ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ( మంగళవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు ముగిశాయి. ఇవాళ ఈడీ, సీబీఐ వాదనలు వినిపించనున్నారు. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
‘‘కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదు. తనకు మైనారిటీ తీరని పిల్లలు ఉన్నారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలి. తనకు వ్యతిరేకంగా వాంగ్మూలం వచ్చిన మాగుంట ఎన్డీఏ తరఫున అభ్యర్థిగా పోటీ చేశారు. బీజేపీకి రూ. 50 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. 2022లో కేసు నమోదు అయితే 2024లో కవిత అరెస్టు జరిగింది. రాజకీయ కక్ష సాధింపుతో కవితపై కేసు పెట్టారు’’ అని ఢిల్లీ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సోమవారం వాదనలు వినిపించించారు. ఇది వరకే ఈడి, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్టయి రెండు నెలలకుపైగా కవిత తిహార్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించిన వాదనలు..
- కవితను అరెస్ట్ చేయమని ఈడీ సుప్రీం కోర్టుకు చెప్పింది
- సుప్రీంకోర్టులో ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడింది
- రాజకీయ కారణాలతో పక్షపాత ధోరణితో ఈడీ అధికారులు వ్యవహరించారు
- మా వాదన వినకుండానే సీబీఐ ఇంటరాగేషన్‌కు ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది
- సమాచారం ఇవ్వకుండానే సీబీఐ నన్ను అరెస్టు చేసింది: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత
- ఈ అంశాలపై ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ చేయలేదు
- పూర్తి రహస్యం పాటించడం ఎందుకు ?
- సీబీఐ విచారణ, అరెస్టు లో చట్టపరమైన ప్రక్రియ పాటించలేదు
- ఈడీ కేసులో ఇప్పటివరకు ఏడు చార్జిషీట్ లు దాఖలు చేసింది
- మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదు
- కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదు
- ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారు
- బెయిల్ కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని అడిగిన జడ్జి
- కేసు గురించి అన్ని విషయాలు తెలుసన్న జడ్జి
- కవితని అరెస్టు చేయాల్సిన అవసరం లేదు, దాని వల్ల ఈడి కి వచ్చి లాభం ఏమిటి ? అని కవిత తరపు న్యాయవాది వాదనలు
- నేను గత మార్చి లో వరుసగా మూడు రోజులు విచారణకు వచ్చా
- సూర్యాస్తమయం తర్వాత కూడా నన్ను విచారించారు
- నా మొబైల్ ఫోన్ ను కూడా ఇచ్చాను
- మహిళ ఫోన్‌లోకి తొంగి చూశారు
- రైట్ టు ప్రైవసికి భంగం కలిగించారు
- కొత్త మోడల్ ఫోన్ లు రావడంతో పాత ఫోన్లు పని మనుషులకు ఇచ్చాను
- ఆ ఫోన్లు పని మనుషులు ఫార్మాట్ చేశారు.. నాకేం సంబంధం లేదు
- కస్టడీ లో ఉన్న నిందితులతో కలిపి నన్ను ఈడి విచారణ జరపలేదు
- ఎన్నో చార్జిషీట్లు దాఖలు చేసినా నా పేరు ఎక్కడ ప్రస్తావించలేదు
- మాగుంట శ్రీనివాసులురెడ్డి నాకు వ్యతిరేకంగా 164 స్టేట్మెంట్ ఇచ్చారు
- ఆ తర్వాత రూ.50 కోట్లు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు
- ఎన్‌డీఏ అభ్యర్థిగా పోటీ చేశారు
- అరెస్టు చేయమని సుప్రీం కోర్టు కి చెప్పి ఆ తర్వాత మాట తప్పి, కవితని అరెస్టు చేశారు
- సీబీఐ సమన్లు అన్నింటికీ నేను సహకరించా: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత
- మహిళను, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో ఒకరు మైనర్: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత
- నేను ఒక రాజకీయ నాయకురాల్ని: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత
- బెయిల్ కు ఎలాంటి షరతులు పెట్టినా ఓకే: బెయిల్ రిక్వెస్ట్‌లో కవిత
Comments
Please login to add a commentAdd a comment