే ఆర్టీఏ కార్యాలయం ఉంది. ప్రతిరోజు వందలాది వాహనాలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ♦ జనం ఒకేసారి రోడ్డు మీదకు వస్తే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోవాల్సిందే. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువ. అదే పెద్ద సమస్య.. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే మెట్రోకు పార్కింగ్ సదుపాయం లేకపోవడం శోచనీయం. మెట్రో ప్రయాణానికి ఇదే పెద్ద సమస్యగా మారింది. అలాగే చార్జీలపై స్పష్టత లేదు. అందరికీ అందుబాటులో చార్జీలుండాలి. – ఎస్.అనిల్‌రెడ్డి, ఉప్పల్ పార్కింగ్ ఏదీ? మెట్రో రైలులో ప్రయాణించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. అయితే కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలోని మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో మాకు ఇబ్బందలు తప్పేలా లేవు. – స్వామి, కూకట్పల్లి ఇప్పటికైనా..? కూకట్పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ పార్కింగ్ సదుపాయం కల్పించకపోవడం దారుణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్ ఏర్పాటు చేయాలి. – నరసింహ, కేపీహెచ్‌బీ పనుల్లో జాప్యం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముహూర్తం ఖరారైన పనులు ఇంకా పూర్తి కాలేదు. పార్కింగ్, షాపింగ్ మాల్ల పనులు ఎప్పడో చేయాల్సి ఉంది. ఇక సౌకర్యాలు ఎలా ఉంటాయో చూడాలి. పార్కింగ్ ఫీజు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించాలి. – కిరణ్, గచ్చిబౌలి -
పరేషాన్ నం.1 బిందాస్ పార్కింగ్!
అపార్ట్‌మెంట్‌వాసుల పల్స్ ‘రేటింగ్’.. అక్రమ పార్కింగ్‌లతో తల పట్టుకుంటున్న నగర జీవి - అత్యధిక అపార్ట్‌మెంట్‌వాసుల ఇబ్బంది ఇదే.. - తర్వాతి స్థానంలో మందుబాబుల ఆగడాలు, ట్రాఫిక్ - వెయ్యి అపార్ట్మెంట్లలో అధ్యయనం చేసిన పోలీసు శాఖ పోలీసుల దృష్టికి వచ్చిన అపార్ట్‌మెంట్‌వాసుల సమస్యలివీ.. సందర్శించిన అపార్ట్మెంట్లు 1,000 వివిధ రకాల ఇబ్బందులు ఉన్నాయన్న సంఘాలు 630 అక్రమ పార్కింగ్ సమస్యగా ఉందన్న అపార్ట్మెంట్ సంఘాలు 169 మందుబాబుల ఆగడాలు 115 ట్రాఫిక్ ఇబ్బందులు 65 బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం 63 సాక్షి, హైదరాబాద్: మహానగరం.. కోటి జనాభా.. వారిలో మెజారిటీ మధ్యతరగతి ప్రజలు ఉంటోంది అపార్ట్మెంట్లలోనే.. మరి అందులో నివసిస్తున్న వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటో తెలుసా? అక్రమ పార్కింగ్! అపార్ట్మెంట్ భవనాల ముందు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలు నగరజీవికి తలనొప్పిగా మారాయి. అపార్ట్మెంట్లలో నివసిస్తున్నవారి ఇబ్బందులపై పోలీసు శాఖ తాజాగా ఓ అధ్యయనం చేసింది. సుమారు వెయ్యి అపార్ట్మెంట్లకు వెళ్లి అక్కడి అసోసియేషన్లను, జనాన్ని కలిశారు. వారికి ఎదురవుతున్న, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లలేని ఇబ్బందులు ఏమున్నాయని ఆరా తీశారు. మొత్తం 32 అంశాలను ఎంపిక చేసుకుని ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అక్రమ పార్కింగ్ అని తేలింది. ఆ తర్వాత స్థానంలో ‘మందుబాబులు’నిలిచారు. తప్పతాగి వారు చేస్తున్న గోలతో ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు. గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మద్యం షాపులు ‘ఓపెన్ బార్’లా మారడం, వాటి ముందు మందుబాబుల ఆగడాలతో జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, జీహెచ్ఎంసీ సంబంధిత సమస్యలు, శబ్ద కాలుష్యం తదితరాలు నిలిచాయి. పరిష్కారానికి కమ్యూనిటీ పోలీసింగ్.. నగరంలో మొత్తం 60 ఠాణాలుండగా.. 370 రక్షక్, బ్లూకోల్ట్స్ వాహనాలున్నాయి. రెండున్నరేళ్ల నుంచి సిటీలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానం అమలవుతోంది. ఈ బాధ్యతల్ని క్షేత్రస్థాయిలో గస్తీ విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ వాహనాలతోపాటు బ్లూకోల్డ్స్ సిబ్బందికి అప్పగించారు. వీరు నిత్యం తమ పరిధుల్లోని ప్రాంతాల్లో తిరుగుతూ కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాలు, వర్తక/వాణిజ్య సంఘాలు, ఇతర కమ్యూనిటీలను కలిసేవారు. పోలీసు విభాగం చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటు నేరాల నిరోధానికి సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేసేవారు. అయితే, ఇది పూర్తిస్థాయి కమ్యూనిటీ పోలీసింగ్ కాదని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి భావించారు. ఫలితాలతో కూడిన కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కేంద్రంగా సపోర్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలు, పోలీసుల వద్దకు వచ్చి జనం చెప్పుకోలేని ఇబ్బందులను క్షేత్రస్థాయిలోని పోలీసు సిబ్బంది గుర్తిస్తారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతల్ని సపోర్ట్ సెంటర్ ద్వారా అధికారులకు అప్పగిస్తారు. ఒకవేళ సమస్య పరిష్కారం పోలీసుల పరిధిలో లేకుంటే దాన్ని సంబంధిత విభాగం దృష్టికి తీసుకువెళ్తారు. గత వారమే ఈ వినూత్న విధానాన్ని ప్రారంభించారు. నగరవాసుల ఇబ్బందులపై పోలీసులు ప్రయోగాత్మకంగా అపార్ట్మెంట్ల వద్ద అధ్యయనం చేశారు. -
‘బృందావన్’పై కలెక్టర్‌కు ఫిర్యాదు
హన్మకొండ అర్బన్ : హన్మకొండ వడ్డేపల్లి సమీపంలో 270 ఫ్లాట్లతో నిర్మించిన బృందావన్ అపార్ట్మెంట్ కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆరోపించారు. రోడ్డును ఆక్రమించి అపార్ట్మెంట్ నిర్మించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఏర్పాటుచేయడంతో సమస్యలు ఎదురవుతునాయని పేర్కొన్నారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వడ్డేపల్లి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కరుణకు వినతిపత్రం అందజేశారు. అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఈ విషయంలో విచారణ జరిపి వడ్డేపల్లి ప్రజలు, వాహన దారులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. అలాగే, ఇప్పటి వరకు ఆ ప్రదేశంలో జరిగిన ప్రమాదాలను వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కమిటీ ప్రతనిధులు జితేందర్‌రెడ్డి, బిక్షపతి, శ్రావణ్‌కుమార్, హరికృష్ణ తదితరులు ఉన్నారు. -
బొబ్బిలి టీడీపీలో ఆధిపత్యపోరు !
