సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ శుక్రవారం(జూన్7) సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌పై విచారణ జరిపిన రౌస్ ఎవెన్యూ కోర్టు దానిని పరిగణలోకి తీసుకుంది. సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 21 వరకు కోర్టు పొడిగించింది.
జైలులో చదువుకోవడానికి తనకు 9 పుస్తకాలు కావాలని కవిత కోర్టును కోరోగా కోర్టు ఆమె విజ్ఞప్తిని అంగీకరించింది. కాగా, కవితపై ఇప్పటికే సీబీఐ ఫైల్ చేసిన ప్రధాన ఛార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
కేసులో కవిత పాత్ర కీలమని, సౌత్‌గ్రూపు ఏర్పాటులో ఆమె ముఖ్య పాత్ర పోషించారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ప్రతిఫలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులిచ్చారని అభియోగాలు మోపింది.
Comments
Please login to add a commentAdd a comment