
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల తవ్వకం కేసులో సాక్షిగా హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ ఇచి్చన సమన్లను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బేఖాతరు చేశారు. సీబీఐ సమన్ల ప్రకారం గురువారం ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌కు అఖిలేశ్ వెళ్లాలి. కానీ ఆయన లక్నోలోనే ఉండిపోయారు. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు.
‘‘ అంతకుముందే ఖరారైన షెడ్యూల్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున గురువారం మీ ఆఫీస్‌కు అఖిలేశ్ రావట్లేదు. కానీ అవకాశం ఉన్నంతమేరకు మీకు నా సహాయసహకారాలు ఉంటాయి’’ అని అఖిలేశ్ తరఫున న్యాయవాది సీబీఐకి వివరణ ఇచ్చారు. తర్వాత లక్నోలో పార్టీ ఆఫీస్‌లో జరిగిన వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సభలో అఖిలేశ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టడాన్ని అఖిలేశ్ ప్రస్తావించారు.