ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీపై ఇండియా కూటమి పైచేయి | Bypolls Counting Live Updates: 7 Assembly Seats In Six States - Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీపై ఇండియా కూటమి పైచేయి.. బీజేపీ 3, ఇండియా 4 స్థానాలు కైవసం

Published Fri, Sep 8 2023 9:00 AM | Last Updated on Fri, Sep 8 2023 7:28 PM

Seven Assembly Seats Six States Bypolls Counting Live Updates - Sakshi

Updates..

► దేశంలో ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు సీట్లలో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఇండియా కూటమి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. జార్ఖండ్‌లో జేఎమ్‌ఎమ్‌ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. కాంగ్రెస్ కేరళలో ఒక సీటు, బెంగాల్‌లో టీఎంసీ ఒక సీటు, యూపీలో ఎస్పీ ఒక సీటును సాధించింది.

► ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి స్థానంలో జరిగిన ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ విజయం సాధించారు. 

► జార్ఖండ్‌లో డుమ్రి నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చ అభ్యర్థి బేబి దేవి విజయం సాధించారు. 

► పశ్చిమ బెంగాల్, ధూప్‌గురి ఉప ఎన్నికలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ విజయం సాధించారు. 

► ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పార్వతీ దాస్ విజయం సాధించారు. 

► కేరళలోని పుతుపల్లి ఉప ఎన్నికల్లో  మాజీ సీఎం ఉమెన్‌ చాందీ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి చాందీ ఓమెన్‌ విజయం సాధించారు. 

బెంగాల్‌లో బీజేపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కేరళలో కాంగ్రెస్‌, జార్ఖండ్‌లో ఏజేఎస్‌యూ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. 

► త్రిపురలో రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మూడు సిట్టింగ్‌ స్థానాల్లో బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది. 


► పలు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 

► బెంగాల్‌లోని ధూమ్‌గిరి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అధికార టీఎంసీ అభ్యర్థి రెండో స్థానంలో ఉన్నారు. 

► ఉత్తరప్రదేశ్‌లో ఘోసీ ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి లీడింగ్‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి వెనుకంజలో కొనసాగుతున్నారు. 

► కేరళలోని పుతుపల్లి ఉప ఎన్నకల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి, ఉమెన్‌ ఛాందీ కుమారుడు చాందీ ఓమెన్‌ ముందంజలో కొనసాగుతున్నారు. 

ఆరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 


ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఓడించేందుకు ప్రతిపక్ష కూటమి(ఇండియా) ఏర్పాటైన విషయం తెలిసిందే. కాగా, ఇండియా కూటమి టెస్టింగ్‌ టైమ్‌ ఆసన్నమైంది. పలు రాష్ట్రాల్లో ఈనెల 5న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాల్లో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల బలాన్ని పరీక్షించనున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

► ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో ఏడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

► కాగా, ఘోసీ, డుమ్రీలలో, ప్రత్యర్థి పార్టీలు కొత్తగా ఏర్పడిన కూటమి ఇండియాలో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. 

► ఏడు స్థానాల్లో మూడు (ధన్‌పూర్, బాగేశ్వర్ మరియు ధూప్‌గురి) బీజేపీకి, ఎస్‌పీ (ఘోసి), సీపీఐ (ఎం) (బోక్సానగర్), జేఎంఎం (డుమ్రీ), కాంగ్రెస్ (పుతుపల్లి) చేతిలో ఒక్కొక్కటి ఉన్నాయి. బీజేపీలో తిరిగి చేరిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే, ఓబీసీ నేత దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ స్థానం ఖాళీ అయింది.

► ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి చందన్ రామ్ దాస్ మరణంతో బాగేశ్వర్ స్థానం ఖాళీ అయింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు ఈ సీటును గెలుచుకున్నారు.

► జార్ఖండ్‌లో, డుమ్రీ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని గిరిదిహ్ జిల్లాలోని పచంభ, కృషి బజార్ సమితిలో ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మొత్తం 24 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుందని, 70 మంది అధికారులను ఈ కసరత్తు కోసం నియమించామని గిరిడిహ్ డిప్యూటీ కమిషనర్ కమ్ ఎలక్షన్ ఆఫీసర్ నమన్ ప్రీష్ లక్రా తెలిపారు.

► త్రిపురలో కౌంటింగ్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ అవసరమైన చర్యలు చేపట్టిందని సీనియర్ పోల్ అధికారి ఒకరు తెలిపారు. సోనామురా బాలికల హెచ్‌ఎస్ స్కూల్‌లో బోక్సానగర్, ధన్‌పూర్ రెండు స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని సెపాహిజాలా జిల్లా మేజిస్ట్రేట్ విశాల్ కుమార్ తెలిపారు.

► అక్కడి నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి మిజాన్‌ హుస్సేన్‌పై బీజేపీ తఫజ్జల్‌ హుస్సేన్‌ను రంగంలోకి దించింది. ఓటింగ్ సందర్భంగా రెండు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ(ఎం) కౌంటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

► పశ్చిమ బెంగాల్‌లోని ధుప్‌గురిలో, జల్‌పైగురిలోని నార్త్ బెంగాల్ యూనివర్శిటీ రెండవ క్యాంపస్‌లోని స్ట్రాంగ్ రూమ్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులు కాపలాగా ఉన్నారని ఒక అధికారి తెలిపారు. 2.6 లక్షల మంది అర్హులైన ఓటర్లలో 76 శాతం మంది ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి అభ్యర్థిగా సీపీఐ(ఎం) ఈశ్వర్ చంద్రరాయ్ పోటీ చేస్తుండగా, అధికార టీఎంసీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నిర్మల్ చంద్ర రాయ్‌ను రంగంలోకి దింపింది. కొన్నేళ్ల క్రితం కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడి మరణించిన సీఆర్పీఎఫ్ జవాన్ భార్య తపసీ రాయ్‌ను బీజేపీ నామినేట్ చేసింది.

► కేరళ పుతుపల్లిలో కాంగ్రెస్ అగ్రనేత ఊమెన్ చాందీ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య తీవ్ర పోటీ చోటుచేసుకుంది. ఓట్ల లెక్కింపు బసేలియస్ కళాశాలలోని ప్రత్యేక కౌంటింగ్ స్టేషన్‌లో ఉదయం 8.00 గంటలకు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్, సర్వీస్ బ్యాలెట్లను లెక్కించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement