unanimously
-
మహిళలపై నేరాలకు మరణ శిక్షే
కోల్‌కతా: మహిళలపై అత్యాచారం, హత్య వంటి తీవ్ర నేరాలకు పాల్పడే దోషులకు మరణ శిక్ష విధించడానికి ఉద్దేశించిన ‘అపరాజిత’ బిల్లుకు పశి్చమ బెంగాల్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘అపరాజిత మహిళ, బాలలు(పశి్చమ బెంగాల్ చట్టాలు, సవరణ) బిల్లు–2024’ను రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి మలోయ్ ఘటక్ మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార, విపక్ష సభ్యులంతా బిల్లుకు అంగీకారం తెలిపారు. బిల్లుకు సంబంధించి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రతిపాదించిన కొన్ని సవరణలను సభ తిరస్కరించింది.మహిళలపై అత్యాచారానికి పాల్పడి వారి మరణానికి లేదా జీవచ్ఛవంగా మారడానికి కారణమైన దోషులకు మరణ శిక్ష లేదా పెరోల్‌కు వీల్లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా అపరాజిత బిల్లును పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలపై నేరాల కేసుల్లో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, సత్వరమే కోర్టు నుంచి తీర్పు వచ్చేలా బిల్లులో నిబంధనలు జోడించారు. మహిళలు, చిన్నారులకు భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా అత్యాచారాలు, లైంగిక నేరాలకు సంబంధించి ఇప్పుడున్న చట్టంలో కొన్ని మార్పులు చేశారు, కొత్త అంశాలు చేర్చారు.కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులకు మరణ శిక్ష విధించేలా కఠినమైన చట్టం తీసుకొస్తామని పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అపరాజిత బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించడం కోసమే రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: సీఎం మమతా బెనర్జీ డిమాండ్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మహిళల భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టని ముఖ్యమంత్రులంతా పదవులకు రాజీనామా చేయాలని పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో అపరాజిత బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించి, బాధితులకు సత్వరమే న్యాయం చేకూర్చేలా చట్టాల్లో సవరణలు చేయాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అందుకే తామే మొదట చొరవ తీసుకున్నామని తెలిపారు.అపరాజిత బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. ఇది మొత్తం దేశానికి ఒక రోల్‌మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటీవల ప్రధాని మోదీకి తాను రాసిన రెండు లేఖలను ఆమె సభ ముందుంచారు. మహిళలు, చిన్నారులకు భద్రత కలి్పంచేలా చట్టాలను అమలు చేయడంలో విఫలమైన పాలకులంతా పదవుల నుంచి తప్పుకోవాలని తేలి్చచెప్పారు. ఇదిలా ఉండగా, జూనియర్ డాక్టర్ హత్యకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సభలో విపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు బిగ్గరగా నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్లో మహిళలపై అధికంగా నేరాలు జరుగుతున్నాయని తిప్పికొట్టారు.ఏమిటీ అపరాజిత బిల్లు?భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహితతో పాటు పోక్సో చట్టానికి కూడా పశి్చమ బెంగాల్ ప్రభుత్వ అపరాజిత బిల్లు సవరణలను ప్రతిపాదించింది. ‘‘అత్యాచారం, అత్యాచారం–హత్య, సామూహిక అత్యాచారం, బాధితుల గుర్తింపు బయటపెట్టడం, యాసిడ్ దాడి వంటి నేరాలకు విధించే శిక్షలకు సంబంధించి భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 64, 66, 70(1), 71, 72(1), 73, 124(1), 124(2)ను సవరించాలి. మహిళలు, చిన్నారులపై అత్యాచారం, లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలి’’ అని పేర్కొంది.‘‘అత్యాచారం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదైన 21 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలి. తగిన కారణాలుంటే మరో మూడు వారాలు పొడిగించవచ్చు. దోషులకు మరణ శిక్షతో పాటు జరిమానా లేదా ఆజన్మ ఖైదు (మరణించేదాకా) విధించాలి. మహిళలపై నేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను, కేసు విచారణ వివరాలను అనుమతి లేకుండా ప్రచురిస్తే 3 నుంచి ఐదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించాలి. దర్యాప్తు కోసం డీఎస్పీ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక కోర్టును, దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలి’’ అని అపరాజిత బిల్లు ప్రతిపాదించింది. -
ట్విటర్ డీల్: ఈలాన్ మస్క్ మరో అడుగు ముందుకు
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో ఈలాన్ మస్క్, మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్‌కు ట్విటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందానికి బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కంపెనీని టేకోవర్ చేయడానికి మస్క్ బిడ్ ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న సంగతి తెలిసింది. తాజాగా డీల్‌కు ట్విటర్ బోర్డు ఏకగ్రీవంగా ఓటు వేయడంతో మెర్జర్ డీల్‌కు మరో అడుగు ముందుకు పడింది. ఇకపై దీనికి వాటాదారుల ఆమోదం కావాల్సి ఉంది. ప్రత్యేక స్టాక్‌హోల్డర్ల సమావేశంలో విలీన ఒప్పందాన్ని ఆమోదించాలా అనేదానిపై ఇన్వెస్టర్లు ఓటు వేయ నున్నారు. షేర్హోల్డర్లు తమ స్టాక్‌లోని ప్రతి షేరుకు 54.20డాలర్ల నగదుకు అర్హులు. ఇది మస్క్ తన తొమ్మిది శాతం వాటా కొనుగోలుకు చివరి రోజు ట్రేడింగ్ విలువను పరగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ట్విటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్ సమాచారాన్ని టెక్ క్రంచ్ వెల్లడించింది. నష్ట పరిహారానికి అంగీకరిస్తూనే విలీన ఒప్పందానికి వాటాదారులు ఓటు వేయాలని ట్విటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దాదాపు 5 శాతం నకిలీ ఖాతాలు ఉన్నాయని వాదిస్తున్న మస్క్ ఇటీవల ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఇందులో చాలా ముఖ్యమైన ప్రశ్నలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే ఈ డీల్‌కు సంబంధించి మరో ప్రధాన అడ్డంకి వాటాదారుల ఆమోదం కూడా ఒకటని అన్నారు. అయితే గత వారం ట్విటర్ ఉద్యోగులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో డీల్ విషయంలో ముందుకు సాగాలనే భావిస్తున్నట్టు మస్క్ పేర్కొన్నారు. -
ఏపీ: ఏకగ్రీవంగా రాజ్యసభ ఎన్నికలు
-
ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం
సాక్షి, అమరావతి: రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభ ప్రాంగణంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ నెల 1వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయింది. ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అనంతరం ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎస్.నిరంజన్‌రెడ్డి, ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నలుగురి ఎన్నికతో రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఎంపీలుగా ఎన్నికైన నలుగురు ధ్రువీకరణ పత్రాలు అందుకున్న అనంతరం అసెంబ్లీ ఆవరణలోను, సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సమష్టిగా కృషిచేస్తామని చెప్పారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఏపీ ప్రయోజనాల కోసం శ్రమిస్తాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాల కోసం కృషిచేస్తా. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా సీఎం జగన్ ఆశయాలు, పార్టీ విధివిధానాల మేరకు పనిచేస్తా. రాజ్యసభలో 50 శాతానికిపైగా బీసీలకు స్థానం కల్పించడం చరిత్రాత్మకం. ప్రజాసేవలో ఇంతగొప్ప అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – వి.విజయసాయిరెడ్డి బీసీలంతా జగన్ వైపే సీఎం జగన్ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించి వెనుకబడిన కులాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీలంతా జగన్ వైపే ఉన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక బీసీల సంక్షేమం, రాజ్యాధికారం మాటల్లో కాకుండా చేతల్లో అమలు చేసి చూపిస్తున్నారు. – ఆర్.కృష్ణయ్య బీసీల హృదయాల్లో చెరగని ముద్ర వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక భరోసాతోపాటు రాజకీయంగా ఉన్నతమైన అవకాశాలు కల్పించడం ద్వారా ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి. వైఎస్సార్సీపీకి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుంటే ఐదుగురు బీసీలే. పరిమళ్ నత్వానీ కూడా బీసీ వర్గానికి చెందినవారే. అందుకే బీసీల హృదయాల్లో సీఎం జగన్ శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్నారు. – బీద మస్తాన్‌రావు ప్రజాసేవ గొప్ప వరం ప్రజాసేవలో నాకు అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఇదొక గొప్ప వరంగా భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధికి సీఎం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాను. సీనియర్ నాయకుల సలహాలతో ముందుకెళ్తా. ప్రజాసమస్యల పరిష్కారానికి పార్లమెంట్ సాక్షిగా నిరంతరం శ్రమిస్తా. – నిరంజన్‌రెడ్డి సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎంపీలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్న అనంతరం వారు నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం జగన్‌ను కలుసుకున్నారు. రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎంపీల నేపథ్యం ఇదే.. ఆర్ కృష్ణయ్య: ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లిలో జన్మించారు. ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీద మస్తాన్‌రావు: ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు.. జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. విజయసాయి రెడ్డి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. నిరంజన్ రెడ్డి: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. జులై 22 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో కూడా సేవలందించారు. -
ఏపీ : ఊపందుకున్న ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం కొండకిందతాండ పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్సీపీ మద్దతుదారు పార్వతి భాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొండకిందతాండ పంచాయతీకి గిరిజన మహిళ పార్వతి భాయ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమైంది. కొండకిందతాండలో ఆలయ నిర్మాణానికి పార్వతీభాయ్ ముందుకు రావటంతో గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించింది. 2వేల నుంచి 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10లక్షలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే 10వేలకు పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షల ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, 32,504 వార్డులకి ఎన్నికలు జరగనుండగా సర్పంచ్ పదవులకు 13 వేలకు పైగా నామినేషన్లు.. వార్డు పదవులకి 35 వేలకి పైగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. -
హెచ్ఎఫ్ఐ అధ్యక్షునిగా జగన్మోహన్ రావు
సాక్షి, హైదరాబాద్: భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్ఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎ. జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. సమాఖ్యకు సీనియర్ ఉపాధ్యక్షులుగా ఆనందీశ్వర్ పాండే, ప్రదీప్ కుమార్ వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా ప్రీత్ సింగ్ నియమితులు కాగా సంయుక్త కార్యదర్శులుగా తేజ్‌రాజ్ సింగ్, బ్రిజ్‌కుమార్ శర్మ, ఎన్కే శర్మ, వీణ శేఖర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వినయ్ కుమార్ సింగ్ కోశాధికారిగా ఎంపికయ్యారు. ఉపా ధ్యక్షులుగా పద్మశ్రీ సత్పాల్, అమల్ నారాయణన్, రీనా సవీన్ వ్యవహరిస్తారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం
-
ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ జోరు
సాక్షి, హైదరాబాద్: ఏకగ్రీవాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు ప్రదర్శించింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక మొత్తం 76 వార్డుల్లో (సోమవారం వరకు 40 వార్డులు కలుపుకుని) టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీలేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఐఎం అభ్యర్థులు మూడు వార్డుల్లో ఏకగ్రీవమయ్యారు. దీంతో పాటు ఇంకా ఈనెల 22న ఎన్నికలు జరగకుండానే సగం సీట్లు ఏకగ్రీవం కావడంతో పరకాల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు గాను 11 వార్డులు ఏకగ్రీవం కావడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా టీఆర్ఎస్ చేజిక్కించుకున్నట్టు అయ్యింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా సోమవారానికే 6 వార్డులు ఏకగ్రీవమై టీఆర్ఎస్ ఖాతాలో పడగా, మంగళవారం నాడు 5 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో ఆ సంఖ్య 11కు చేరింది. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరవ వార్డు లో దామెర మొగిలి, ఏడవ వార్డులో నల్లెల జ్యోతి, తొమ్మిదో వార్డులో కోడూరి మల్లేశం, 10వ వార్డులో పసుల లావణ్య, పన్నెండవ వార్డులో బండి రాణి ఏకగ్రీవమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో మంగళవారం అధికారులు ప్రకటించిన వివరాల మేరకు... వివిధ మున్సిపాలిటీల వారీగా... సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 5, 19, 36 వార్డులలో, వేములవాడ మున్సిపాలిటీలోని 6వ వార్డులో, సత్తుపల్లి మున్సిపాలిటీలో 4, 5, 8, 18 వార్డులలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన వాంకుడోతు వీరన్న 5వ వార్డు నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. మరిపెడ మున్సిపాలిటీ 9వ వార్డులో, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి, వికారాబాద్ మున్సిపాలిటీలో 14, 25 వార్డులలో, దుబ్బాక మున్సిపాలిటీ 12వ వార్డులో, హుస్నాబాద్ మున్సిపాలిటీలోని 13, 15 వార్డులలో ఏకగ్రీవమయ్యారు. కోస్గి మున్సిపాలిటీలో 10వ వార్డులో, సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీలోని 6, 12 వార్డు లు, సదాశివపేట మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ 7వ వార్డులో, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీ 28వ వార్డులో జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో 26, 29 వార్డులను, ర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డులో, బాన్సువాడ మున్సిపా లిటీ 4వ వార్డులో, చెన్నూర్ మున్సిపాలిటీ 2, 5, 18 వార్డు ల్లో, నిర్మల్ మున్సిపాలిటీ 10వ వార్డులో, టీఆర్ఎస్ పక్షాన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భైంసా మున్సి పాలిటీ 16వ వార్డులో ఎంఐఎం నుంచి ముంతాజ్ ఏకగ్రీవమయ్యారు. -
మృగాళ్లకు ఇక మరణ శాసనమే
సాక్షి, అమరావతి: దేశంలో మొట్టమొదటిసారి మహిళలు, బాలి కల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చారి త్రాత్మక ‘ఆంధ్రప్రదేశ్ దిశ’ బిల్లుకు ఏపీ శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మహిళలు, బాలికలపై అత్యా చారాలు వంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే వారికి మరణ శాస నం లిఖించేలా, 21 పనిదినాల్లోనే తీర్పు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ లా చట్టం– 1973ను ఏపీకి వర్తింపచేయడంతోపాటు, అందులో అవసరమైన సవరణల చేస్తూ రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–క్రిమినల్ లా (సవరణ) బిల్లు–2019’ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. అలాగే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా.. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా మహిళల్ని వేధించడం, అసభ్య పోస్టింగులు పెడితే రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకూ జైలు శిక్ష విధించేలా ఈ చట్టంలో కొత్త సెక్షన్లను చేర్చారు. అలాగే మహిళలు, బాలలపై నేరాల్ని త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటునకు వీలు కల్పించే ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం– మహిళలు, బాలలపై నిర్ధేశిత నేరాల విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు–2019’కు కూడా సభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులను శుక్రవారం శాసనసభలో హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టగా.. చర్చలో పాల్గొన్న అధికార, ప్రతిపక్ష సభ్యులంతా మద్దతు పలికారు. అనంతరం సభ్యుల హర్షధ్వానాల బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ‘ఆంధ్రప్రదేశ్ దిశ’ చట్టం, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు చట్టంలోని ముఖ్యాంశాలు ►నిర్భయ చట్టం ప్రకారం అత్యాచార కేసుల్లో జైలు లేదా ఉరిశిక్ష విధిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంతో అత్యాచారాలకు పాల్పడిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష అమలు చేస్తారు. ►నిర్భయ చట్టంలోని సెక్షన్ల ప్రకారం 2 నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి మరో 2 నెలల్లో శిక్ష పడేలా చూడాలి. మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. ‘ఏపీ దిశ’ చట్టంలో 4 నెలల సమయాన్ని 21 పనిదినాలకు కుదించారు. ►అత్యాచారం వంటి దురాఘతాలకు పాల్పడినప్పుడు విస్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభిస్తే.. 21 పనిదినాల్లో నిందితుడికి మరణశిక్ష పడాలి. ఏడు పనిదినాల్లో పోలీసు దర్యాప్తు పూర్తికావాలి. 14 పనిదినాల్లో న్యాయప్రక్రియ పూర్తి చేసి శిక్ష విధించాలి. ►పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఇప్పటి వరకూ పోక్సో చట్టం కింది ఏడాదిలోగా న్యాయప్రక్రియ పూర్తిచేయాలి. అయితే దిశ చట్టం ప్రకారం 7 పని దినాల్లో దర్యాప్తు, 14 పనిదినాల్లో న్యాయ విచారణ పూర్తిచేయాలి. ►పిల్లలపై లైంగిక నేరాలన్నింటికీ శిక్షల్ని పెంచారు. ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులకు ప్రస్తుతం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకూ శిక్ష అమల్లో ఉంది. నేర తీవ్రతను బట్టి ఆ శిక్షను గరిష్టంగా జీవిత ఖైదుగా మార్చారు. ఇందుకోసం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో కొత్తగా సెక్షన్ 354(ఎఫ్)ను చేర్చారు. ►సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధించడం, వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ నిర్ధిష్టమైన శిక్షలు లేవు. అయితే దిశ చట్టం ప్రకారం మెయిల్స్ లేదా సోషల్ మీడియా లేదా డిజిటల్ మాధ్యమంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. మొదటిసారి రెండేళ్ల జైలు, రెండోసారి కూడా చేస్తే 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు గరిష్టంగా రూ. 5లక్షల వరకు జరిమానా విధించేలా ఐపీసీలో 354 (ఇ) సెక్షన్‌ను తీసుకొచ్చారు. దేశ చరిత్రలో తొలిసారి ప్రత్యేక కోర్టులు ఇంతవరకూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలో తొలిసారి మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు.. త్వరితగతిన విచారణ ప్రక్రియ ముగించేందుకు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ‘ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం– మహిళలు, బాలలపై నిర్ధేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు–2019’ను రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. ►అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, సోషల్‌మీడియా ద్వారా వేధించడం వంటి నేరాలు, పోక్సో పరిధిలోకి వచ్చే నేరాల్ని ఈ ప్రత్యేక కోర్టులు విచారిస్తాయి. ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువు.. కేంద్ర ప్రభుత్వ చట్టంలో 6 నెలలుగా ఉండగా.. ఇప్పుడు మన రాష్ట్రం పరిధిలో కేవలం 45 రోజులకు తగ్గించారు. ►మహిళలు, పిల్లలపై నేరాల సత్వర విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టుల్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇంతవరకూ ఎలాంటి ఏర్పాట్లు లేవు. కొత్త చట్టం ప్రకారం జిల్లా స్థాయిలో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ స్పెషల్ పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని కల్పించారు. ►మహిళలు, పిల్లలపై నేరాలు నమోదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిజిస్ట్రీని కొనసాగిస్తోంది. అయితే జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే ఎవరు ఏ నేరం చేశారన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అలాంటి డిజిటిల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా నేరాలకు సంబంధించిన వివరాలు ప్రజలందరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. -
ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. పోటీలో ఆయనొక్కడే ఉండడంతో.. ఎన్నిక ఏకగ్రీవంగా అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నవీన్‌రావుకు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందచేశారు. ప్రకటన అనంతరం గన్‌పార్క్ వద్దగల అమరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మహమూద్ అలీ పాల్గొని.. అయనకు అభినందనలు తెలిపారు. కాగా తెలంగాణ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్‌కు సభ్యులు తక్కువగా ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్కు సంపూర్ణమైన మెజార్టీ ఉండడంతో ఎన్నిక జరగకుండానే ఏకగ్రీవంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, నవీన్‌రావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఖాళీ ఏర్పడటంతో నవీన్‌రావును ఎంపిక చేశారు. త్వరలో ఖాళీ కానున్న 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గుత్తాకు అవకాశం ఇస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు. -
ఇరవై ఏళ్లుగా వారే సర్పంచ్‌లు
సాక్షి, మునుగోడు : ఒకప్పుడు ఇతర గ్రామపంచాయతీ పరిధిలో కచలాపురం గ్రామం 1994లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఆనాడు నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి ఆ గ్రామంలోని ప్రజలు అందరూ కలిసి సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలా గ్రామస్తులు అందరి ఆమోదంతో సర్పంచ్‌గా ఎన్నికైన ఆ వ్యక్తి వారికి అవసరమైన సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాడు. దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ కుటుంబానికే ఆ గ్రామ ప్రజలు అండగా నిలుస్తున్నారు. అలా గత నాలుగు పర్యాయాలుగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తలు సర్పంచ్‌గా ఎన్నికవుతున్న ఆ గ్రామం పేరు కచలాపురం. ఆ గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ అయిన ఒక మారు తప్పా మిగిలిన ప్రతి ఎన్నికల్లో జనరల్ వస్తే భర్త, మహిళ వస్తే భార్య బరిలో నిలిచి సర్పంచ్ పదవిని పొందుతున్నారు. 1994లో జీపీగా ఏర్పాటు... మండలంలోని కచలాపురం గ్రామం 1994 వరకు సింగారం గ్రామ పంచాయతీలో కలసి ఉండేది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో 500లకు పైగా జనాభా కలిగిన కచలాపురం గ్రామాన్ని కూడా అధికారులు నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నూతన పంచాయతీగా ఏర్పాటైన మరుసటి ఏడాది 1995లో మొదటి ఎన్నికలు నిర్వహించగా సర్పంచ్ జనరల్ స్థానం రిజర్వ్ కాగా గ్రామస్తులు అందరూ కలిసి సీపీఐకి చెందిన గుర్జ రామచంద్రాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత తిరిగి 2001లో బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అతడి భార్య గుర్జ అరుణని బరిలో నిలుపగా ఆమె గెలుపొందింది. ఆ పదవి కాలం ముగిసి 2006లో ఎన్నికలు రాగా అప్పుడు ఆ గ్రామం ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో రామచంద్రం బలపరిచిన సీపీఐ నాయకుడు పెద్దమామిడి వెంటకయ్యని బరిలో నిలిచి గెలుపొందాడు. ఆ తరువాత గత 2013లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో రామచంద్రం పోటీలో నిలిచి గెలుపొందాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో అతడి భార్య అరుణ పోటీచేసి గెలుపొందింది. ఇలా వరుసగా ఆయన కుటుంబాన్ని గ్రామస్తులు సర్పంచ్‌గా ఎన్నుకొంటూ అండగా నిలుస్తున్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇవి... రామచంద్రం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి నిత్యం గ్రామంలోని ప్రజలకు అవసరమైన సేవలతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆయన 20 ఏళ్ల కాలంలో ఆ గ్రామంలోని ప్రజలకు అవసరమైన మంచి నీటి సరఫరాకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్‌తో పాటు వీధి, వీధికి మినీ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం సహాయంతో దాదపు 160 కుటుంబాలకు ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయించారు. ప్రతి వీధిలో మురికి కాల్వల నిర్మాణం, నూతనంగా పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రానికి భవన నిర్మాణంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ల నిర్మాణం చేయించారు. అంతే కాకుండా దళిత కాలనీలో ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేయించాడు. పలు ఉత్తమ అవార్డులు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్‌లకు ప్రభుత్వం ఉత్తమ అవార్డులు అందిస్తుంది. అలా కచలాపురం గ్రామానికి కూడా నాలుగు పర్యాయాలు నాలుగు అవార్డులు దక్కాయి. మొదటిసారి 1999లో జిల్లా ఉత్తమ గ్రామ అవార్డు, 2004లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, 2007లో రాష్ట్రపతి అవార్డు, 2018లో ఉత్తమ స్వచ్ఛభారత్ అవార్డులు లభించాయి. సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆ కుటుంబం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందునే ప్రతిసారి ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇతర గ్రామాల ప్రజలు రామచంద్రం వల్లే తమ గ్రామాల్లోని సర్పంచ్‌లు పనిచేస్తే బాగుండని అంటున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ.. మా గ్రామ సర్పంచ్ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటారు. అందుకే ప్రజలు అందరూ ఆయననే సర్పంచ్‌గా కావాలని కోరుకుంటారు. గ్రామంలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా తన సమస్యగా భావించి దాని పరిష్కారానికి చొరవ చూపుతాడు. అదే విధంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటాడు. – ఎన్. వెంకట్‌రెడ్డి, గ్రామ యువకుడు సేవ చేయడంలో ఆనందం గ్రామ ప్రజలకు సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. అందుకే ప్రజా ప్రతినిధిగా పనిచేయాలని ఉంటుంది. నేను చేసిన సేవకు ఫలితంగా మా గ్రామ ప్రజలు నాకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంటారు. వారి ఇష్టాలకు అనుగుణంగా గ్రామంలోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తాను. నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. – గుర్జ రామచంద్రం, మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త -
ఏపీ శాసనమండలి చైర్మన్‌గా ఎంఏ షరీఫ్ ఏకగ్రీవం
-
ఏకగ్రీవంగా రామగుండం మున్సిపల్ ఎన్నికలు
-
రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
చండీగఢ్: జాట్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులకు హరియాణా ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. విద్యా, ఉద్యోగరంగాల్లో జాట్లు సహా మరో ఐదు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో జాట్లకు బీసీ జాబితాలోనే మరో కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించే అంశానికి పూర్తి ఆమోదం లభించింది. జాట్, సిక్కు జాట్, రాడ్, మౌలా జాట్, త్యాగి, బిష్ణోయ్ కులాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ బిల్లును ఆమెదించింది. మంగళవారంనాడు అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఈ బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సభ ఆమోదాన్ని పొందింది. దీంతో జాట్ వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కాగా ఏప్రిల్ 3లోగా తమను బీసీజాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు డెడ్ లైన్ విధించడంతో ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేసింది. -
ఆపరేషన్ క్లీన్‌స్వీప్‌తో దూసుకెళ్తున్న కారు
-
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
-
నేటికీ అందని నజరానా..
మార్కాపురం : ‘ఎన్నికలు జరగకుండా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందజేస్తాం.. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రజల మధ్య స్నేహభావం కూడా పెంపొందుతుంది..’ ఈ మాటలు అన్నది సాక్షాత్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి. పంచాయతీల సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నకుంటే ప్రోత్సాహ కాలు అందజేస్తామని, తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాదు గ్రామీణుల మధ్య వివాదాలు ఉండవని, అంతా స్నేహపూర్వకంగా మెలుగుతారని సీఎం చెప్పుకొచ్చారు. ఇంకేముంది జిల్లాలో కొన్ని పంచాయతీల సర్పంచ్‌లను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు పూర్తయి 11 నెలలు దాటినా నిధులు విడుదల చేయకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. = రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సాహక నిధులు విడుదల చేయకపోవటంతో సర్పంచ్‌ల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. = దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో నోటిఫైడ్ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 5 లక్షలు విడుదల చేశారు. = ఆ నిధులతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. = గత ఏడాది జూలైలో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా మొత్తం మీద 1028 గ్రామ పంచాయతీలుండగా అందులో 125 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = మార్కాపురం డివిజన్లో 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, భూమి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, సీనరేజీ ద్వారా మాత్రమే ఆదాయం వస్తోంది. = సర్పంచ్‌లుగా ఎన్నికై నెలలు కావస్తున్నా ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా జాప్యం చేయటంతో పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందని ఏకగ్రీవ సర్పంచ్ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. = 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ జనాభా నిష్పత్తి ఆధారంగా కేటాయిస్తారు. ఈ నిధులను ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేస్తోంది. = అరకొర నిధులతో ఆశించిన స్థాయిలో పంచాయతీల్లో అభివృద్ధి జరగడం లేదు. = మార్కాపురం మండలం ఇడుపూరు, గోగులదిన్నె గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = కొనకనమిట్ల మండలం వింజవర్తిపాడు, నాగరాజుకుంట, నాగిరెడ్డిపల్లె, సిద్ధవరం, నాగంపల్లి, కాట్రగుంట, తువ్వపాడు, బచ్చలకూరపాడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = పొదిలి మండలం అన్నవరం, ఈగలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం, ఓబులక్కపల్లె, పాములపాడు, తలమళ్ల, సూదనకుంట, జువ్వలేరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. = పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం, మల్లాపాలెం ఏకగ్రీవమయ్యాయి. ప్రొత్సాహక నిధులు ఇస్తే ఏకగ్రీవ పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, వేసవిలో తాగు నీటి ఎద్దడి నివారణకు డీప్‌బోర్ల ఏర్పాటు, డ్రైనేజీలు నిర్మించుకునే అవకాశం ఉందని సర్పంచ్‌లు చెబుతున్నారు. = ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనైనా ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు. నిధులు విడుదల చేయాలి : రామాంజులురెడ్డి, ఇడుపూరు ఏకగ్రీవ సర్పంచ్ మా గ్రామ ప్రజలు సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ ప్రొత్సాహక నగదు విడుదల చేయలేదు. ఆ నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రొత్సాహక నిధులు విడుదల చేయాలి. -
‘ఏకగ్రీవమే..!
వంగర, న్యూస్‌లైన్: ఉత్కంఠ నెలకొన్నా.. కొట్టిశ మత్స్యకార సొసైటీ ఎన్నిక ప్రశాం తం గా జరిగింది. కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కొసమెరుపు. ఓ వర్గం చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకుంది.కొట్టిశలోని శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఎన్నికల అధికారి మాచర్ల దివాకరరావు ఆధ్వర్యంలో తొమ్మిది మంది డెరైక్టర్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ, ఎన్నిక సాఫీగా సాగిపోయా యి. తొలుత తొమ్మిది స్థానాలకు 18 నామినేషన్లు దాఖలయ్యాయి. వారిలో ఒకరు ఉపసంహరించుకున్నారు. మిగిలిన 17 మందిలో ఒక వర్గానికి చెందిన తొమ్మిది మంది, మరో వర్గానికి చెందిన ఎనిమిది బరిలో నిలిచారు. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఓ వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎన్నికల కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో బరిలో నిలిచిన తొమ్మిది మందికి గాను 8 మంది అభ్యర్థులను..చేతులెత్తే పద్ధతిన సభ్యులు ఎన్నుకున్నారు. కాస్త అయోమయం వంగర డెరైక్టర్ ఎన్నిక సమయంలో గ్రామస్తుల మధ్య కొంతసేపు అయోమయం నెలకొంది. తమ పేరేప్రతిపాదించాలంటూ..ఇద్దరు వ్యక్తులు ముందుకు రావడంతో..కాస్త ఇ బ్బందికర పరిస్థితి తలెత్తింది. దీంతో గ్రామస్తులంతా..ఒకే చోట కూర్చుని..అభ్యర్థిని నిర్ణయిం చుకోవడంతో సమస్య పరిష్కార మైంది. అయితే..ఆ డెరైక్టర్ పేరును ఇంకా ఖరారు చేయలేదు. 574 మంది ఓటర్లున్న ఈ సంఘంలో తొలుత ఎన్నికల్లో పాల్గొనేందుకు 329 మంది పేర్లు నమోదు చేసుకోగా..వారిలో 287 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. నూతన డెరైక్టర్లు వీరే... అధ్యక్షునిగా పెనుబోతు దుర్గారావు ఎన్నికయ్యారు. డెరైక్టర్లుగా మురగడాపు పోలిపల్లిదొర(పటువర్థనం), తాటిగూడ రామారావు(కొట్టిశ), పిల్లి సంజీవి(మరువాడ), బొండపల్లి సింహాచలం(గీతనాపల్లి), గుడివాడ సూరందొర(శ్రీహరిపురం) వంటల భూపతిదొర(కొండచాకరాపల్లి), సూరుమల్లి గురువులు(మగ్గూరు)లను ఏకగ్రీవంగా చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది గోపీకృష్ణ, శాంతారావు, నాగరాజు, రాజాం, కొత్తూరు సీఐలు శ్రీనివాస చక్రవర్తి, ఎన్.సాయి, వంగర, సంతకవిటి, జి.సిగడాం ఎస్సైలు అప్పలరాజు, భీమారావు, తులసీరావులతోపాటు వివిధ పోలీస్ స్టేషన్లుకు చెందిన 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫొటో: 11 ఆర్‌జెయం 61 చేతులెత్తి డెరైక్టర్లు,అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న మత్స్యకార సంఘ సభ్యులు ఫొటో: 11 ఆర్‌జెయం 61(ఎ)(బి): పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఫొటో: 11 ఆర్‌జెయం 61(సి) పెనుబోతు దుర్గారావు