టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత | distict down fall in TET examinations | Sakshi
Sakshi News home page

టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత

Published Sat, Jun 18 2016 2:05 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత - Sakshi

టెట్ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత

పేపర్-1లో 40.89 శాతం
పేపర్-2లో 22.15 శాతం
జిల్లాకు ఐదు, పదో ర్యాంకులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రెండు పేపర్లలోనూ నిరాశాజనకమైన ఫలితాలు రావడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా టెట్ పరీక్షకు 29,193 మంది హాజరు కాగా.. 7,524 మంది అర్హత సాధించారు. పేపర్-1 కేటగిరీ నుంచి 5,644 మంది పరీక్ష రాయగా.. 2,308 మంది మాత్రమే క్వాలిఫై అయి 40.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో రాష్ట్రంలో జిల్లా ర్యాంకు పదో స్థానానికి పడిపోయింది. అదేవిధంగా పేపర్-2 కేటగిరీలో 23,549 మంది పరీక్ష రాయగా.. 5,216 మంది పాసై 22.15శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో జిల్లా ర్యాంకు తొమ్మిదిలో నిలిచింది.

 జిల్లాకు 5, 10 ర్యాంకులు
టెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు మెరిశారు. పేపర్-1లో మందె శివరామకృష్ణ 131 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి లో ఐదో ర్యాంకు, గంగుల గౌతమ్‌కుమార్‌రెడ్డి 128 మార్కులు సాధిం చి 10వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. పేపర్-2లో తూము స్రవంతి 122 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement