dilhi
-
కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై నేడు విచారణ జరగనుంది. 8000 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసినా ఈడీ.. పలు ఆధారాలను కోర్టుకు అందజేసింది. కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి కోర్టు తీసుకోనుంది.కవిత సహా ఐదుగురు నిందితులపై ఆరవ చార్జిషీట్ నమోదైంది. ఒక్కొక్క నిందితుడిపై విడివిడిగా అభియోగాలను కోర్టు పరిశీలిస్తోంది. తొలి రోజు నిందితుడు ప్రిన్స్ కుమార్‌పై అభియోగాలను పరిశీలించిన కోర్టు.. నేడు కవితపై అభియోగాలను పరిగణలోకి తీసుకోనుంది. మరికొంత కాలం కవితని కస్టడీనే ఉంచాలని ఈడీ కోర్టును కోరుతుంది.చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత చట్ట ప్రకారం కస్టడీ అవసరం లేదని కవితను జైల్ నుంచి విడుదల చేయాలని న్యాయవాది నితీష్ రాణా కోరగా, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై స్పెషల్ కోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టనుంది. చార్జిషీట్లో అంశాలపై జడ్జి మరికొంత సమాచారం కోరారు.ఈడి వాదనలు:ఈడీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఐదుగురు నిందితుల పాత్రలపై ఆధారాలతో సహా వివరాలను పొందుపరించింది. ఐదుగురు నిందితుల్లో కవిత, దామోదర్, ప్రిన్స్‌కుమార్, అరవింద్ సింగ్ , చరణ్ ప్రీత్ లపై సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. ఒక్కొక్క నిందితుడికి సంబంధించి అన్ని వివరాలు చార్జిషీట్లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. తొలుత కవిత పాత్రపై వాదనలు వినిపించేందుకు ఈడీ సిధ్దమవ్వగా, అయితే కవిత పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల పాత్ర వివరించాలని జడ్జి సూచించారు. దాంతో ప్రిన్స్ కుమార్ పాత్రను కోర్టుకు ఈడీ వివరించింది.ప్రిన్స్ కుమార్ చారియట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారని, 100 కోట్ల ముడుపులు హవాలా మార్గంలో తరలించడంలో ప్రిన్స్ కుమార్ పాత్ర ఉంది. హవాలా ఆపరేటర్ ఆర్. కాంతి కుమార్ ద్వారా సుమారు 16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్‌కి అందాయి. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నంబర్‌గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడు. అందుకు సంబంధించి కాల్ రికార్డింగ్‌లు, కాల్ డేటా ఇతర ఆధారాలు సేకరించామని ఈడీ తెలిపింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు మొబైల్ నెంబర్ వాడినట్లు కోర్టుకు ఈడీ తెలుపగా, మధ్యలో జోక్యం చేసుకొన్న జడ్జి కావేరి బవేజా ఆ మూడు నెంబర్ ఎవరి పేరు మీద ఉన్నాయని ప్రశ్నించారు. వివరణ ఇవ్వాలని ఈడీ అధికారులను జడ్జి సూచించారు. మరో నిందితుడు అర్వింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని.. 7వ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు. కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
ఐఫోన్ 15 సిరీస్ ఫస్ట్ సేల్ షురూ.. ఉదయం నుంచే వెయిట్ చేస్తున్న కస్టమర్లు!
ఐఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 15 సిరీస్ సేల్ ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్స్ ఓపెన్ చేయకముందు నుంచే కొనుగోలుదారు బయట బారులుతీరారు. దీనికి సంబంధించిన ఫోటోలు & వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో యాపిల్ స్టోర్ల ప్రారంభోత్సవం తర్వాత ఐఫోన్ లాంచ్ కావడం ఇదే మొదటిసారి. ఉదయం 8 గంటలకు స్టోర్ ప్రారంభమైంది.. కస్టమర్లను బ్యాచ్‌ల వారీగా ఆహ్వానిస్తున్నారు. చాలామంది కస్టమర్లు ఉదయం 3 గంటల నుంచే ఎదురు చూస్తున్నట్లు సమాచారం. యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ అనే మోడల్స్ లాంచ్ చేసింది. వీటి ధరలు ఎందుకునే స్టోరేజ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇవి మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఇదీ చదవండి: భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే.. కొత్త ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా రూ. 6000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర మోడల్స్ మీద రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కొత్త మోడల్స్ మీద మాత్రమే కాకుండా ఐఫోన్ 14, 13 సిరీస్‌ల మీద కూడా రూ. 4000 & రూ. 3000 తగ్గింపు లభిస్తుంది. #WATCH | A customer outside the Apple store at Mumbai's BKC says, "I have been here since 3 p.m. yesterday. I waited in the queue for 17 hours to get the first iPhone at India's first Apple store. I have come from Ahmedabad..." Another customer, Vivek from Bengaluru says, "...I… https://t.co/0deAz5JkCH pic.twitter.com/YE6m5cufC2 — ANI (@ANI) September 22, 2023 -
కొత్త అవతారంలో నిషేధిత యాప్‌లు ప్రత్యక్షం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం నిషేధించిన యాప్‌లు కొత్త అవతారంలో మళ్లీ ప్రత్యక్షమవుతున్న విషయం వాస్తవమేనని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ బ్లాక్ చేసిన యాప్‌లు పేర్లు మార్చుకుని కొత్త అవతారంలో మళ్ళీ ప్రత్యక్షమవుతున్నట్లు తమ మంత్రిత్వ శాఖకు నివేదికలు, ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన చెప్పారు. చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు ఈ ఫిర్యాదులను తదుపరి పరిశీలన కోసం తాము హోం మంత్రిత్వ శాఖకు పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన యాప్‌లను బ్లాక్ చేయాల్సిందిగా తమ మంత్రిత్వ శాఖ థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ అయిన గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నిషేధిత యాప్‌లకు సంబంధించిన ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయవలసిందిగా టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. -
సొంత సోదరిపై కాల్పులు జరిపిన సోదరుడు
న్యూఢిల్లీ : సొంత సోదరిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన సంఘటన ఈశాన్య ఢిల్లీలో గురువారం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేద్ ప్రకాశ్ సూర్య కథనం ప్రకారం వెల్కమ్ ఏరియా, జంతా కాలనీకి చెందిన మైనర్ బాలిక వరుసకు బావ అయిన అమీర్‌తో కొంత కాలంకిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే తన అన్నయ్యకు తెలియకుండా తండ్రి మెబైల్తో తరుచూ అమీర్‌తో మాట్లాడటం ప్రారంభించింది. ఈ విషయం కాస్తా సోదరి అన్నకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అమీర్‌తో మాట్లాడవద్దని ఆమెను కోరాగా దానికి బాలిక నిరాకరించింది. దీంతో సోదరిపై ఆగ్రహానికి గురైన అన్న.. క్షణికావేశంలో పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. -
ఉపరాష్ట్రపతితో గవర్నర్ తమిళసై భేటీ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సోమవారం ఢిల్లీలో ఉప రాష్ట్ర్రపతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా తమిళసై సౌందరరాజన్ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రిని కూడా గవర్నర్ కలిసే అవకాశం ఉందని సమాచారం. -
సిగరెట్ తాగొద్దన్నాడని..చంపేశారు!
న్యూఢిల్లీ: ఇంట్లో సిగరెట్ తాగవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి(22)ని అతని స్నేహితుడే కాల్చిచంపిన దారుణ ఘటన దేశరాజధానిలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సుఖదేవ్ నగర్లో నివాసముంటున్న బ్రిజేశ్ కుమార్ ఈ నెల 9న తన స్నేహితుడు భోలాను పార్టీకి ఆహ్వానించాడు. అయితే తన తండ్రికి అలర్జీ ఉన్నందున ఇంట్లో సిగరెట్ కాల్చవద్దని కుమార్ సూచించాడు. దీంతో ఇరువురికి మాటామాట పెరగడంతో కుమార్ భోలాపై చేయిచేసుకున్నాడు. దీన్ని అవమానంగా భావించిన అతను..కుమార్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం విజయ్, అరుణ్ అనే ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్న భోలా.. కుమార్‌ను తర్వాతి రోజు పార్టీకి ఆహ్వానించాడు. అతని చేత పూటుగా మద్యం తాగించి, దూరంగా తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం శవాన్ని దగ్గర్లోని కాలువలో పడేసి ముగ్గురు ఇళ్లకు వెళ్లిపోయారు. సోమవారం రోహిణీ సెక్టార్‌లోని కాలువలో దొరికిన ఓ శవాన్ని కుమార్‌గా నిర్ధారించిన పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. -
ఐదు కార్పోరేట్ ఆస్పత్రులకు రూ.600 కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కార్ కార్పోరేట్ ఆస్పత్రులపై కొరఢా ఝుళిపించింది. ఐదు కార్పోరేట్ దవాఖానాలపై ఏకంగా రూ.600 కోట్లు ఫైన్ విధించింది. పేదలకు వైద్యం అందించడంలో చేసిన నిర్లక్షానికి ఈఫైన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్, మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, ధర్మ శిల కాన్సర్ హాస్పిటల్, పుష్పవతి సింగానియా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లు ప్రభుత్వం దగ్గర పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని అన్ని సౌకర్యాలను పొంది, వారికి వైద్యం అందించడంలో విఫలమయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆస్పత్రులు పేదలకు వైద్యం అందించే విషయంలో విఫలమైనందుకే రూ.600 కోట్ల ఫైన్ విధించామని, ఈ మేరకు వారికి నోటీసులు అందించామని ప్రభుత్వ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ హేమ్ ప్రకాశ్ తెలిపారు. యాజమాన్యాలు ఫైన్ చెల్లించేందుకు నెల రోజుల గడువు ఇస్తున్నామని ఆయన అన్నారు. నోటీసులు అందుకున్న యాజమాన్యాలు తమకు ఫైన్ విధించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నాయి. ఢిల్లీలో మొత్తం 43 కార్పోరేట్ ఆస్పత్రులు ఉన్నాయి.