![Liquor scam: CBI issues notices To mlc kavitha - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/21/kavitha_0.jpg.webp?itok=GMg1ORmv)
సాక్షి, హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో సీబీఐ.. కవిత ఇంట వద్ద స్టేట్‌మెంట్ తీసుకుంది. ఇక.. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటిసులు పంపింది.
లిక్కర్ కేసులో ఇదివరకే కవితను సీబీఐ అధికారులు ఇంటి వద్ద విచారించారు. తాజాగా మళ్లీ సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఈ లిక్కర్ కేసులో కదలిక వచ్చింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత వరుసగా హాజరుకాకపోవటం గమనార్హం. ఇక.. ఈ కేసుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు పలువురు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment