
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. ఛత్తీస్‌గఢ్, కేరళ, త్రిపుర, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న నాలుగురాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించనున్నారు. దంతెవాడ (ఛత్తీస్‌గఢ్), పాల (కేరళ), బాదర్‌ఘాట్ (త్రిపుర), హమీర్‌పూర్ (ఉత్తరప్రదేశ్) అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే తెలంగాణలోని హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడలేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్‌నగర్ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే.