పోలీసులతో బాలయ్య వాగ్వాదం | Balakrishna loses his temper for mahanadu over car parking issue | Sakshi
Sakshi News home page

పోలీసులతో బాలయ్య వాగ్వాదం

Published Wed, May 27 2015 1:29 PM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM

పోలీసులతో బాలయ్య వాగ్వాదం - Sakshi

పోలీసులతో బాలయ్య వాగ్వాదం

హైదరాబాద్ : మహానాడు ప్రాంగణంలో హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తడాఖా చూపించారు. గండిపేటలో జరుగుతున్న టీడీపీ మహానాడు ప్రాగణం వద్ద కారు పార్కింగ్ విషయంలో బాలకృష్ణ  పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. వీఐపీ పార్కింగ్ స్థలంలో కారును పార్క్ చేసి మహానాడు ప్రాంగణానికి వెళ్లాలని పోలీసులు సూచించారు.  

మహానాడుకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బాలయ్యను కారు వీఐపీలకు కేటాయించిన ప్రాంతంలోనే పార్క్ చేయాలని స్పష్టం చేశారు. అయితే పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా బాలకృష్ణ...మహానాడు వేదిక మెయిన్ గేట్ వరకూ కారులోనే వెళ్లారు. తాను హిందుపురం ఎమ్మెల్యేనని, తననే ఆపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement