నవంబర్‌లో ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీ | asia hand ball tourney in hyderabad starts from november | Sakshi
Sakshi News home page

నవంబర్‌లో ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీ

Published Fri, Sep 8 2017 10:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

నవంబర్‌లో ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీ - Sakshi

నవంబర్‌లో ఆసియా హ్యాండ్‌బాల్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ఆసియా స్థాయి మెగా టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఆసియా హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌’కు నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు.

 

యూసుఫ్‌గూడలోని కేబీబీఆర్‌ స్టేడియం వేదికగా నవంబర్‌ 20 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య కార్యదర్శి ఆనందేశ్వర్‌ పాండే తెలిపారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఖతర్‌కు చెందిన 2 జట్లు, ఇరాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇరాక్‌ జట్లు  తలపడతాయని రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ సంఘం కార్యదర్శి ఎస్‌. పవన్‌ కుమార్‌ చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement