YS Vivekananda Reddy Murder Case: ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు | CBI Issued Notices To MP YS Avinash Reddy - Sakshi
Sakshi News home page

ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు 

Published Sun, Apr 16 2023 8:56 PM | Last Updated on Mon, Apr 17 2023 11:10 AM

CBI Issued Notices To MP YS Avinash Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికే సీబీఐ అధికారులు పలుమార్లు ఆయన్ను విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement