
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి కోర్టు తీసుకోనుంది.
కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్‌పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.
చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్‌లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.
ఈడి వాదనలు:
ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్‌కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్‌లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.
ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్‌కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్‌గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్‌లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment