
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ మరోసారి..
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా.. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఇదిలా ఉంటే.. వివేకా కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జూన్ 05వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అవినాష్‌రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐకి హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఆ బ్రదర్స్ చెప్పినట్టే చేశా.. వివేకా పీఏ సంచలన స్టేట్‌మెంట్