Indian handball federation
-
24 నుంచి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్
జైపూర్: ఇప్పటికే క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర క్రీడాంశాల్లో లీగ్‌లు జరుగుతుండగా తాజాగా ఈ జాబితాలో హ్యాండ్‌బాల్ కూడా చేరింది. జైపూర్ వేదికగా ఈనెల 24 నుంచి ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్) జరగనుంది. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయిన తెలంగాణకు చెందిన అరిశెనపల్లి జగన్మోహన్ రావు ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోర్నీలో ఆరు జట్లు (తెలంగాణ టైగర్స్, మహారాష్ట్ర హ్యాండ్‌బాల్ హస్లర్స్, పిట్‌బుల్స్ పంజాబ్, బెంగాల్ బ్లూస్, కింగ్ హాక్స్ రాజస్తాన్, యూపీ ఐకాన్స్) తలపడతాయి. జనవరి 10న ఫైనల్ జరుగుతుంది. ‘ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌తో భారత హ్యాండ్‌బాల్ చరిత్రలో నవశకం ఆరంభం కానుంది’ అని జగన్మోహన్ రావు తెలిపారు. -
హెచ్ఎఫ్ఐ అధ్యక్షునిగా జగన్మోహన్ రావు
సాక్షి, హైదరాబాద్: భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్ఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎ. జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. సమాఖ్యకు సీనియర్ ఉపాధ్యక్షులుగా ఆనందీశ్వర్ పాండే, ప్రదీప్ కుమార్ వ్యవహరించనున్నారు. కార్యదర్శిగా ప్రీత్ సింగ్ నియమితులు కాగా సంయుక్త కార్యదర్శులుగా తేజ్‌రాజ్ సింగ్, బ్రిజ్‌కుమార్ శర్మ, ఎన్కే శర్మ, వీణ శేఖర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వినయ్ కుమార్ సింగ్ కోశాధికారిగా ఎంపికయ్యారు. ఉపా ధ్యక్షులుగా పద్మశ్రీ సత్పాల్, అమల్ నారాయణన్, రీనా సవీన్ వ్యవహరిస్తారు. -
నవంబర్‌లో ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆసియా స్థాయి మెగా టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్’కు నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు. యూసుఫ్‌గూడలోని కేబీబీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే తెలిపారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఖతర్‌కు చెందిన 2 జట్లు, ఇరాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇరాక్ జట్లు తలపడతాయని రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి ఎస్. పవన్ కుమార్ చెప్పారు.