
సాక్షి, హైదరాబాద్: భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్‌ఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎ. జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. సమాఖ్యకు సీనియర్ ఉపాధ్యక్షులుగా ఆనందీశ్వర్ పాండే, ప్రదీప్ కుమార్ వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా ప్రీత్ సింగ్ నియమితులు కాగా సంయుక్త కార్యదర్శులుగా తేజ్‌రాజ్ సింగ్, బ్రిజ్‌కుమార్ శర్మ, ఎన్‌కే శర్మ, వీణ శేఖర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వినయ్ కుమార్ సింగ్ కోశాధికారిగా ఎంపికయ్యారు. ఉపా ధ్యక్షులుగా పద్మశ్రీ సత్పాల్, అమల్ నారాయణన్, రీనా సవీన్ వ్యవహరిస్తారు.