CBI notice
-
‘నారదా’ స్టింగ్ ఆపరేషన్ కేసు.. జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు
బెంగళూరు: నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 22న విచారణ నిమిత్తం తమముందు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మెయిల్ ద్వారా జర్నలిస్టుకు సీబీఐ నోటీసులు పంపింది.2014లో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన నారదా స్టింగ్ ఆపరేషన్ 2016లో వెలుగులోకి వచ్చింది. బెంగాల్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ అధికారులు, తృణమూల్ కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. జులైలోనే నోటీసులిచ్చినప్పటికీ తాను అమెరికాలో ఉన్నందున విచారణకు రాలేనని సామ్యూల్ బదులిచ్చారు. దీంతో సీబీఐ ఆయనకు మళ్లీ నోటీసులు ఇచ్చింది. -
సంధ్య ఆక్వా ఎక్స్ కంపెనీ నలుగురు ప్రతినిధులకి సీబీఐ నోటీసులు
-
అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు
లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మైనింగ్‌లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే..సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది. మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. -
లిక్కర్ కేసు: ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ.. కవిత ఇంట వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. ఇక.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసులు పంపింది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరుకాకపోవటం గమనార్హం. ఇక.. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ 05వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అవినాష్‌రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐకి హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఆ బ్రదర్స్ చెప్పినట్టే చేశా.. వివేకా పీఏ సంచలన స్టేట్మెంట్ -
ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు
సాక్షి ప్రతినిధి కడప: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. -
సీబీఐ నోటీసులపై స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ కడప: సీబీఐ నోటీసులపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం విచారణకు హాజరవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు సోమవారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల షెడ్యూల్స్ ప్రకారం నేడు విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు సీబీఐ అధికారులకు వెల్లడించినట్లు తెలిపారు. విచారణకు అయిదు రోజుల సమయం కావాలని కోరినట్లు చెప్పారు. తరువాత సీబీఐ ఎప్పుడు పిలిచినా విచారణకు తప్పకుండా హాజరవుతానని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వెల్లడించారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనపై, తన కుటుంబపై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తనేమిటో, తన వ్యవహార శైలి ఏంటో జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసని అన్నారు. న్యాయం గెలచి, నిజానిజాలు వెల్లడి కావాలన్నదే తన ధ్యేయమన్నారు. ‘మీడియా ముఖ్యంగా కోరుకుంటున్న నిజం బయటకు తేలాలని నేను కూడా భగవంతుడుని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు మరొకసారి ఆలోచించుకోవాలి.. ఇలాంటి నిరాధారమైన ఆరోణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు కూడా ఎలా ఫీల్ అవుతారో ఒకసారి ఊహించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. కాగా మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. తాజాగా ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. చదవండి: YSR Aarogyasri: 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు -
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
-
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. సౌత్ గ్రూపులో కీలకమంటూ.. రెండు రోజుల కింద ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సన్నిహితుడు అమిత్ అరోరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించారు. సౌత్ గ్రూపు నుంచి విజయ్నాయర్కు రూ.100 కోట్లు ముడుపులు అందాయని, ఎక్సైజ్ అధికారులకు రూ.కోటి లంచం ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు. ఈ సౌత్ గ్రూపును కల్వకుంట్ల కవిత, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి నియంత్రించారని రిమాండ్ రిపొర్టులో వెల్లడించారు. అంతేగాకుండా లిక్కర్ కుంభకోణం బయటికి వచ్చినప్పటి నుంచి సాక్ష్యాలు లభించకుండా ఉండడానికి 36 మంది నిందితులు/అనుమానితులు తమ సెల్ఫోన్లను ధ్వంసం చేశారని వివరించారు. రిమాండ్ రిపోర్టు ఆధారంగా.. ఈడీ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టు ఆధారంగానే సీబీఐ అధికారులు కల్వకుంట్ల కవితకు సీఆర్పీసీ 160 కింద నోటీసు ఇచ్చారు. సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ అలోక్ కుమార్ షాహి దీనిని జారీ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీలో కుట్రకోణానికి సంబంధించి జూలై 22న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో 14 మందిపై నమోదైన కేసు విచారణ సమయంలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని అందులో పేర్కొన్నారు. ఆయా అంశాలపై దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని కోరారు. ఢిల్లీ లేదా హైదరాబాద్‌లలో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ విచారణకు హాజరుకావాలని సూచించారు. లోతుగా సీబీఐ, ఈడీ దర్యాప్తు ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఈడీ, సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశాయి. చాలా మందిని విచారించాయి. ఈ సందర్భంగా వెల్లడైన అంశాల ఆధారంగా.. కేసుతో సంబంధమున్న వ్యక్తులను గుర్తించి ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ రిమాండ్ రిపోర్టు ఆధారంగా సాధారణ విచారణ కోసం కవితకు సీబీఐ నోటీసు ఇచ్చింది. సౌత్ గ్రూపు పేరిట రూ.వంద కోట్లు సమకూర్చిన విషయంతోపాటు ఈ కుంభకోణానికి సంబంధించి కవితకు తెలిసిన అంశాలను రాబట్టే దిశగా సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు. నా నివాసంలోనే హాజరవుతా: కవిత ఈ నెల ఆరో తేదీన (మంగళవారం) ఉదయం 11 గంటలకు తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం అందించినట్టు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సీబీఐ నోటీసులు అందిన తర్వాత ఆమె ఈ ప్రకటన చేశారు. సెక్షన్ 160 సీఆర్పీసీ కింద తన వివరణ తీసుకోవడానికి నోటీసులు ఇచ్చారని ఆమె వివరించారు. ఏమిటీ సీఆర్పీసీ 160 నోటీసులు ఏదైనా కేసు దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించిన సమాచారం/వివరాలు తెలిసి ఉంటాయని భావించిన వ్యక్తులకు సీఆర్పీసీ 160 కింద అధికారులు నోటీసులు జారీ చేస్తారు. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ/సమాచారం తీసుకోవడం కోసం మాత్రమే ఈ నోటీసులు పరిమితం. వారిని నిందితులు/సాక్షులుగా పరిగణించడంగానీ, అరెస్టు చేయడం వంటివిగానీ దీనిలో ఉండబోవని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సదరు వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం/వివరాల ఆధారంగా దర్యాప్తు అధికారులు తదుపరి నిర్ణయం/చర్యలు తీసుకుంటారని అంటున్నారు. -
సీబీఐ నోటీసులపై హైకోర్టుకు సుజనా
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐలను ప్రతివాదులుగా చేర్చారు. 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా స్టేట్మెంట్ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ఈ నెల 22, 27 తేదీల్లో నోటీసులు జారీ చేసిందని సుజనా పిటిషన్లో పేర్కొన్నారు. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్, ఆ కంపెనీ అధికారులతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఆ కంపెనీపై నమోదు చేసిన కేసులో తనను హాజరు కావాలని సీబీఐ ఎందుకు నోటీసులు జారీ చేసిందో అర్థం కావట్లేదన్నారు. ఈ నోటీసుల ద్వారానే తనకు బెస్ట్ అండ్ క్రాంప్టన్‌తోపాటు మరికొందరు వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తప్పుడు ఖాతాలతో తరలించారన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసిందన్నారు. కేవలం ఖాతా పుస్తకాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినట్లు చూపి బ్యాంకులను రూ.72 కోట్ల మేర మోసం చేసినట్లు సీబీఐ ఆరోపిస్తోందన్నారు. తన ప్రతిష్టను దెబ్బ తీసే చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. -
కాంగ్రెస్‌కు మంత్రి జూపల్లి సవాల్
సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు రుణం విషయంలో సీబీఐ నోటీసులు ఇచ్చినట్టుగా తమ కుటుంబంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐ ఇచ్చినట్టుగా నకిలీ నోటీసులు సృష్టించి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, అంజ య్య, ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ నోటీసులతో తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేసి పరువు తీసినవారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని జూపల్లి హెచ్చరించారు. వ్యాపారాల్లో ఉన్నవారు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం సహజమని.. రాజకీయాల్లోకి రాకముందే ఎల్ఐసీ, ఫ్రుడెన్షియల్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుని, పూర్తిగా చెల్లించేశామని వివరించారు. తన కుమారుడు అరుణ్ కూ డా వ్యాపారం కోసం అప్పులు తీసుకున్నాడని, అందులో రూ.31 కోట్లకు పైగా తిరిగి చెల్లించేశాడని చెప్పారు. ఇలా చెల్లించిన మొత్తం గురించి ఎవరూ పేర్కొనకపోవడం వెనుక కుట్ర ఏమిటని ప్రశ్నించారు. తప్పులు చేయడం లేదు: తాము అప్పులు చేయడం తప్ప.. తప్పులేమీ చేయడం లేదని జూపల్లి పేర్కొన్నారు. వ్యాపారాల ద్వారా సొం తకాళ్లపై నిలబడటం తప్పుకాదని, పదవులను అడ్డం పెట్టు కుని పైరవీలు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. ఆస్తులను తనఖా పెట్టుకునే బ్యాంకులు అప్పులు ఇచ్చాయని, వాటి ని వడ్డీతో సహా వసూలు చేసుకుంటాయని స్ప ష్టం చేశారు. అరుణ్‌ను నీరవ్ మోదీతో పోలుస్తారా, అరుణ్ ఎక్కడికైనా పారిపోయారా అంటూ జూపల్లి భావోద్వేగానికి గురయ్యారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. సీబీఐ నోటీసులిచ్చినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, నకిలీ నోటీసులు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూపల్లి పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నైతికంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని.. తన ప్రతిష్టను దెబ్బతీసి కొందరు రాజకీయ లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఏ తప్పు చేసినా పదవుల నుంచి వెంటనే తప్పుకుంటానన్నారు. తెలంగాణ కోసం మూడున్నరేళ్ల మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర తనదని.. ఇసుక అంశంలో తప్పుచేసిన వారిని గుర్తించి, పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. సమాజంలో ఎంతో మందిని ముంచినోళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని.. వారు నీతులు చెప్పడం మానుకోవాలని జూపల్లి సూచించారు. సీబీఐ పేరిట తప్పుడు నోటీసులను తయారు చేసినవారిపై పరువునష్టం దావా, క్రిమినల్ కేసులు వేస్తానని ప్రకటించారు. కాగా.. మంత్రిగా జూపల్లి అభివృద్ధిని, పార్టీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య విమర్శించారు. పథకాలు, కార్యక్రమాల్లో తప్పులు పట్టుకోలేక ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. -
మోదీ కనుసన్నల్లో సీబీఐ: మమత
కోల్ కతా: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుసన్నల్లో నడుస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ ప్రధానమంత్రి విభాగం(పీఎం డిపార్ట్ మెంట్)గా మారిందని విమర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ నడుస్తోందని మండిపడ్డారు. ఆదాయానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సీబీఐ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై పోరాడుతున్నందునే తమ పార్టీపైకి సీబీఐని ఉసిగొల్పిందని అన్నారు. ఏ ఇతర పార్టీకి సీబీఐ నోటీసు ఇవ్వలేదని మమత తెలిపారు.