'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే | Tweet From Shane Warne Twitter Handle His Birthday Legacy Live-On Viral | Sakshi
Sakshi News home page

Shane Warne: 'భౌతికంగా మాత్రమే దూరం'.. హ్యాపీ బర్త్‌డే

Published Tue, Sep 13 2022 12:48 PM | Last Updated on Tue, Sep 13 2022 1:08 PM

Tweet From Shane Warne Twitter Handle His Birthday Legacy Live-On Viral - Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌.. లెజెండరీ షేన్‌ వార్న్‌ భౌతికంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన వార్న్‌ క్రీడాలోకాన్ని కంటతడి పెట్టించాడు. అతను భౌతికంగా లేకపోయినా..వార్న్‌ జ్ఞాపకాలు మాత్రం చిరకాలం మిగిలిపోనున్నాయి. కాగా ఇవాళ(సెప్టెంబర్‌ 13) దివంగత స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ పుట్టినరోజు. 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్న్‌కు ప్రత్యేక నివాళి.

కాగా వార్న్‌ పుట్టినరోజు సందర్భంగా అతని ట్విటర్‌లో ఒక ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతని ట్విటర్‌ నుంచి వచ్చిన మెసేజ్‌ అందరిని ఆకట్టుకుంటుంది.'' భౌతికంగా దూరమైన మీరిచ్చిన వారసత్వం ముఖ్యమైన వాటిపై గొప్ప దృక్పథాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి జీవితం గొప్పతనాన్ని సూచిస్తుంది. జీవితంలో మీరేం సాధించారన్నది అక్కడి ప్రజలు, ప్రదేశాలపై స్పష్టమైన ప్రభావం చూపిస్తుంది. షేన్‌ వారసత్వం ఎన్నటికి బతికే ఉంటుంది.. హ్యాపీ బర్త్‌డే షేన్‌ వార్న్‌.. మీరెప్పుడు మా గుండెల్లో పదిలంగా ఉంటారు.'' అంటూ ట్వీట్‌ చేశారు. 

 ఇక షేన్‌ వార్న్‌ 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో వార్న్‌.. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్న సంగతి తెలిసిందే.

చదవండి : FIFA-23 Ratings: మెస్సీ,చదవండి రొనాల్డోలకు ఊహించని షాక్‌..

నాకసలు ఈ జాబ్‌ అవసరమే లేదు.. కానీ ఇప్పుడు​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement