రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
చండీగఢ్: జాట్‌ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులకు హరియాణా ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. విద్యా, ఉద్యోగరంగాల్లో జాట్లు సహా మరో ఐదు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో జాట్లకు బీసీ జాబితాలోనే మరో కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించే అంశానికి పూర్తి ఆమోదం లభించింది. జాట్, సిక్కు జాట్, రాడ్, మౌలా జాట్, త్యాగి, బిష్ణోయ్ కులాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ బిల్లును ఆమెదించింది. మంగళవారంనాడు అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఈ బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సభ ఆమోదాన్ని పొందింది. దీంతో జాట్ వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కాగా ఏప్రిల్ 3లోగా తమను బీసీజాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు డెడ్ లైన్ విధించడంతో ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేసింది.