సాక్షి,సైదాబాద్: వాహనం పార్కింగ్ విషయమై జరిగిన గొడవలో ఓ మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్‌కు చెందిన ఓ మహిళ, భర్తతో కలిసి పూర్ణోదయాకాలనీ రహదారిపై టీ స్టాల్ నడుపుతున్నారు. కొంతకాలం క్రితం వీరి టీ స్టాల్‌కు దగ్గరలోనే పూసలబస్తీకి చెందిన తన్నీరు శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో టీ స్టాల్ దంపతుల కుమారుడు తన బైక్‌ను టిఫిన్ సెంటర్ ముందు నిలపగా, యజమాని కుమారుడు కింద పడేశాడు.
చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి..
ఎందుకిలా చేశావని ప్రశ్నించినందుకు అతడిపై టిఫిన్ సెంటర్ యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకొనేందుకు వచ్చిన తల్లిపై కూడా దాడి చేయగా ఆమె రోడ్డుపై పడిపోయింది. అయినా వదలకుండా ఆమె చీరలాగి కొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన తన్నీరు రామారావు, రమేష్, రాజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి
మహిళలతో అసభ్యకర డ్యాన్స్: ముగ్గురి అరెస్టు
నాగోలు: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవంలో మద్యం తాగి, డీజే ముసుగులో మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించిన ముగ్గురు నిర్వాహకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేస్ సంస్థ 5 వార్షికోత్సవం సోమవారం రాత్రి నాగోలులోని ఓ గార్డెన్స్‌లో జరిగింది.
కంపెనీ ఉద్యోగుల సమావేశం పూర్తయ్యాక మద్యం తాగి, డీజే పాటల హోరులో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్గనైజర్ పి.రవీందర్‌రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీప్‌కుమార్‌ను అరెస్టు చేసి డీజేను స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment