► వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సీబీఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది.
► ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గురించి ఈ సమయంలో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఒక వేళ నిజంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ భావించి ఉంటే.. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి ఉండేది. లిఖిత పూర్వకంగా ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తున్నాం- చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పూర్తి ఆదేశాలు
1. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఆదేశాలిచ్చారు.
2. వైఎస్ వివేకానందారెడ్డి ఆయన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి సోదరుడు.
3. హత్య గురించి వివేకా పీఏ MV కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటయింది. అలాగే కేసును అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది.
4. వివేకా కూతురు విజ్ఞప్తి మేరకు కేసును బదిలీ చేశాం. సిబిఐ వేసిన ఛార్జ్‌షీట్‌లో నలుగురి పేర్లు ఉన్నాయి. నవంబర్ 17, 2021న శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. జనవరి 31, 2022న సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది
5. ఏప్రిల్ 16న దర్యాప్తుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులిచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్‌రెడ్డి ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు..లాయర్ సమక్షంలో విచారణ జరపాలని సిబిఐకి సూచించింది.
6. అలాగే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దర్యాప్తుకు హాజరు కావాలని ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను మేం కొట్టివేస్తున్నాం.
7. ఈ సమయంలో అరెస్ట్ చేయాలా వద్దా అన్న అంశాల జోలికి వెళ్లడం లేదు. నిజంగా అవినాష్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలని భావించి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్లు. సిబిఐ కూడా ఒక పద్ధతిలో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అరెస్టు చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారు?.
8. కేసు దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం.
9. ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న పిటిషన్ లో ముందస్తు బెయిల్ కు సంబంధించి ఎంపీ అవినాష్ తన వాదనలు వినిపించుకోవచ్చు
10. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రభావం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ప్రభావం చూపరాదు.
వైఎస్ అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు
అవినాష్ రెడ్డి ఎంపీగా బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్లడం లేదు
సిబిఐ ముందు ఇప్పటివరకు ఏడుసార్లు విచారణకు హాజరయ్యారు
విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలోని పేరా 18 తప్పుడు గా అన్వయం చేస్తున్నారు
అవినాష్ రెడ్డి ఎలాంటి సాక్ష్యం ధ్వంసం చేయలేదు, పైగా అన్ని వైపులా అవినాష్ పై దాడి జరుగుతోంది
► అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము ఇవాళ ఇచ్చిన తీర్పు ప్రభావం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉండకూడదని పేర్కొంది.
ఇదీ చదవండి: ఏది నిజం? వివేకా హంతకులను నడిపిస్తుందెవరు?
Comments
Please login to add a commentAdd a comment