Natural gas production
-
కేజీ డీ6 ఎంజే ఫీల్డ్‌లో రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: కేజీ డీ6 పరిధిలోని అత్యంత లోతైన సముద్రపు బ్లాక్ ఎంజే ఫీల్డ్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ సహజ వాయువుని ఈ త్రైమాసికంలోనే ఉత్పత్తి చేయనుంది. ఏకైక డీప్ వాటర్ బ్లాక్ అయిన కేజీ డీ6 దేశ గ్యాస్ అవసరాల్లో 15 శాతాన్ని తీరుస్తుండడం విశేషం. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 20 మిలియన్ స్టాండర్డ్ క్యుబిక్ మీటర్స్ రోజువారీ (ఎంఎంఎస్‌సీఎండీ) ఉత్పత్తి సగటున ఇక్కడ నమోదైంది. ఎంజే డీప్ వాటర్ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తి మొదలైతే దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్రిటన్‌కు చెందిన బీపీతో కలసి ఇక్కడ ఉత్పత్తిని ఆరంభించనుంది. వాస్తవానికి గడిచిన డిసెంబర్ త్రైమాసికంలోనే ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉండగా, మూడు నెలల జాప్యం నెలకొంది. కేజీ డీ6లో మూడు ప్రాజెక్టుల ద్వారా గ్యాస్ ఉత్పత్తిపై రిలయన్స్, బీపీ 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మూడు ప్రాజెక్టులకు గాను ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్లో ఇప్పటికే ఉత్పత్తి ఆరంభమైంది. ఎంజే ఫీల్డ్‌లో ఉత్పత్తి మొదలు కావాల్సి ఉంది. ‘‘ఎంజే ఫీల్డ్‌లో పరీక్షలు, ఉత్పత్తి మొదలు పనులు నడుస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి మొదలైతే కేజీ డీ6 పరిధిలో మొత్తం గ్యాస్ ఉత్పత్తి 30 ఎంఎంఎస్‌సీఎండీకి చేరుకుంటుంది’’అని రిలయన్స్ ఇండస్ట్రీస్ తన త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించింది. -
ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాకు ఊరట
న్యూఢిల్లీ: దేశంలో సహజ వాయువు ఉత్పత్తి ధరలపై కేంద్రానికి కీలక సూచనలు చేసిన కిరీట్ పారిఖ్ కమిటీ, ఓఎన్జీసీ ఆయిల్ ఇండియాకు కొంత ఊరట కల్పించింది. ఈ సంస్థలకు ప్రభుత్వం నామినేషన్‌పై కేటాయించిన క్షేత్రాల (లెగసీ ఫీల్డ్స్) నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరను.. దిగుమతి చేసుకునే ధరలో 10 శాతం నిర్ణయించాలని పేర్కొంది. అలాగే, ఇవే సంస్థలు కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్ (ప్రస్తుత సామర్థ్యం కాకుండా)కు 20 శాతం అధిక ధరను పారిఖ్ కమిటీ సూచించింది. ఇక లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ధరను దిగుమతి ధరలో 10 శాతం లేదా ఎంబీటీయూ గ్యాస్‌కు గరిష్టంగా 6.5 డాలర్లు మించకూడదని పేర్కొంది. అదే సమయంలో కనిష్టంగా 4 డాలర్లను సిఫారసు చేసింది. దీనివల్ల ఎరువుల కంపెనీలపై భారం తగ్గనుంది. ఎందుకంటే వీటికి ప్రధాన ఇంధనంగా సీఎన్జీ ఉన్న విషయం గమనార్హం. ఇవే ధరల పరిమితులు విద్యుత్ రంగానికీ సరఫరా చేసే గ్యాస్‌కు కూడా వరిస్తాయి. ప్రస్తుతం లెగసీ క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధర ఎంబీటీయూకు 8.57 డాలర్లుగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం దిగుమతి చేసుకునే క్రూడ్ బ్యారెల్ 83 డాలర్లుగా ఉంది. ఇందులో 10 శాతం అంటే 8.3 డాలర్లు అవుతుంది. అయినా కానీ గరిష్ట పరిమితి 6.5 డాలర్లుగానే ఉంటుంది. -
గ్యాస్‌లో పెట్టుబడులకు ధర విషయంలో స్వేచ్ఛ కీలకం
న్యూఢిల్లీ: సముద్రాల్లో వందల కొద్దీ మీటర్ల లోతున ఉండే సహజ వాయువు నిక్షేపాలను కనుగొని, వెలికి తీయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వీపీ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ కల్పించడం కీలకమని పేర్కొన్నారు. చమురు, గ్యాస్ ఆపరేటర్ల సమాఖ్య ఏవోజీవో ఈ విషయాన్నే గ్యాస్ ధరను సమీక్షిస్తున్న ప్రభుత్వ నియమిత కిరీట్ పారిఖ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ కాల్లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు వివరించారు. అటు వినియోగ సంస్థలు మాత్రం గ్యాస్ ధరపై ఎంతో కొంత పరిమితి ఉండాలని కోరుకుంటున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిఖ్ కమిటీ రాబోయే కొన్ని వారాల్లో నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్లో 6.7 శాతంగా ఉన్న దేశీ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని కమిటీకి ఏవోజీవో తెలిపింది. విద్యుత్తు, ఎరువులు మొదలైన వాటి ఉత్పత్తిలో సహజ వాయువును వినియోగిస్తారు. -
చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’
ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా – పంపిణీలలో ఎన్నో విజయాలు అధిగమించిన ఎంఈఐఎల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. హైడ్రోకార్బన్స్ డివిజన్ ద్వారా చమురు వెలికితీత,గ్యాస్ పంపిణీ సహజ వాయువు రంగంలో వివిధ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తున్నది. కువైట్, జోర్డాన్‌లో రిఫైనరీ పనులను చేపట్టింది. దేశంలోని రాజస్థాన్, అస్సాం, గుజరాత్, ఆంధ్రపదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో చమురు, సహజ వాయువు రంగంలో ఎంఈఐఎల్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ హైడ్రో కార్బన్ రంగంలో విస్తరిస్తున్నది. విదేశీ ప్రాజెక్టులు జోర్డాన్‌కు చెందిన అరబ్ పొటాష్ కంపెనీ (ఏపీసీ) నుంచి 54 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టును ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇంజనీరింగ్, సామగ్రి సరఫరా, వాటి అమరిక, కమిషనింగ్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. 54 మెగావాట్ల గ్యాస్ టర్బైన్, హీట్ రికవరీ అండ్ స్టీమ్ జెనరేటర్ సిస్టమ్ (హెచ్ఆర్ఎస్జీ) ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు పనులన్నింటినీ పూర్తి చేసి గతేడాది అక్టోబర్‌లోనే విద్యుత్ ఉత్పత్తిని ఎంఈఐఎల్ ప్రారంభించింది. అలాగే కువైట్‌లోని అల్ జౌరి ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో 60 నుంచి 78 మీటర్ల వ్యాసంతో 70,000 మిలియన్ టన్నుల సామాగ్రితో 66 ట్యాంకులను ‘ఎంఈఐఎల్’ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం 3000 మంది సిబ్బందిని నియమించింది. ఇప్పటికే ట్యాంకుల నిర్మాణం చాలా వరకు పూర్తయింది. వీటికి హైడ్రో టెస్ట్ కొనసాగుతుంది. డిసెంబరు 2019 నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలన్న సంకల్పంతో ఎంఈఐఎల్ ఉన్నది. ఎటువంటి ప్రమాదం లేకుండా కోటి గంటల పాటు పనిచేయడం ద్వారా కెఐపిఐసి నుండి ‘ఎంఈఐఎల్’ అప్రిసియేషన్ సర్టిఫికెట్ కూడా పొందింది. రాజస్థాన్‌లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ రాజస్థాన్ లోని రాగేశ్వరి వద్ద గ్యాస్ ప్రాసెస్ ప్రాజెక్టును కెయిర్న్ ఇండియా కోసం ‘ఎంఈఐఎల్’ నెలకొల్పింది. కెయిర్న్ ఇండియా నుంచి ఆగస్టు 2018 లో ఆర్డర్ ను పొంది అదే నెలలో అన్ని వనరులను సమీకరించి, వేగంగా పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ఒక సవాల్ గా తీసుకొని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ పరికరాల సహాయంతో రోజుకు 24 గంటల పాటు పని చేయడం ప్రారంభించడం ద్వారా మార్చి 2019 నాటికే కేవలం ఆరు నెలలు కాలంలో నిర్మించింది. ఈ రంగంలో ఇంత వేగంగా ప్రాజెక్టును ఒక రికార్డు. ఈ అసమానమైన విజయం కారణంగా, ‘ఎంఈఐఎల్’ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకొని అంతర్జాతీయ హైడ్రోకార్బన్ పరిశ్రమలలో ప్రముఖ స్థానానికి చేరుకుంది. అస్సాం, గుజరాత్ లలో పైప్లైన్ల రీప్లేస్మెంట్ ప్రాజెక్టులు అస్సాం లోని గెలికి వద్ద ఆరు పైప్ లైన్ విభాగాల పనిని ఓఎన్జీసి కోసం ఎంఈఐఎల్ చేపట్టింది. 2017లో 48.3 కిలోమీటర్ల పైప్ లైన్ల పని పూర్తి చేయగా 2018 లో 91.62 కిలో మీటర్ల పనిని పూర్తి చేసింది. ఐదు పైప్ లైన్ విభాగాలను వేయడం ద్వారా పైప్ పరిమాణం 8 అంగుళాల నుండి 14అంగుళాలకు పెంచడం ద్వారా పైప్ సామర్థ్యాన్ని పెంచుతుంది. 2018 లో రెండు విభాగాలలో 11.39 కిలోమీటర్ల మేర పనులను ఎంఈఐఎల్ పూర్తిచేసింది. సౌత్ సాంతల్ జిజిఎస్ మరియు సిటిఎఫ్ నుంచి బెచ్చరాజి జిజిఎస్-1 వరకు ఎల్పి గ్యాస్‌ను సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా అస్సాం రెన్యువల్ ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్ ఎఫ్లూఎంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటిపి), వాటర్ ఇంజక్షన్ ప్లాంట్ (డబ్ల్యుఐపి), జిజిఎస్ 5 లను 2018 ఏర్పాటు చేసింది. గుజరాత్ లోని మెహసానా వద్ద నాలుగు దశలలో అగ్నిమాపక వ్యవస్థ అప్-గ్రేడింగ్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. ఫైర్ వాటర్ నెటవర్క్స్, హైడ్రంట్స్, వాటర్ ఫోమ్ మానిటర్, వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్ లతో పాటు స్ర్పింకర్ రింగ్‌లను ఏర్పాటు చేసింది. మొత్తం నాలుగు దశలకు గాను రెండు దశలను పూర్తి చేయడం జరిగింది. మిగతా రెండు దశలు జూలై 2019 నాటికి పూర్తవుతాయి. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సిటీ గ్యాస్ డిస్ట్రిబబ్యూషన్ (సిజిటి) ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటక రాష్ట్రాల్లోని 16 జిల్లాలను ఎంఈఐఎల్ దక్కించుకుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్నాటకలోని తుంకూరు, బెల్గవి జిల్లాల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఆటోమొబైల్ రంగాలకు ‘మేఘా గ్యాస్’ అనే పేరుతో సహజ వాయువు పైపుడ్ గ్యాస్ సరఫరా చేస్తోంది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పైపులతో గ్యాస్ ను సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కింద 360 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేయగా మరో 900 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నది. నాగాయలంక, పెనుగొండ ఆన్‌షోర్ గ్యాస్ ఫీల్డ్ గ్యాస్ గ్రిడ్ నెట్వర్క్ పనులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంఈఐఎల్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని నాగాయలంకలో పనులు పూర్తి చేసి కృష్ణా జిల్లాకు సహజ వాయువు పైపుడ్ గ్యాస్ ను సరఫరా చేస్తోంది. అలాగే తెలంగాణలోని ఇండస్ట్రియల్ కు సహజ వాయువు పైపుడ్ ద్వారా సరఫరా చేయబోయే పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పెనుగొండ గ్యాస్ గ్రిడ్ పనులు పూర్తి చేశారు. ఓన్జీఎస్ అనుమతుల వచ్చాక గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సరఫరా చేయడానికి సిద్దంగా ఉంది. -
ధర పెంచకపోతే దిగుమతి తప్పదు...
భారత్‌లో సహజ వాయువు లభ్యతపై ఐహెచ్ఎస్ నివేదిక న్యూఢిల్లీ: ధరల సంస్కరణలను అమలుచేయకపోతే భారత్‌లో సహజ వాయువు ఉత్పత్తి ప్రస్తుత స్థాయి వద్దే ఆగిపోతుందని అమెరికాకు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్ఎస్ పేర్కొంది. ఉత్పత్తి పెరగకపోతే దేశీయ అవసరాలకు గ్యాస్‌ను భారీగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అందులోని ముఖ్యాంశాలు: - మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్‌కు ప్రస్తుతం 4.2 డాలర్లు చెల్లిస్తున్నారు. ఇదే ధరను కొనసాగిస్తే భారత్‌లో గ్యాస్ రోజువారీ ఉత్పత్తి 300 కోట్ల ఘనపు అడుగుల వద్ద నిలిచిపోతుంది. దేశీయ అవసరాల కోసం రోజూ 970 కోట్ల ఘనపు అడుగుల ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. - మునుపటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు గ్యాస్ ధరను 8.5 డాలర్లకు పెంచితే వచ్చే పదేళ్లలో 195 కోట్ల ఘనపు అడుగుల గ్యాస్ అదనంగా ఉత్పత్తి అవుతుంది. - ధరల విధానం దేశంలో గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు దోహదపడాలి. ఉత్పత్తి పెరిగితే దిగుమతులు తగ్గి, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. - భారత్‌లో ఇప్పటివరకు అనుసరిస్తున్న ధరల విధానాలతో గ్యాస్ డిమాండు, సరఫరాల మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ కారణంగానే ప్రపంచంలో ఎల్ఎన్జీని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఇండియా ఐదో స్థానంలో నిలిచింది.