కామ్రేడ్ సోమ రాజన్న కన్నుమూత | Soma Rajanna is dead comrade | Sakshi
Sakshi News home page

కామ్రేడ్ సోమ రాజన్న కన్నుమూత

Published Sat, Dec 13 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM

కామ్రేడ్ సోమ రాజన్న కన్నుమూత

కామ్రేడ్ సోమ రాజన్న కన్నుమూత

ఐదుసార్లు హత్యాయుత్నం నుంచి తప్పించుకున్న కామ్రేడ్
ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపకుల్లో ఒకరు
అంతిమయాత్రకు తరలివచ్చిన నాయకులు

 
నర్సంపేట : ఎంసీపీఐ(యూ) వ్యవస్థాపక నేత సోమ రాజన్న(85) నర్సంపేట పట్టణంలోని తన స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. వూధన్నపేట గ్రామానికి చెందిన వీరవ్ము, వెంకటయ్యు దంపతులకు ఏడుగురు సంతానం. నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. వీరిలో అందరికంటే పెద్దవాడైన రాజన్న 1954-55 కాలంలో కవుూ్యనిస్టు ఉద్యవూనికి ఆకర్షితుడై ఉవ్ముడి కవుూ్యనిస్టు పార్టీలో కొనసాగడంతోపాటు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత సీపీఐ(ఎం)లో పనిచేశారు. తదనంతరం 1984లో వుద్దికాయుల ఓంకార్‌తో కలిసి ఎంసీపీఐ(యూ)ని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు.

ఆ తర్వాత పలువూర్లు వరంగల్ పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. ఎంసీపీఐ(యూ)లో రాష్ట్ర, కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర సహాయు కార్యదర్శిగా, వ్యవసాయు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లోనే హింసావాదాన్ని తీవ్రంగా ప్రతిఘటించిన వ్యక్తిగా పేరుంది. పార్టీ నిర్మాణంలో పలువూర్లు ప్రత్యర్థులు చేసిన హత్యాయుత్నం దాడుల నుంచి తప్పించుకొని వుృత్యుంజయుుడిగా పేరు పొందాడు. కాగా, రాజన్నకు భార్య నర్సవ్ము, కువూరుడు రవి, కూతుళ్లు వెంకట్రాజవ్ము, అరుణ ఉన్నారు.  
 
కన్నీటి వీడ్కోలు...
 
సోమ రాజన్న అనారోగ్యంతో వుృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయుకులు శుక్రవారం నర్సంపేటకు చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కాగా, రాజన్న ఇంటి నుంచి ప్రారంభమైన  అంతివుయూత్ర వుల్లంపల్లి రోడ్‌లోని మినీ స్టేడియుం వరకు కొనసాగింది. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి ఎండీ.గౌస్, పార్టీ జిల్లా కార్యదర్శి వుద్దికాయుల అశోక్, కేంద్ర కమిటీ నాయుకులు తాండ్ర కువూర్, గాదగోని రవి, సాంబయ్యు, వెంకన్న, కువూరస్వామి, కొత్తకొండ రాజవళి, వూషుక్, సురేందర్, వుల్లికార్జున్, యూదగిరి, కర్నె సాంబయ్యు, సదానందం, సీపీఎం నాయుకులు గాదె ప్రభాకర్‌రెడ్డి, పెద్దారపు రమేష్, సీపీఐ నాయుకులు అక్కపెల్లి రమేష్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయుకులు కోడి సోవున్న, తోటకూరి రాజు, ఆరెల్లి కృష్ణ, మోడం వుల్లేశం, ఆరె జైపాల్‌రెడ్డి, చారి, ప్రసాద్, దామెర నర్సయ్యు, నాగిశెట్టి ప్రసాద్ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement