
ఫైల్ ఫోటో
న్యూఢిల్లీ : సొంత సోదరిపై పిస్టల్‌తో కాల్పులు జరిపిన సంఘటన ఈశాన్య ఢిల్లీలో గురువారం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వేద్ ప్రకాశ్ సూర్య కథనం ప్రకారం వెల్కమ్ ఏరియా, జంతా కాలనీకి చెందిన మైనర్ బాలిక వరుసకు బావ అయిన అమీర్‌తో కొంత కాలంకిందట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలోనే తన అన్నయ్యకు తెలియకుండా తండ్రి మెబైల్‌తో తరుచూ అమీర్‌తో మాట్లాడటం ప్రారంభించింది. ఈ విషయం కాస్తా సోదరి అన్నకు తెలియడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలో అమీర్‌తో మాట్లాడవద్దని ఆమెను కోరాగా దానికి బాలిక నిరాకరించింది. దీంతో సోదరిపై ఆగ్రహానికి గురైన అన్న.. క్షణికావేశంలో పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. స్థానికుల సహాయంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment