ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.
మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలు పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలని గతంలోనే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ముఖ్యపాత్ర పోషించారని, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐలు తమ వాదనల్ని వినిపించాయి. అందుకు తగిన ఆధారాల్ని కోర్టు ముందుంచాయి. దీంతో ట్రయల్ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది.
అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై జూలై 22న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కేసును సోమవారానికి (ఆగస్టు 5)కి వాయిదా వేశారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment