handball tourney
-
హైదరాబాద్‌లో ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ ఏడాది జూన్ 23 నుంచి జూలై 4 వరకు ఆసియా పురుషుల క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ జరగనుంది. ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కే కేటాయించారని... ఆసియా నుంచి 12 లేదా 15 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొంటాయని భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. చదవండి👉🏾 Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే! -
చాంపియన్ హైదరాబాద్
వరంగల్: రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ 12–6తో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ ముగింపు కార్యక్రమంలో సుబేదరి సీఐ సదయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, రిటైర్డ్ డీఎస్డీఓ జి. శివ కుమార్, డీఎస్ఏ హ్యాండ్‌బాల్ కోచ్ విష్ణువర్ధన్, పీఈటీ రజిత, హరి తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్‌లో ఆసియా హ్యాండ్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆసియా స్థాయి మెగా టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఆసియా హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్’కు నగరం ఆతిథ్యమివ్వనుంది. ఈమేరకు గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు. యూసుఫ్‌గూడలోని కేబీబీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 20 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య కార్యదర్శి ఆనందేశ్వర్ పాండే తెలిపారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఖతర్‌కు చెందిన 2 జట్లు, ఇరాన్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇరాక్ జట్లు తలపడతాయని రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి ఎస్. పవన్ కుమార్ చెప్పారు.