ఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఆ తేదీని నవంబర్ 20కి మారుస్తూ ఈసీ తాజాగా నిర్ణయం తీసుకుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
By-polls in Assembly Constituencies in Kerala, Punjab and Uttar Pradesh rescheduled from November 13 to November 20 due to various festivities pic.twitter.com/P2eaNMDhzb
— ANI (@ANI) November 4, 2024
శ్రీ గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ (నవంబర్ 15), కల్పతి రాస్తోల్‌సవం (నవంబర్ 13-15), కార్తీక పూర్ణిమ (నవంబర్ 15), ప్రకాష్ పర్వ్ వంటి పండుగలను నేపథ్యంలో రాజకీయ పార్టీలు విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘంగా ఉప ఎన్నికల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, పంజాబ్‌లో నాలుగు, కేరళలో ఒకటి అసెంబ్లీ స్థానాలుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరగనుంది. మరోవైపు.. కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్‌లో తేదీలో ఎటువంటి మార్పు లేదని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment