passed
-
విలువలతో కూడిన వ్యాపారావేత్త 10 వేల కోట్ల నుంచి లక్షల కోట్లకు
-
దాతృత్వ శిఖరం కన్నుమూత
-
నిర్మాత వేణుగోపాల్ మృతి
‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్వీఎస్ వేణుగోపాల్(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్‌తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్ నిర్మించారాయన. ‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్. ‘తులసీదళం’ సీరియల్‌కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్‌గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
పొడగరి.. పదో తరగతి పాసయ్యాడు!
రాజాం/సంతకవిటి : ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడిని గుర్తుపట్టారా? సంతకవిటి మండలం తలతంపర గ్రామానికి చెందిన ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 19 ఏళ్లు. హార్మోణుల ప్రభావం కారణంగా ఎనిమిది అడుగుల ఎత్తు పెరిగాడు. చిన్న వయసులో పాఠశాలకు వెళ్లి చదువుకునే విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో స్వస్తి చెప్పాడు. ఉపాధి అవకాశాలు లేక.. స్థానికంగా పనులు దొరక్క అగచాట్లు పడుతుండేవాడు. అయితే ఈ యువకుడి అసాధారణంగా పొడవు పెరగడంపై ఏడాదిన్నర క్రితం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు షణ్ముఖరావు వివరాలు సేకరించారు. పదో తరగతి పూర్తి చేస్తే ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఓపెన్ విద్య ద్వారా పదో తరగతి చదివాడు. రెండు నెలల క్రితం పాలకొండ కేంద్రంగా పరీక్షలు రాశాడు. ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసయ్యాడు. సంబంధిత సర్టిఫికెట్‌ను షణ్ముఖరావుకు సంతకవిటి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు యు.రవిశంకర్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పొడగరి షణ్ముఖరావు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. -
ఆర్థిక బిల్లుకు ఆమోదం: లోక్‌సభ రేపటికి వాయిదా
సాక్షి,న్యూఢిల్లీ: 2018 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆర్థికబిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే 21 సవరణలు, 3 కొత్త క్లాజులతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను సప్లిమెంటరీ డిమాండ్లను సభ ఆమోదించింది. అనంతరం లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. కాగా ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, వివిధ సమస్యలపై పలు పార్టీలు ఆందోళన చేయడంతో లోక్‌సభ ఎనిమిదో రోజు కూడా అట్టుడికింది. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభను స్పీకర్ సుమిత్రామహాజన్ కొంతసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం ఫైనాన్షియల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో లోక్‌సభ స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. -
చర్చలేకుండానే ఆమోదం
భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఓకే - రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ డిమాండ్ - సభ్యుల ఆందోళనతో అట్టుడికిన సభ - వెల్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. అడ్డుకున్న మార్షల్స్ - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు–మార్షల్స్ మధ్య తోపులాట.. ఉద్రిక్తత - చర్చ లేకుండానే బిల్లు ఆమోదానికి మహమూద్ అలీ ప్రతిపాదన - ఆ వెంటనే బిల్లు ఆమోదం పొందినట్టు ప్రకటించిన స్పీకర్ - సభ నిరవధిక వాయిదా.. మండలిలో 5 నిమిషాల్లోనే ఆమోదం - ప్లకార్డులు ప్రదర్శించిన కాంగ్రెస్ సభ్యులు - బిల్లును ఆమోదించాలని చైర్మన్‌ను కోరిన మంత్రి హరీశ్ - ఆమోదం పొందినట్లు చైర్మన్ ప్రకటన.. సభ నిరవధిక వాయిదా సాక్షి, హైదరాబాద్: చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్య పట్టుమని పది నిమిషాల్లోనే బిల్లును పాస్ చేసింది. అటు శాసనమండలిలోనూ చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. శాసనసభ గతంలో ఆమోదించిన భూసేకరణ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించటంతో ప్రభుత్వం ఆదివారం ప్రత్యేకంగా అసెంబ్లీ, మండలి సమావేశం నిర్వహించింది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవగానే ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం మొదలైంది. నల్ల కండువాలు ధరించి హాజరైన కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి మినహా కాంగ్రెస్ సభ్యులందరూ తమ స్థానాల నుంచి లేచి నిలబడి నినాదాలు చేయటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు భూసేకరణ చట్ట సవరణల బిల్లుపై మాత్రమే మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని స్పీకర్ మధుసూదనాచారి కాంగ్రెస్ సభ్యులకు పలుమార్లు స్పష్టం చేశారు. తనకు మాట్లాడే అవకాశమివ్వాలని జానారెడ్డి కోరగా... కాంగ్రెస్ సభ్యులంతా ఎవరి స్థానాల్లో వారు వెళ్లి కూర్చుంటే అవకాశం కల్పిస్తామని స్పీకర్ బదులిచ్చారు. అయినా కాంగ్రెస్ సభ్యులు పట్టు వీడకుండా ఆందోళన కొనసాగించారు. దీంతో సవరణ బిల్లుపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌కు బదులుగా ఎంఐఎం పార్టీకి స్పీకర్ మొదటి అవకాశమిచ్చారు. వెంటనే కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పొడియం వైపు దూసుకు వెళ్లగా మార్షల్స్ అడ్డుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. బిల్లుపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీ చర్చను ప్రారంభించడంతో కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనను తీవ్రం చేశారు. ‘రైతులు చనిపోతుంటే ఎక్కడి బిల్... రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు చించి స్పీకర్ పోడియం వైపు విసిరేశారు. ఒకదశలో స్పీకర్ పొడియం ముందు కాంగ్రెస్ సభ్యులు, మార్షల్స్ మధ్య తోపులాట కొనసాగింది. కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ ఆగ్రహంతో మార్షల్స్‌ను తోసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్ ఆయన్ను వెనక్కి నెట్టేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం మార్షల్స్‌ను తోసివేసేందుకు ప్రయత్నించారు. మహిళా కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణతోపాటు పద్మావతిరెడ్డి పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా మార్షల్స్ అడ్డుకున్నారు. ఇదే సమయంలో.. చర్చ లేకుండానే భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రతిపాదించారు. బిల్లులో ప్రతిపాదించిన మూడు సవరణలకు విడివిడిగా స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించారు. అధికార పార్టీ, ఎంఐఎం మద్దతు తెలపడంతో భూసేకరణ చట్ట సవరణల బిల్లును సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించారు. ఆ వెంటనే టీఆర్ఎస్ సభ్యులు బల్లలు చరిచి సంబరాలు చేసుకున్నారు. ఆ మరుక్షణమే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం
-
భూసేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ, శాసనమండలిలలో భూసేకరణ చట్టసవరణ బిల్లు ఆమోదం పొందింది. శాసనసభలో విపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే కేవలం పది నిమిషాల్లో చట్ట సవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక శాసనమండలి మూడు నిమిషాల్లోనే ముగిసింది. ఆదివారం ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే.. సభ ప్రారంభం కాగానే రాష్ట్రంలో రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో బిల్లుపై ఎలాంటి చర్చ లేకుండానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేవారు. కీలకమైన బిల్లు విషయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వాయిదా అనంతరం కూడా కాంగ్రెస్ సభ్యులు సభలోనే ఉండి నిరసన కొనసాగించారు. -
రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
-
ఎట్టకేలకు చట్టం చేశారు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో హిందూ పెళ్లిళ్లు ఇక చట్టబద్దం కానున్నాయి. ఇందుకు సంబంధించిన 'ది హిందూ మ్యారేజ్ బిల్ 2017' బిల్లుకు పాకిస్తాన్ సెనేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2015లో నేషనల్ అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును సెనేట్ శుక్రవారం ఆమోదించింది. కాగా, ఈ బిల్లు వచ్చే వారం పాకిస్తాన్ అధ్యక్షుడి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. పాకిస్తానీ పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్క్వాలలో నివసిస్తున్న హిందువులు ఈ చట్టం వర్తించనుంది. సింధ్ ప్రావిన్సులో ఇప్పటికే హిందూ పెళ్లిళ్లకు ప్రత్యేక చట్టం ఉన్న విషయం తెలిసిందే. -
ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయండి
బాలాజీచెరువు : ఔట్సోర్సింగ్ ఏజన్సీల నుంచి ప్రభుత్వ విభాగాలు మూడేళ్లకు మించి పొరుగుసేవలను పొందరాదన్న జీఓ 151ను జిల్లా యంత్రాంగం అమలు చేయాలని ఔట్సోర్సింగ్ ఏజన్సీల సంఘం అధ్యక్షుడు ఎం.నారాయణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక జిల్లా ఉపాధి కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, జీఓ ప్రకారం జిల్లాలో వికాస సంస్థకు పొరుగు సేవలను అందించే అధికారం లేదన్నారు. 2013లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పొరుగు సేవల ప్రక్రియ ఎంపిక కాబడిన ఔట్సోర్సింగ్ ఏజన్సీల ద్వారా ఓపెన్ టెండర్ సిస్టమ్ ద్వారా జరిగి ఉండాలన్నారు. ఈ ప్రక్రియ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరగాలన్నారు. 2010 తరువాత వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయం గుర్తింపు లేకుండా సాగించిన పొరుగుసేవల కార్యకలాపాలు కోర్టు ధిక్కారమన్నారు. ఈ మేరకు ఎస్ఎస్ఏ పీవోకు వినతి పత్రం సమర్పించినట్టు ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ సభ్యులు వెంకట్, కమలాకర్, కిషోర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. ధృవపత్రాలు పరిశీలన జిల్లాలో పొరుగు సేవలను నిర్వహించేందుకు ఔట్సోర్సింగ్ ఏజన్సీల ఎంపేనల్మెంట్కు సంబంధించి ధృవపత్రాలను జిల్లా ఉపాధి అధికారిణి శాంతి ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ ఎంపానల్కు సంబంధించి 23 ఔట్సోర్సింగ్ ఏజన్సీలు నమోదయ్యాయి. ధృవపత్రాలు పరిశీలనలో జిల్లా లేబర్ ఆఫీసర్ ప్రకాశరావు, ట్రెజరీ అధికారి తదితరులు పాల్గొన్నారు. -
మరింత సమగ్రత అవసరం
మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లును రాజ్యసభ ఆమోదించి వారం గడవకుండానే ఒక దురదృష్టకరమైన ఉదంతం వెలుగులోకొచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని బెహ్రాం పూర్ మానసిక రోగుల ఆస్పత్రిలో గత ఆరునెలలుగా 65మంది రోగులను ఎలాంటి అచ్ఛాదనా లేకుండా దిగంబరంగా ఉంచుతున్నారని స్వచ్ఛంద సంస్థ ‘అంజలి’ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో ఆరోపించారు. అందుకు సంబం ధించి కొన్ని ఛాయాచిత్రాలను కూడా వారు విడుదల చేశారు. మన దేశంలో మానసిక అస్వస్థతకు గురైనవారి పట్ల ఎలాంటి అమానవీయ, నిర్లక్ష్య ధోరణులు రాజ్యమేలుతున్నాయో ఈ ఉదంతం రుజువు చేస్తున్నది. రాజ్యసభ ఆమోదించిన బిల్లు దాదాపు మూడు దశాబ్దాలనాటి మానసిక ఆరోగ్య చట్టానికి 134 సవరణలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించకుండా మాన సిక కుంగుబాటుగా తాజా బిల్లు గుర్తిస్తోంది. మానసిక రోగుల హక్కుల విష యంలో వివిధ దేశాల్లోని చట్టాలు అసంపూర్ణంగా ఉన్నాయని, వాటిని తక్షణం సవరించాలని 2007నాటి ఐక్యరాజ్యసమితి ఒడంబడిక సభ్య దేశాలకు నిర్దేశిం చింది. మన దేశంలో మరో ఆరేళ్లకు... అంటే 2013లోగానీ దానికి అనుగుణమైన బిల్లు రూపొందలేదు. ఆ తర్వాత రాజ్యసభ ఆమోదం పొందడానికి మరో మూడేళ్లు పట్టింది. 1987నాటి చట్టం ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అందువల్ల మానసిక రోగుల సంక్షేమం, చికిత్స వంటి అంశాల్లో అడుగడుగునా నిర్లక్ష్యం ఏర్పడుతున్నదని ఎన్నో ఏళ్లుగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. సమితి ఒడంబడికకు అనుగుణంగా ఆ చట్టాన్ని సవరించా లని కోరుతున్నాయి. ఏమైతేనేం ఇన్నాళ్లకు ఆ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ఈ బిల్లు చరిత్రాత్మకమైనదని దాదాపు అన్ని పక్షాల ఎంపీలు కొనియాడారు. ఇదింకా లోక్‌సభ ఆమోదం కూడా పొందవలసి ఉంది. వలస పాలకుల కాలంలో 1912లో తొలిసారి ఉన్మాద రోగుల చట్టం తీసు కొచ్చారు. 1987లో దాని స్థానంలో మానసిక ఆరోగ్య చట్టం వచ్చింది. అయితే అంతకు ముందున్న చట్టమైనా, 1987నాటి చట్టమైనా మౌలికంగా మానసిక రోగుల చికిత్స, వారిని ఆస్పత్రిలో చేర్చుకోవడం, డిశ్చార్జి చేయడం, మానసిక చికిత్సాల యాల క్రమబద్ధీకరణ వంటి అంశాలపైనే కేంద్రీకరించాయి. మానసిక రోగుల కుండే హక్కులు, వారిపై వివక్ష ప్రదర్శించి ఆ హక్కులకు భంగం కలిగించిన సందర్భాల్లో తీసుకోదగిన చర్యలేమిటన్న విషయాల్లో ఆ రెండు చట్టాలూ మౌనం పాటించాయి. తాజా బిల్లు అనేక అంశాల్లో మెరుగ్గానే ఉన్నా అది పట్టించుకోకుండా వదిలేసిన ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. రోగుల పేదరికం, వారిచుట్టూ ఉండే పరిసరాలు, ముఖ్యంగా వ్యక్తుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థితిగతులు వంటి విషయాలపై ఇది దష్టి పెట్టలేదు. మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసినవారిపై చర్యలకు సంబంధించిన ప్రస్తావన లేదు. అస్వస్థతపై చూపిన శ్రద్ధ, దాని నివారణ తదితరాలపై లేదు. ఒక ఇంట్లో మానసిక రోగి ఉన్నప్పుడు అలాంటివారితో వ్యవ హరించాల్సిన తీరుపై ఆ కుటుంబంలోని వారికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. కొన్ని సందర్భాల్లో వారికి సైతం చికిత్స అవసరం ఉంటుంది. మన సంస్కతి, సామాజిక స్థితిగతులు ఎలాంటివంటే... కుటుంబంలో ఎవరి మానసిక స్థితి అయినా సరిగాలేని పక్షంలో వారికి చికిత్స ఇప్పించడం కంటే ఆ సంగతి వెల్లడి కాకూడదని కోరుకుంటారు. వారు ఎవరి కంటా పడకూడదనుకుంటారు. మానసిక అస్వస్థత ఉన్నదని తెలిస్తే కుటుంబాన్ని ఇరుగు పొరుగు చిన్నచూపు చూస్తారని, హేళన చేస్తారని వారి భయం. రోగులకు ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ(ఈసీటీ) ఇవ్వడం వారి శ్రేయస్సురీత్యా మంచిదికాదని, దాన్ని నిషేధించాలని అంతర్జాతీయంగా నిపుణులు చెబుతున్న మాట. బిల్లు దాని జోలికి వెళ్లలేదు. అలాగే మానసిక రోగుల సంరక్షకుల నియా మకం, వారి హక్కులు, బాధ్యత వంటి అంశాల గురించి ఇందులో లేదు. మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకుండే హక్కులకు సంబంధించి 2014లో రూపొందిన బిల్లులో దీని ప్రస్తావన ఉంది. ఆ బిల్లు ఇంకా పార్లమెంటు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. ఆ అంశాలను ప్రస్తుత బిల్లులో చేర్చి ఉంటే మరికాస్త సమగ్రత వచ్చేది. చట్టం అమలులో నిర్లక్ష్యం వహించినా, మానసిక రోగుల హక్కుల్ని ఉల్లంఘించినా ఆర్నెల్ల వరకూ జైలు, రూ. 10,000 వరకూ జరిమానా విధించవచ్చునని బిల్లు నిర్దేశిస్తున్నది. అయితే వీటిని అంశాలవారీగా నిర్దిష్టంగా పేర్కొని ఉంటే సబబుగా ఉండేదని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. అలాంటి నిర్దిష్టత ఉన్నట్టయితేనే బెంగాల్ ఆస్పత్రిలో జరిగినలాంటి ఉదంతాలను నివారించడానికి వీలవుతుంది. అస్వస్థతకు ఎలాంటి చికిత్స అవసరమనుకుంటున్నారో రోగులు నిర్ణయించు కోవచ్చునని బిల్లు చెబుతోంది. వారు ఆ స్థితిలో లేరనుకుంటే ఆ సంగతిని నిపు ణులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. తమపట్ల అమానవీయంగా ప్రవర్తించడం, అందరితో సమంగా చూడకపోవడంవంటి అంశాల్లో ఫిర్యాదు చేసే వీలుంటుంది. మానసిక రోగులను మెట్రోలో ప్రయాణించడానికి అనుమతించబోమని ఢిల్లీ మెట్రో రైలు సంస్థ నిబంధన పెట్టడంపై మూడు నెలలక్రితం తీవ్ర విమర్శలొ చ్చాయి. తాజా బిల్లు చట్టమైతే ఇలాంటి నిబంధనలకు ఆస్కారం ఉండదు. మన దేశంలో మానసిక రోగులు పదిమంది ఉంటే వారిలో ఒక్కరికి మాత్రమే చికిత్స లభిస్తున్నదని ఈమధ్య అంతర్జాతీయ వైద్య జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. దేశంలో దాదాపు 10 శాతంమంది జనాభా వివిధ రకాలైన మానసిక అస్వస్థతకు గురవుతున్నట్టు అది తెలిపింది. ఇందులో మానసిక కుంగుబాటు మొదలుకొని మాదకద్రవ్యాల వాడకం వరకూ ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో మూడోవంతు మంది మానసిక రోగులు భారత, చైనాల్లో ఉన్నారు. వీరిలో మహిళలే అధికం. అభివద్ధి చెందిన దేశాల్లోని రోగుల సంఖ్యతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ మన దేశంలో సగటున పది లక్షలమందికి ముగ్గురు మాత్రమే మానసిక వైద్య నిపుణులున్నారు. ఈ స్థితి మారాలి. లోక్‌సభలో చర్చకొచ్చినప్పుడైనా బిల్లులో ప్రస్తావనకు రాని కీలకాంశాలను చేర్చి దానికి మరింత సమగ్రత తీసుకురావాలి. -
మెటర్నిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 సవరణ బిల్లును గురువారం రాజ్యసభలో ఆమోదించింది. ఈ బిల్లును కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బిల్లుపై చర్చించిన రాజ్యసభ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే కేబినేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు శీతాకాల సమావేశాల్లోనే లోక్ సభలో ఆమోదానికి వెళ్లే అవకాశం ఉంది. బిల్లుతో లాభాలు: 1. మెటర్నిటీ లీవ్ కింద ఇప్పటివరకూ అమల్లోవున్న 12వారాల సెలవు పరిమితి 26వారాలకు పెరగనుంది. 2. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లలో పనిచేస్తున్న మహిళలకు ఈ బిల్లు వర్తిస్తుంది. 3. ఇద్దరూ లేదా ఎక్కువ మంది పిల్లలు ఉన్న మహిళలకు ఈ సెలవు దినాలు వర్తించవు. 4. ఇంటి నుంచి పనిచేసే మహిళలకు కూడా వర్తించే విధంగా బిల్లును సవరించారు. -
టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత
♦ పేపర్-1లో 40.89 శాతం ♦ పేపర్-2లో 22.15 శాతం ♦ జిల్లాకు ఐదు, పదో ర్యాంకులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రెండు పేపర్లలోనూ నిరాశాజనకమైన ఫలితాలు రావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా టెట్ పరీక్షకు 29,193 మంది హాజరు కాగా.. 7,524 మంది అర్హత సాధించారు. పేపర్-1 కేటగిరీ నుంచి 5,644 మంది పరీక్ష రాయగా.. 2,308 మంది మాత్రమే క్వాలిఫై అయి 40.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో రాష్ట్రంలో జిల్లా ర్యాంకు పదో స్థానానికి పడిపోయింది. అదేవిధంగా పేపర్-2 కేటగిరీలో 23,549 మంది పరీక్ష రాయగా.. 5,216 మంది పాసై 22.15శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో జిల్లా ర్యాంకు తొమ్మిదిలో నిలిచింది. జిల్లాకు 5, 10 ర్యాంకులు టెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు మెరిశారు. పేపర్-1లో మందె శివరామకృష్ణ 131 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో ఐదో ర్యాంకు, గంగుల గౌతమ్‌కుమార్‌రెడ్డి 128 మార్కులు సాధిం చి 10వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. పేపర్-2లో తూము స్రవంతి 122 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. -
లోక్‌సభలో 'నీర్జా'కు నీరాజనాలు
న్యూఢిల్లీ: విమానాల హైజాకింగ్ వ్యతిరేక బిల్లు 2014 (యాంటీ హైజాకింగ్ లా)కు లోక్ సభలో సోమవారం ఆమోద ముద్ర పడింది. సవరించిన ఈ బిల్లు ప్రకారం విమానాల హైజాకింగ్‌కు పాల్పడిన వారికి ఇకముందు మరణదండన విధిస్తారు. బిల్లుపై చర్చ సందర్బంగా హైజాకర్లు కాల్చి చంపిన నీర్జా భానోత్ కు సభ్యులు నీరాజనాలు పలికారు. ఈ బిల్లు పైగా చర్చ సందర్భంగా 1986 లో హైజాక్ విమానంలో మరణించిన పాన్ ఏఎం ఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ సాహసాన్ని సభ్యులు కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంకోసం ఆమె తన జీవితాన్ని పణంగా పెట్టారని ప్రశంసించారు. ఆమె ఒక సాహసోపేత మహిళ అనీ, ఆమె తెగువపై బాలీవుడ్ లో ఇటీవల చిత్రం కూడా విడుదలైందని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ బీఎన్ గౌడ్ బిల్లును సమర్ధిస్తూ మాట్లాడుతూ.. బాధితులకు నష్టపరిహారం అందించేలా పటిష్టయైన వ్యవస్థను రూపొందించాలన్నారు. అమెరికాకు చెందిన పాన్ ఏఎం కంపెనీ ఇప్పటికీ భారత సిబ్బందికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. నీర్జా భానోత్ , సీనియర్ అటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ముంబై -న్యూ యార్క్ పాన్ ఏఎం విమానాన్ని కరాచీలో ఉగ్రవాదులు హైజాక్ చేశారు. సెప్టెంబర్ 5, 1986 లో ప్రయాణీకులను కాపాడే క్రమంలో ఉగ్రమూకల తూటాలకు నిర్జా బలి అయ్యారు. ఆమె ధైర్యసాహసాలకుగాను భారతదేశం అత్యున్నత శాంతి సేనా పురస్కారం అశోక్ చక్ర ప్రకటించింది. కాగా ఇంతకుముందు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ ఇటీవల ఆమోద ముద్ర వేసినసంగతి తెలిసిందే. -
రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
చండీగఢ్: జాట్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్న ఆందోళనకారులకు హరియాణా ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరిస్తామన్న హామీని నిలబెట్టుకుంది. విద్యా, ఉద్యోగరంగాల్లో జాట్లు సహా మరో ఐదు కులాలకు రిజర్వేషన్లు వర్తింపజేసే కీలక బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో జాట్లకు బీసీ జాబితాలోనే మరో కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించే అంశానికి పూర్తి ఆమోదం లభించింది. జాట్, సిక్కు జాట్, రాడ్, మౌలా జాట్, త్యాగి, బిష్ణోయ్ కులాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ బిల్లును ఆమెదించింది. మంగళవారంనాడు అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 31తో ముగియనుండటంతో ఈ బిల్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సభ ఆమోదాన్ని పొందింది. దీంతో జాట్ వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కాగా ఏప్రిల్ 3లోగా తమను బీసీజాబితాలో చేర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జాట్లు డెడ్ లైన్ విధించడంతో ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులు వేసింది. -
గృహహింస నిరోధక చట్టానికి చైనా ఆమోదం!
ఎట్టకేలకు చైనాలో గృహహింస నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. గృహ హింసకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించేలా జాతీయ చట్టాన్ని తేవాలంటూ కొన్నేళ్ళుగా అఖిలచైనా మహిళా సమాఖ్య చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. శాసన ప్రణాళికలో బిల్లును చేర్చాలన్న ప్రతిపాదన తుదిరూపం దాల్చింది. అయితే ఈ చట్టంలో గే జంటలకు మాత్రం రక్షణ కల్పించలేదు. గతంలో చైనాలో గృహహింస నిరోధానికి సంబంధించిన ప్రత్యేక చట్టం లేదు. సంప్రదాయ చైనా సంస్కృతిలో తరచూ ఉత్పన్నమౌతున్న కుటుంబ హింసను నివారించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అయితే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ఈ కొత్త చట్టం.. మానసిక, శారీరకమైనదే కాక, ఏ రూపంలోని గృహ హింసనైనా నిషేధించేట్టుగా రూపొందించారు. అయితే వివాహిత మహిళల్లో పావు భాగం గృహ హింసకు గురౌతున్నట్లు కమ్యూనిస్ట్ పార్టీ సారధ్యంలోని చైనా మహిళా సమాఖ్య లెక్కలు చెప్తుండగా... సంవత్సరానికి నలభైనుంచి, ఏభై వేల కంప్లైంట్లు మాత్రమే రిజిస్టర్ అవుతున్నాయి. గతేడాది రిజిస్టర్ అయిన కేసుల్లో తొంభై శాతం మహిళలు భర్తలవల్ల గృహం హింసకు గురైన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త చట్టం.. వివాహితులకు మాత్రమే కాక, సహజీవనం సాగించే వారికి కూడా వర్తించేట్టు రూపొందించారు. కుటుంబ సభ్యుల మధ్య, సహజీవనం సాగించే వారిమధ్య గృహ హింసకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటి శాసనసభా వ్యవహారాల కమిషన్ సభ్యుడు 'గౌ లిన్మావ్'... అన్నారు. ఈ చట్టం నిర్థిష్ట సమస్యలకోసం రూపొందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. కాగా 'గే' లకు ఈ చట్టం వర్తించదని, చైనాలో స్వలింగ సంపర్కులు అంతగా లేరని, వారి విషయంలో హింసకు ఎక్కడా ఉదాహరణలు లేవని అన్నారు. మరోవైపు చైనాలో స్వలింగ సంపర్కం అక్రమం కాకపోయినప్పటికీ నిషిద్ధమని, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కొద్దిశాతం గే కల్చర్ కనిపించినా.. అటువంటి స్వలింగ జంటలకు ఎటువంటి చట్టపరమైన రక్షణా లేదన్నారు. దేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసే అవకాశం కూడ లేదని గౌ లిన్మావ్ తెలిపారు. -
ప్రత్యేకహోదాపై అసెంబ్లీ తీర్మానం
మిగతా ఎజెండా పక్కనపెట్టి తీర్మానం చేయాలన్న వైఎస్సార్సీపీ ప్రశ్నోత్తరాలను చేపట్టాలని అధికారపక్షం బెట్టు పోడియం వద్ద నినాదాలతో హోరెత్తించిన ప్రతిపక్షం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ మంగళవారం చేసిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేకహోదా అంశంపై చర్చ అనంతరం సభా నాయకుడు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై శాసనసభ తీర్మానం చేయాలని రెండు రోజులుగా ప్రతిపక్షం పట్టుబట్టి ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రతిపాదించారు. అంతకుముందు ఈ అంశంపై జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. ప్యాకేజీకన్నా ప్రత్యేకహోదా ఏ రకంగా రాష్ట్రానికి మేలు చేస్తుందో తెలిపారు. కేంద్రం హోదా ఇవ్వాలనుకుంటే ఎలాంటి అడ్డంకులు లేవని సోదాహరణగా చెప్పారు. హోదా ఇవ్వడానికున్న మార్గాలను తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఈ అంశంపై మాట్లాడుతూ, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రం వద్ద తాము చేసిన ప్రయత్నాలను వివరించారు. ఈ చర్చలో అధికార టీడీపీ, మిత్రపక్ష బీజేపీ సభ్యులు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. హోదాతోపాటు పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తీర్మానం ప్రతిపాదించగా శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రెండో రోజూ విపక్ష సభ్యుల నిరసన... ప్రత్యేకహోదాపై తీర్మానం చేయాలని సోమవారం శాసనసభ ప్రారంభమైన తొలిరోజున డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ రెండోరోజు మంగళవారం కూడా అదే అంశంపై సభలో పట్టుబట్టింది. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ప్రత్యేకహోదా కోరుతూ అప్పటికే ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలియజేశారు. ప్రశ్నోత్తరాలు సహా మొత్తం ఎజెండాను పక్కనపెట్టి హోదాపై చర్చించాలని విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించారు. దాన్ని స్పీకర్ అంగీకరించకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియం ముందు నిలబడి నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టాల్సిందేనని అధికార పక్షం కోరింది. ఆ తర్వాత మిగతా అంశాలను తీసుకుందామని స్పీకర్ చెప్పినా, విపక్ష సభ్యులు పట్టువీడలేదు. సోమవారం ప్రశ్నోత్తరాలు జరగలేదని, మంగళవారం కూడా జరగకపోతే ఎలా? అని స్పీకర్ విపక్ష సభ్యులను ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యమైన అంశం ఉన్నందున వాయిదా వేయాలని కోరినా, స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో, ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు సహా ఎజెండా మొత్తాన్ని పక్కనబెట్టి ప్రత్యేకహోదా మీద చర్చ చేపడదామని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. 'ప్రత్యేకహోదా అంశం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని కోసం తాము చేస్తున్న పోరాటం వల్ల అధికార పక్షానికే ప్రయోజనం. రాజకీయాలకు అతీతంగా తాము ముందు వరుసలో నిలబడి ప్రత్యేకహోదా సాధనకు పోరాటం చేస్తున్నాం. సోమవారం మధ్యాహ్నం 1.30గంటలకు చర్చ మొదలుపెట్టి 2గంటలకు ముగిం చారు. సభ్యులకు ఇచ్చిన ప్రతు ల్లో ఉన్న అంశాలు కాకుండా ముఖ్యమంత్రి ఏదేదో మాట్లాడారు. ఇప్పుడే అన్ని అంశాలను పక్కనబెట్టి ముఖ్యమంత్రిని ప్రత్యేకహోదాపై ప్రకటన చేయమనండి. వెంటనే చర్చ చేపడదాం. ఆఖరున అరగంటలో ప్రకటన చేసి, చర్చ లేకుండా చే యాలని చూస్తున్నారు. అన్ని అంశాలను పక్కనబెట్టి నేరుగా ప్రత్యేకహోదాపై చర్చలోకి వెళదామా? లేక సమావేశాలను 15రోజులకు పొడిగిద్దామా? మీరే తేల్చండి' అని స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షం ఒత్తిడితో ఎట్టకేలకు చర్చ ప్రశ్నోత్తరాలు ఉండాల్సిందేనని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, బుచ్చయ్య చౌదరి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. ప్రత్యేకహోదా మీద చర్చ కోసం విపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం ముందు నిలబడి నినాదాలతో హోరెత్తించారు. సభ సజావుగా జరిగే అవకాశం లేకపోవడంతో 9.23గంటలకు సభను 15నిమిషాలపాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే మిగతా ఎజెండాను వాయిదా వేసి ప్రత్యేకహోదా అంశంపై చర్చను చేపట్టారు. చర్చ అనంతరం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రత్యేక హోదాపై తీర్మానం ఇదీ..తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. ప్రత్యేకహోదాపై శాసనసభలో చర్చ అనంతరం చివరలో సీఎం ఈ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం... ''ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించాలని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేయాలని 2014, ఫిబ్రవరి 20న అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానాలు... రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి కొరకు పన్ను రాయితీలు, నూతన రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, ఆర్థికలోటు భర్తీకి నిధుల విడుదల, 13వ షెడ్యూల్లోని విద్యాసంస్థల స్థాపన, ఇతర మౌలిక వసతుల కల్పన, చట్టంలోని సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం సహా అన్ని హామీలను అమలు చేయడం ద్వారా పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి సహాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తోంది.'' -
తెలంగాణ గాంధీ ఇక లేరు
-
తెలంగాణ గాంధీ ఇక లేరు
హన్మకొండలోని తన స్వగృహంలో కన్నుమూసిన భూపతి కృష్ణమూర్తి గాంధీతో కలసి దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధుడు హన్మకొండ: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 89 ఏళ్ల వయసున్న భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు తనకు మరణం లేదని పలుసార్లు వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజున ఆరోగ్యం సహకరించకున్నా.. అభిమానులతో సందడిగా గడిపారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యోధుడు.. భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న వరంగల్‌లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భ్రమరాంబ-రాఘవులు. 1942 నుంచి 1948 వరకు ఆయన వరంగల్ నగర కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. 1944 అక్టోబర్ 2న మహాత్మాగాంధీతో మహారాష్ట్రలోని వార్ధా ఆశ్రమంలో గడిపారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1946లో ఖాదీ బోర్డు ప్రచార కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కృష్ణమూర్తి... టి.హయగ్రీవచారితో కలిసి 1946 ఆగస్టు 11న వరంగల్ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఈ క్రమంలో నిజాం రజాకార్లు వీరిపై దాడి కూడా చేశారు. 1948లో గ్రంథాలయ ఉద్యమంలో భూపతి కృష్ణమూర్తి చురుకుగా పాల్గొన్నారు. 1949 నుంచి 1960 వరకు వరంగల్ నగర కాంగ్రెస్ సభ్యుడిగా చురుకైన పాత్ర పోషించారు. 1960 నుంచి 1986 వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగా కొనసాగిన ఆయన... ముల్కనూర్ కో ఆపరేటివ్ గ్రామీణ బ్యాంకు అధ్యక్షుడిగా 1970 నుంచి 1974 వరకు వ్యవహరించారు. వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా 1968 నుంచి 1972 వరకు పనిచేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శిగా, వరంగల్‌లోని ఏవీవీ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగానూ పనిచేశారు. వరంగల్ అసెంబ్లీ స్థానంలో నాలుగు సార్లు పోటీ చేశారు. కానీ ప్రతిసారి స్వల్పతేడాతో ఓటమి పాలై ద్వితీయ స్థానంలో నిలిచారు. తెలంగాణ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. భూపతి కృష్ణమూర్తి 1986లో ‘ప్రజాబంధు’ అవార్డు పొందారు. 2009 జనవరిలో ‘తెలంగాణ గాంధీ’ బిరుదు వరించింది. స్వాతంత్య్ర సమర కేసరి అవార్డును 2009లో అందజేశారు. అదే ఏడాది కాళోజీ అవార్డును కూడా అందుకున్నారు. సీఎం సంతాపం: తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఇటీవల వరంగల్ వెళ్లినప్పుడు ఆయనను పలకరించిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. భూపతి కృష్ణమూర్తి మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వ లాంఛానాలతో అంత్యక్రియలు: ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛానాలతో సోమవారం జరపనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరుకానున్నారు. అంతేకాకుండా,ఈ కార్యక్రమంలోపలువురు ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు, అధికారులు, పోలీసులు పాల్గొననున్నారు. -
అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు
ఊట్కూర్ : అశ్రునయనాలతో మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈనెల 6న మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి ఊట్కూర్‌లోని తన స్వగృహంలో బాత్రూమ్లో కిందపడ్డాడు. దీంతో అయన తలకు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లగా కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో బుధవారం తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచారు. భారీ సంఖ్యలో చేరుకున్న వారు ఆయన పార్థివదే హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి తమ పొలంలో ఖననం చేశారు. అంతకుముందు ఎల్లారెడ్డి పార్థివదే హాన్ని పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎస్.రాజేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీకే భరతసింహారెడ్డి, దయాకర్‌రెడ్డి, ఎర్ర శేఖర్, రాములు, జైపాల్‌యాదవ్, స్వర్ణసుధాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగపాండ్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, ‘పేట’, గద్వాల ఇన్చార్జీలు శివకుమార్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి; బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావునామాజీ, నింగిరెడ్డి, పద్మజారెడ్డి, కొండయ్య; టీడీపీ నాయకులు రమేశ్‌గౌడ్ తదితరులు పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది అభిమానులు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాగా ఎల్లారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహించింది. ఈ సందర్భంగా నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి తుపాకులను పేల్చారు. బాధిత కుటుంబసభ్యులను అన్ని విధాలా అదుకుంటామని రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. నిజాయితీకి ప్రతిరూపం ఎల్లారెడ్డి మహబూబ్‌నగర్ అర్బన్ : రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగినా పేదోడిగానే మిగిలిన ఎల్కొటి ఎల్లారెడ్డి నిజాయితీ, నిరాడంబతకు ప్రతిరూపమని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కీర్తించారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. ఎల్లారెడ్డి మరణం ప్రజాస్వామ్య రాజకీయాలకు తీరని లోటని, ఆయన తనకు మంచి మిత్రుడని అన్నారు. భగవంతుడు బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సంతాపం ప్రకటించారు. ఎల్లారెడ్డి మంచి నాయకుడు కల్వకుర్తి : మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి మంచి నాయకుడని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాసేవలో ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
కామ్రేడ్ సోమ రాజన్న కన్నుమూత
ఐదుసార్లు హత్యాయుత్నం నుంచి తప్పించుకున్న కామ్రేడ్ ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపకుల్లో ఒకరు అంతిమయాత్రకు తరలివచ్చిన నాయకులు నర్సంపేట : ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నేత సోమ రాజన్న(85) నర్సంపేట పట్టణంలోని తన స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వూధన్నపేట గ్రామానికి చెందిన వీరవ్ము, వెంకటయ్యు దంపతులకు ఏడుగురు సంతానం. నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో అందరికంటే పెద్దవాడైన రాజన్న 1954-55 కాలంలో కవుూ్యనిస్టు ఉద్యవూనికి ఆకర్షితుడై ఉవ్ముడి కవుూ్యనిస్టు పార్టీలో కొనసాగడంతోపాటు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత సీపీఐ(ఎం)లో పనిచేశారు. తదనంతరం 1984లో వుద్దికాయుల ఓంకార్‌తో కలిసి ఎంసీపీఐ(యూ)ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత పలువూర్లు వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. ఎంసీపీఐ(యూ)లో రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సహాయు కార్యదర్శిగా, వ్యవసాయు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లోనే హింసావాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన వ్యక్తిగా పేరుంది. పార్టీ నిర్మాణంలో పలువూర్లు ప్రత్యర్థులు చేసిన హత్యాయుత్నం దాడుల నుంచి తప్పించుకొని వుృత్యుంజయుుడిగా పేరు పొందాడు. కాగా, రాజన్నకు భార్య నర్సవ్ము, కువూరుడు రవి, కూతుళ్లు వెంకట్రాజవ్ము, అరుణ ఉన్నారు. కన్నీటి వీడ్కోలు... సోమ రాజన్న అనారోగ్యంతో వుృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయుకులు శుక్రవారం నర్సంపేటకు చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా, రాజన్న ఇంటి నుంచి ప్రారంభమైన అంతివుయూత్ర వుల్లంపల్లి రోడ్‌లోని మినీ స్టేడియుం వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి ఎండీ.గౌస్, పార్టీ జిల్లా కార్యదర్శి వుద్దికాయుల అశోక్, కేంద్ర కమిటీ నాయుకులు తాండ్ర కువూర్, గాదగోని రవి, సాంబయ్యు, వెంకన్న, కువూరస్వామి, కొత్తకొండ రాజవళి, వూషుక్, సురేందర్, వుల్లికార్జున్, యూదగిరి, కర్నె సాంబయ్యు, సదానందం, సీపీఎం నాయుకులు గాదె ప్రభాకర్‌రెడ్డి, పెద్దారపు రమేష్, సీపీఐ నాయుకులు అక్కపెల్లి రమేష్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయుకులు కోడి సోవున్న, తోటకూరి రాజు, ఆరెల్లి కృష్ణ, మోడం వుల్లేశం, ఆరె జైపాల్‌రెడ్డి, చారి, ప్రసాద్, దామెర నర్సయ్యు, నాగిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉదయాన్నే ఎందుకు నిద్రలేవాలి?
చదువులో ముందు... ఉదయం ఎక్కువ సమయం నిదురించేవారితో పోలిస్తే ఉదయాన్నే లేచేవారు పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. ఇలా మార్కులు సంపాదించడం మంచి ఉద్యోగాలు సంపాదించుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి దోహదపడుతుంది. ఉత్సాహం... వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సుదీర్ఘమైన లక్ష్యం ఏర్పచుకొని దానికోసం కృషి చేస్తుంటారు. సమస్యలను అంచనా వేయడం... భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే అంచనా వేయడం ద్వారా వ్యాపార ప్రపంచంలో విజయాలను సాధిస్తూ ఉన్నతస్థానాలకు చేరుకోగలరు. ప్రణాళికల కోసం సమయం... విశ్రాంతి తీసుకోడానికి, లక్ష్యాలు ఏర్పచుకోవడానికి, రోజువారీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం ఉంటుంది. కాబట్టి వారు విజయాలను సాధించడంలో కొంచెం ముందుంటారు. వ్యాయామం... వ్యాయామం చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. చాలామంది విజయం సాధించిన వ్యక్తులు ఉదయాన్నే లేచి వ్యాయామం చేసినట్లు చాలా విజయగాథలు చెబుతున్నాయి. అందుకని పిల్లలు కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకోవడం వలన లాభాలున్నాయి. రోజూ వ్యాయామం చేయడం వలన మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇది సరిగ్గా నిద్రపోవడానికి సహాయపడుతుంది. పనిలో ఒత్తిడిని ఎదుర్కోడానికి కూడా వ్యాయామం ఉపయోగపడుతుంది. మంచి నిద్ర... తొందరగా నిద్రపోవడం, తొందరగా నిద్రలేవడం వలన శరీరం కాలచక్రాలకు అలవాటు పడుతుంది. ఇలా అలవాటు పడడం వలన హాయిగా నిద్రపడుతుంది. సానుకూల ధోరణి... చాలా విషయాల్లో సానుకూలంగా వ్యవహరిస్తారు. ఏ విషయంలోనైనా తృప్తి చెందుతారు. నైతికభావాలు, అంగీకరించే స్వభావం కలిగి ఉంటారు. ఆలస్యంగా నిద్రలేచే వారితో పోలిస్తే వీరిలో సృజనాత్మకత కొంచెం ఎక్కువే. ఆలస్యంగా నిద్రలేచే వారిలో నిరుత్సాహం, నిరాశావాదం, మానసిక రోగులలో ఉండే లక్షణాలు కనిపిస్తుంటాయి. పాఠశాలలో మొదటిగంట... పాఠశాలకు తొందరగా వస్తారు. చాలావరకు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో ఎక్కువ సమయం... కుటుంబసభ్యులతో మాట్లాడుకోవడానికి, ఇంట్లో చిన్నచిన్న పనులు చేయడానికి సమయం ఉంటుంది. అన్ని పనులు ప్రణాళిక ప్రకారం చేసుకోవడం వలన పని ఒత్తిడి ఉండదు. ఆ కారణంగా సాయంత్రాలు కుటుంబసభ్యులతో హాయిగా కాలక్షేపం చేయవచ్చు. లక్ష్యాలు చేరుకోవచ్చు... ఉదయాన్నే లేవడం వలన లక్ష్యాలను చేరుకోవడానికి, అవసరమైన విషయాలు నేర్చుకోవడానికి సమయం ఉంటుంది. భవిష్యత్తులో ఎలా ఉండాలని ఆశిస్తారో, ఆ స్థాయిని చేరుకోగలుగుతారు. ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం వలన స్థిరత్వం ఏర్పడుతుంది. శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. అందుకే ఉదయాన్నే లేవడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాలను సులభంగా చేరుకోండి.