► తమ్ముళ్ల ఆదేశాలతో అధికారుల బెంబేలు ► ఎవరికి వారే తామే ముఖ్యమంటూ హెచ్చరికలు ► పార్కింగ్తో మొదలైన పోరుతో ఉద్రిక్తత బొబ్బిలి : ఒకరు సర్పంచ్... మరొకరు ఎంపీపీ కుమారుడు. ఒకరు ఉప్పు... మరొకరు నిప్పు. ఎవరికి వారే తామే ముఖ్యమంటూ ఆదేశాలు. ఒక పార్కింగ్ వివాదం చినికి చినికి గాలివానగా మారి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాప్రతినిధిగా తనకే హక్కుందని సర్పంచ్ అంటే... అభివద్ధిపై సమీక్షించే హక్కు తనకుందంటూ ఎంపీపీ కుమారుడి వితండ వాదన. వీరి మధ్య నలిగిపోతున్న దిగువస్థాయి అధికారులు. ఇదీ బొబ్బిలిలో గురువారం చోటు చేసుకున్న సంఘటన. సిబ్బంది బెంబేలు ‘ఎవడిని అడిగి బండి అడ్డంగా పెట్టాడు.. తీస్తాడా..? తియ్యడా...? అని ఒకరంటే పోర్టికోలో కారు పెట్టిందెవడు..? వాడేమైనా ప్రజాప్రతినిధా...? బండి తియ్యను...రేపు ట్రాక్టర్ అడ్డుపెడతాను ఏంచేస్తాడో చేసుకోమను..అని ఒకరు. ఉపాధి సిబ్బందితో ఎంపీపీ కుమారుడు సమావేశం ఏర్పాటుచేస్తే... కోన్‌కిస్కా గాడు సమావేశం పెడితే మీరెందుకు హాజరయ్యారు...? అని మరో తెలుగు తమ్ముడు ఇలా గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని అధికారులు సిబ్బంది భయపడిపోయారు. వివరాలిలా ఉన్నాయి... టీడీపీ నాయకుడు అల్లాడ భాస్కరరావు, ఇటీవల టీడీపీలో చేరిన రాజుల గ్రూపునకు చెందిన ఎంపీపీ కుమారుడు శ్రీనివాసరావు వర్గం పరోక్షపోరుకు ఎంపీడీఓ కార్యాలయం గురువారం వేదికయ్యింది. పారాది సర్పంచ్ అల్లాడ భాస్కరరావు గురువారం ఉదయం ఎంపీడీఓ కార్యాలయానికి ద్విచక్రవాహనంపై వచ్చి పోర్టికోలో నిలిపారు. కాసేపటికి ఎంపీపీ గోర్జ వెంకటమ్మ కుమారుడు శ్రీనివాసరావు తనకారుతో ఎంపీడీఓ కార్యాలయం పోర్టికోకు వచ్చి... ద్విచక్రవాహనం అడ్డంగా ఉంది ఎవడు పెట్టాడు...?కారు ఎలా ఉంచాలి..? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే సూపరింటెండెంట్ త్రినాథను పిలిచి ద్విచక్రవాహనం తీయమని చెప్పాలని ఆదేశించారు. ఎంపీడీఓ గదిలో ఉన్న భాస్కరరావుకు ఆ విషయం త్రినాథ తెలపగా ఎవడు తీయమంది..? పోర్టికోలో కారు ఎవడైనా పెడతాడా...? వాడేమైనా ప్రజాప్రతినిధా..? తీయను రేపు ట్రాక్టర్ అడ్డుపెడతాను ఏం చేస్తాడో చేసుకోమను అని తిరిగి సమాధానమిచ్చారు. మరో సీన్లో... ఎంపీపీ గదిలో శ్రీనివాసరావు ఉపాధి ఏపీఓ సుశీల, ఈసీ సంపతి, టీఏలతో శుక్రవారం జరగాల్సిన వనం మనంపై సమావేశం నిర్వహించారు. ఏపీడీ సాయిబాబా వచ్చి ఆ గదిలోనే శ్రీనివాసరావు సమక్షంలోనే సమావేశం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భాస్కరరావు ఉపాధి సిబ్బందికి ఫోన్‌చేసి అనధికార వ్యక్తి సమావేశంపెడితే ఎలా వెళ్లారు..? మీరు రండి మాట్లాడాలి అని పిలిచారు. సుమారు రెండున్నర గంటల సమావేశం అనంతరం ఉపాధి సిబ్బంది శ్రీనివాసరావు వద్దనుండి భాస్కరరావు వద్దకు వెళ్లారు. ఇక ఆగ్రహంతో ఆయన అనధికార వ్యక్తి సమావేశానికి పిలిస్తే మీరెందుకు వెళ్లారు..? అంటూ నిలదీశారు. ఎంపీపీ పిలిస్తే వెళ్లండి..అధికారులు పిలిస్తే వెళ్లండి. మీకేమైనా సమావేశం అని నోట్ ఆర్డర్ వచ్చిందా...? మీ ఉన్నతాధికారులు వెళ్లమన్నారా...? ఏపీడీ అక్కడకు సమావేశానికి వెళ్లడమేమిటని మండిపడ్డారు. ఏపీఓ సుశీల వెళ్తే ఒక సమస్య... వెళ్లకపోతే మరో సమస్యనీ... తాము నలిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువర్గాల అనుచరుల మోహరింపు... ఈ దశలో అక్కడ పరిస్థితి చేయిదాటుతోందని తెలుసుకున్న భాస్కరరావు వర్గానికి చెందిన టీడీపీ నాయకులు చింతల భాస్కరరావు, చొక్కాపు నారాయణరావు, కునుకు సత్యనారాయణ, రెడ్డిమోహనరావు, మీసాలశ్రీనివాసరావు, గోర్జశ్రీనివాసరావుకు చెందిన చింతాడ జయప్రదీప్, గొర్లె ఈశ్వర ప్రసాద్, బంకురు బాబూరావు తదితర రెండు వర్గాల అనుచరులు అక్కడ మోహరించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కలిగింది. ఎంపీడీఓ చంద్రమ్మ మాత్రం కార్యాలయానికి రాలేదు. చివరకు రెండు వర్గాల వారు ఎవరిమట్టుకు వాళ్లు వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫిర్యాదు చేస్తా... అనధికారికంగా సమావేశాలు నిర్వహిస్తే సహించం. దీనిపై ఉన్నతాధికారులకు, పార్టీ నాయకులకు ఫిర్యాదు చేస్తానని దీనిపై అమీతుమీ తేల్చుకుంటానని తెగేసి చెప్పారు. మొత్తమ్మీద పాత టీడీపీ నాయకులకు, తాజాగా వెళ్లిన వారికి మధ్య సయోధ్య కుదరలేదనీ... ఉప్పునిప్పులా కాలుదువ్వుతున్నారని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. -
పోలీసులతో బాలయ్య వాగ్వాదం
-
పోలీసులతో బాలయ్య వాగ్వాదం
హైదరాబాద్ : మహానాడు ప్రాంగణంలో హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తడాఖా చూపించారు. గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడు ప్రాగణం వద్ద కారు పార్కింగ్ విషయంలో బాలకృష్ణ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వీఐపీ పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేసి మహానాడు ప్రాంగణానికి వెళ్లాలని పోలీసులు సూచించారు. మహానాడుకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బాలయ్యను కారు వీఐపీలకు కేటాయించిన ప్రాంతంలోనే పార్క్ చేయాలని స్పష్టం చేశారు. అయితే పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా బాలకృష్ణ...మహానాడు వేదిక మెయిన్ గేట్ వరకూ కారులోనే వెళ్లారు. తాను హిందుపురం ఎమ్మెల్యేనని, తననే ఆపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళ నటిపై కేసు
తమిళసినిమా:నటి మాయపై విరుగంబీఆక్కం పోలీ సుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. వివరాలు.. మాయ స్థానిక సాలిగ్రామం, అరుణాచలం రోడ్డులోని ఓ ఫ్లాట్‌లో నివశిస్తున్నారు. పక్క పోర్షన్లో ఉంటున్న మనోహరికి, మాయకు పార్కింగ్ విషయంలో తరచూ గొడవ జరిగేది. తాజాగా మంగళవారం కూడా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇది శృతిమించి కొట్టుకునే వరకు వెళ్లింది. దీంతో మనోహరి స్థానిక పోలీసుస్టేషన్లో మాయపై ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.