ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయండి | government g.o passed | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయండి

Published Sat, Sep 24 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

government g.o passed

బాలాజీచెరువు :
ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల నుంచి ప్రభుత్వ విభాగాలు మూడేళ్లకు మించి పొరుగుసేవలను పొందరాదన్న జీఓ 151ను జిల్లా యంత్రాంగం అమలు చేయాలని ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల సంఘం అధ్యక్షుడు ఎం.నారాయణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక జిల్లా  ఉపాధి కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులు, జీఓ ప్రకారం జిల్లాలో వికాస సంస్థకు పొరుగు సేవలను అందించే అధికారం లేదన్నారు. 2013లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పొరుగు సేవల ప్రక్రియ ఎంపిక కాబడిన ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల ద్వారా ఓపెన్‌ టెండర్‌ సిస్టమ్‌ ద్వారా జరిగి ఉండాలన్నారు. ఈ ప్రక్రియ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరగాలన్నారు. 2010 తరువాత వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కార్యాలయం గుర్తింపు లేకుండా సాగించిన పొరుగుసేవల కార్యకలాపాలు కోర్టు ధిక్కారమన్నారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌ఏ పీవోకు వినతి పత్రం సమర్పించినట్టు ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్‌ సభ్యులు వెంకట్, కమలాకర్, కిషోర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 
 
ధృవపత్రాలు పరిశీలన
జిల్లాలో పొరుగు సేవలను నిర్వహించేందుకు  ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీల ఎంపేనల్‌మెంట్‌కు సంబంధించి ధృవపత్రాలను జిల్లా ఉపాధి అధికారిణి శాంతి ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఈ ఎంపానల్‌కు సంబంధించి 23 ఔట్‌సోర్సింగ్‌ ఏజన్సీలు నమోదయ్యాయి. ధృవపత్రాలు పరిశీలనలో జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ ప్రకాశరావు, ట్రెజరీ అధికారి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement